షారుఖ్ ఖాన్ తల్లిది హైదరాబాద్, తండ్రిది పెషావర్.. ఫీనిక్స్‌ పక్షిలా జీవితం | Shah Rukh Khan 58th Birthday Special Story | Sakshi
Sakshi News home page

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ తల్లిది హైదరాబాద్, తండ్రిది పెషావర్.. మధ్యతరగతి నుంచి కోట్లలో సంపద

Published Thu, Nov 2 2023 1:47 PM | Last Updated on Thu, Nov 2 2023 4:20 PM

Shah Rukh Khan 58th Birthday Special Story - Sakshi

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్.. 1965లో ఢిల్లీలో తాజ్ మొహమ్మద్ ఖాన్‌, లతీఫ్ ఫాతిమా దంపతులకు జన్మించారు. మొదట ఆయన సిరీయల్స్‌తోనే కెరియర్‌ ప్రారంభించి ఆపై వెండితెరపైన తన సత్తా ఏంటో చూపించాడు. ఒక సాదారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన షారుక్‌ బాలీవుడ్ బాద్‌షా ఎలా అయ్యాడు..? ఒక నటుడిగా మూడు దశాబ్దాలుగా బాలీవుడ్‌ను కింగ్‌లా ఎలా ఏలుతున్నాడు..?  తన తండ్రి ఎం చేసేవాడు..? వంటి విషయాలు నేడు నవంబర్‌ 2 ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలుసుకుందాం.

షారుఖ్ ఖాన్ 2 నవంబర్ 1965 న ఢిల్లీలోని ఒక ముస్లిం కుటుంబంలో జన్మించాడు .  అతను తన జీవితంలో మొదటి ఐదు సంవత్సరాలు మంగళూరులో గడిపాడు , అక్కడ అతని తల్లితండ్రులు ఇఫ్తికార్ అహ్మద్ 1960లలో పోర్ట్ చీఫ్ ఇంజనీర్‌గా పనిచేశారు.  ఖాన్ ట్విట్టర్‌లో తనను తాను 'సగం హైదరాబాదీ (తల్లి), సగం పఠాన్ (తండ్రి), కొంత కాశ్మీరీ (అమ్మమ్మ)' గా అభివర్ణించుకున్నారు. ఆటలలో ఎంతో చురుగ్గా ఉన్న షారుఖ్‌ తన భుజానికి గాయం కావడంతో గేమ్స్‌ నుంచి వైదొలిగాడు. హాకీ,ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా ఆయన ఎన్నో అవార్డులను దక్కించుకున్నాడు. భుజానికి గాయం కారణంగా ఆటలకు ఫుల్‌ స్టాప్‌ పడింది. అంతటితో తన కలల ప్రపంచం ఆగినట్లు అయింది. కానీ అంతటితో తన టాలెంట్‌ ఆగిపోలేదు. ఆ తర్వాత మొదటిసారిగా సీరియల్‌ వైపు అడుగులు వేశాడు.  

1989లో ఫౌజీ అనే టెలివిజన్‌ సిరీస్‌ ద్వారా షారుఖ్‌ ఎంట్రీ ఇచ్చాడు. అలా పలు సిరీస్‌లలో కనిపించిన షారుఖ్‌ తన అమ్మగారు 1991లో మరణించండంతో ఒక్కసారిగా ఒంటిరి అయిపోయిడు. కొంత కాలం  తర్వాత సీరియల్స్‌కు గుడ్‌బై చెప్పి 1992లో  దీవానాలో ఆయన కనిపించాడు. ఇందులో దివ్యభారతి హీరోయిన్‌గా నటించింది.. మొదటి సినిమాతోనే బాలీవుడ్‌ బాక్స్ ఆఫీస్‌ను షారుఖ్‌ షేక్‌ చేశాడు. అలా తన కెరియర్‌కు బలమైన పునాది మొదటి సినిమాతోనే పడిపోయింది. అలా పలు యాంటీ-హీరో చిత్రాల్లో కూడా ఆయన నటించాడు. కానీ 2002లో వచ్చిన ‘దేవదాస్‌’ సినిమా ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది.

ఈ సినిమాలో షారుక్‌ నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం 10 ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా అనేక ప్రశంసలను పొందింది. ఆ తర్వాత వరుస సినిమాలతో అగ్ర కథానాయకుడిగా ఎదిగారాయన. 1999–2003 సమయంలో నిర్మాతగా పలు సినిమాలు నిర్మించి ఆర్థికంగా భారీగా నష్టపోయాడు. ఆ సమయంలో ఆయనకు సినిమా ఛాన్స్‌లు కూడా తగ్గాయి. 2004లో తన డ్రీమ్జ్ అన్‌లిమిటెడ్‌ను రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా మార్చాడు షారుఖ్‌.. ఆ బ్యానర్‌లోనే మై హూ నా, వీర్-జారా వంటి చిత్రాలు తనే హీరోగా నిర్మించాడు. . భారతదేశం-పాకిస్తాన్ సంబంధాల యొక్క కల్పిత కథనంతో అవి తెరకెక్కాయి.

