Gauri Khan Revealed Why She Wanted To Breakup With Shah Rukh Khan, Deets Inside - Sakshi
Sakshi News home page

Shah Rukh Khan: షారుక్‌ నుంచి దూరంగా వెళ్లిపోయా, కానీ.. : గౌరీ ఖాన్‌

Published Sat, Mar 12 2022 4:50 PM | Last Updated on Sat, Mar 12 2022 7:00 PM

Gauri Khan Revealed Why She Wanted To Breakup With Shah Rukh Khan, Deets Inside - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌ అంటే పడిచచ్చే అమ్మాయిలు ఎందరో! కండలు తిరిగిన దేహంతోనే కాదు కట్టిపడేసే నటనతో ఎంతోమంది అభిమానాన్ని చూరగొన్నాడీ హీరో. గౌరీఖాన్‌ను వివాహం చేసుకున్న ఇతడికి ముగ్గురు పిల్లలున్నారు. అందులో ఒకరైన ఆర్యన్‌ నటుడిగా కాకుండా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా త్వరలోనే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే భర్తను ఎంతగానో ప్రేమించే గౌరీ ఖాన్‌ ఒకానొక సమయంలో మాత్రం అతడిని వదిలేద్దామనుకుందట! ఈ విషయాన్ని స్వయంగా ఆవిడే వెల్లడించింది. ఆ మధ్య కాఫీ విత్‌ కరణ్‌ ప్రోగ్రామ్‌కు హాజరైన గౌరీ.. 'పెళ్లి చేసుకుందామనుకున్నప్పుడు నాకోసం కొంత సమయం తీసుకుంటానని చెప్పాను. కానీ షారుక్‌ మాట వింటేగా.. అతడికి పొజెసివ్‌నెస్‌ ఎక్కువ. దాన్ని నేను భరించలేకపోయాను. నాకంటూ పర్సనల్‌ స్పేస్‌ కావాలని చెప్పి తనకు దూరంగా వెళ్లిపోయాను. కానీ మళ్లీ ఆలోచించుకుని తన దగ్గరకు తిరిగి వెళ్లాను' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది, కాగా షారుక్‌, గౌరీ ఖాన్‌లు 1991 అక్టోబర్‌ 25న పెళ్లి చేసుకున్నారు. షారుక్‌ సినిమాల విషయానికి వస్తే అతడు చివరిసారిగా 2018లో జీరో సినిమాలో నటించాడు. అతడు నటించిన లేటెస్ట్‌ మూవీ పఠాన్‌ వచ్చే ఏడాది జనవరి 25న రిలీజ్‌ కానుంది.

చదవండి: స్పైడర్‌ మ్యాన్‌ నో వే హోమ్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement