ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్. ఇండియన్ రిచ్చెస్ట్ సినీ నటుడు ఎవరని అడిగితే వెంటనే షారుఖ్ పేరే చెబుతారు. 1965లో ఢిల్లీలో తాజ్ మొహమ్మద్ ఖాన్, లతీఫ్ ఫాతిమా దంపతులకు ఆయన జన్మించారు. మొదట ఆయన సిరీయల్స్‌తోనే కెరియర్ ప్రారంభించి ఆపై వెండితెరపైన తన సత్తా ఏంటో చూపించాడు. ఒక సాదారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన షారుక్ బాలీవుడ్ బాద్‌షా అవడమే కాకుండా కోట్ల రూపాయలు సంపాదించారు. ఇండియాలోమ రిచ్చెస్ట్ హీరోగా షారుఖ్ ఉన్నారు.
ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరో
షారుఖ్ ఖాన్ ఆస్తులు విలువ సుమారు రూ. 7300 కోట్లకు పైమాటే అని చెప్పవచ్చు. సినిమా,వ్యాపార ప్రకటనలు,ఐపీఎల్ వంటి వాటిపై ఆయన భారీగానే సంపాదిస్తున్నారు. అలా ఏడాదికి రూ 300 కోట్ల వరకు షారుఖ్ అర్జిస్తున్నట్లు సమాచారం. ఒక్కో సినిమా కోసం రూ 120 నుంచి 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ ఉంది. తన సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉండటంతో ఆయన అడిగినంత డబ్బు ఇచ్చేందుకు నిర్మాతలు రెడీగా ఉంటారు. కానీ ఆయన ఈ మధ్య ఎక్కువ సినిమాలు తన రెడ్ చిల్లీస్ సంస్థ ద్వారా తన భార్య గౌరీ ఖాన్ నిర్మిస్తుండటం విశేషం. తన సంపాదనలో ఎక్కువగా పేద పిల్లలకు విద్యను అందించడానికి అతని స్వచ్ఛంద సంస్థ ద్వారా సాయం అందిస్తున్నాడు.
18 ఏళ్ల వయసులోనే ప్రేమ.. హిందూ సాంప్రదాయంలో పెళ్లి
షారుక్ సినిమాల్లోకి రాకముందే గౌరీ ఖాన్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. పంజాబీ హిందువు అయిన గౌరీ చిబ్బర్‌ను 1991లో సాంప్రదాయ హిందూ వివాహ పద్ధతిలో ఆయన పెళ్లి చేసుకున్నారు. పలు సందర్భాల్లో షారుక్ తమ ప్రేమకథను పంచుకున్నారు.
షారుక్ 18 ఏళ్ల వయసులో ఓ పార్టీలో గౌరీని చూశారు. తొలిచూపులోనే ఆమెను ప్రేమించారు. అప్పుడు గౌరీ వయసు 14 ఏళ్లట. ఆపై షారుక్ గౌరీ ఫోన్ నెంబర్ తెలుసుకుని.. ఫోన్లు చేసేవారట. అలా వారి మనసులు కలిసి, ఆ పరిచయం ప్రేమగా మారింది. అలా 1991 అక్టోబరు 25న వీరు వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు ఆర్యన్ (జననం 1997), ఒక కుమార్తె సుహానా (జననం 2000) 2013లో వారు మూడవ బిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు, అబ్రామ్ అనే కుమారుడు అద్దె తల్లి ద్వారా జన్మించాడు.
Comments
Please login to add a commentAdd a comment