అవి బాక్సాఫీస్‌ వద్ద దుమ్ములేపాయి. 2004లో ఆ రెండు చిత్రాల ద్వారా సుమారు రూ. 170 కోట్లు ఆయన ఆర్జించాడు. అలా కష్టాల నుంచి ఫీనిక్స్‌ పక్షిలా ఒక్కసారిగా ఎగిసిపడ్డాడు షారుఖ్‌.. బాద్‌షా సినీ కెరీర్‌ ఆరంభించడానికి ముందే ఆయన తల్లిదండ్రులు మరణించారు. ఈ విషయంలో ఆయన అనేక సందర్భాల్లో ఆవేదన చెందారు. తన సక్సెస్‌ను తల్లిదండ్రులు చూడలేదని, వారు ప్రాణాలతో ఉండుంటే చాలా సంతోషించే వారని అన్నారు. 

షారుఖ్ ఖాన్ ఆస్తులు విలువ
షారుఖ్ ఖాన్ ఆస్తులు విలువ సుమారు రూ. 6500 కోట్లకు పైమాటే అని చెప్పవచ్చు. సినిమా,వ్యాపార ప్రకటనలు,ఐపీఎల్‌ వంటి వాటిపై ఆయన భారీగానే సంపాదిస్తున్నారు. అలా ఏడాదికి రూ 300 కోట్ల వరకు షారుఖ్‌ అర్జిస్తున్నట్లు సమాచారం. ఒక్కో సినిమా కోసం రూ 120 నుంచి 150 కోట్ల వరకు రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నట్లు టాక్‌ ఉంది. తన సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌ ఉండటంతో ఆయన అడిగినంత డబ్బు ఇచ్చేందుకు నిర్మాతలు రెడీగా ఉంటారు. కానీ ఆయన ఈ మధ్య ఎక్కువ సినిమాలు తన రెడ్‌ చిల్లీస్‌ సంస్థ ద్వారా తన భార్య గౌరీ ఖాన్‌ నిర్మిస్తుండటం విశేషం. తన సంపాదనలో ఎక్కువగా పేద పిల్లలకు విద్యను అందించడానికి అతని స్వచ్ఛంద సంస్థ ద్వారా సాయం అందిస్తున్నాడు.

హిందూ సాంప్రదాయంలో ప్రేమ పెళ్లి
షారుక్‌ సినిమాల్లోకి రాకముందే గౌరీ ఖాన్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. పంజాబీ హిందువు అయిన గౌరీ చిబ్బర్‌ను 25 అక్టోబర్ 1991న సాంప్రదాయ హిందూ వివాహ పద్ధతిలో ఆయన పెళ్లి చేసుకున్నారు. పలు సందర్భాల్లో షారుక్‌ తమ ప్రేమకథను పంచుకున్నారు. ఢిల్లీకి చెందిన షారుక్‌ 18 ఏళ్ల వయసులో ఓ పార్టీలో గౌరీని చూశారు. తొలిచూపులోనే ఆమెను ప్రేమించారు. అప్పుడు గౌరీ వయసు 14 ఏళ్లట. ఆపై షారుక్‌ గౌరీ ఫోన్‌ నెంబర్‌ తెలుసుకుని.. ఫోన్లు చేసేవారట. అలా వారి మనసులు కలిసి, ఆ పరిచయం ప్రేమగా మారింది.

వివాహానికి ముందు షారుక్‌, గౌరీల మధ్య చిన్న గొడవ రావడంతో.. షారుక్‌కు చెప్పకుండా గౌరీ డిల్లీ నుంచి ముంబయి బయలుదేరారు. అప్పుడు షారుక్‌ జేబులో రూ.10వేలు మాత్రమే ఉన్నాయట. ప్రియురాలు కోపంతో వెళ్లిపోవడంతో ఆమె వెంటే షారుక్‌ కూడా బయలుదేరారట. చివరికి ముంబయి బీచ్‌లో ఇద్దరు కలుసుకున్నారు. 1991 అక్టోబరు 25న వీరు వివాహం చేసుకున్నారు. వారికి  ఒక కుమారుడు ఆర్యన్ (జననం 1997), ఒక కుమార్తె సుహానా (జననం 2000) 2013లో వారు మూడవ బిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు, అబ్రామ్ అనే కుమారుడు అద్దె తల్లి ద్వారా జన్మించాడు.

షారుక్‌ ఖాన్ జీవితంలో ఇవన్నీ ప్రత్యేకం..

షారుఖ్ తల్లిది హైదరాబాద్(భారత్), తండ్రిది పెషావర్(పాకిస్తాన్), నానమ్మది కశ్మీర్
► షారూఖ్ ఖాన్ తండ్రి, మీర్ తాజ్ మహమ్మద్ ఖాన్, పెషావర్ నుంచి వచ్చిన ఒక భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త , అతను అహింసా ప్రతిఘటన ఉద్యమంలో పాల్గొని స్వతంత్ర భారతదేశాన్ని కోరుకున్నాడు
► షారుఖ్‌ను సైన్యంలో చేర్పించాలనే ఉద్దేశ్యంతో కోల్‌కతాలోని సైనిక పాఠశాలలో ఆయన తండ్రి చేర్పించితే షారుఖ్‌ తల్లి వద్దని పట్టుబట్టడంతో తిరిగి వచ్చేశాడు
► చాలా రోజుల వరకు షారుఖ్‌ ఖాన్‌కు హిందీ భాషా రాదు
► ప్రపంచవ్యాప్తంగా యాభై మంది అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో ఒకరిగా ఖాన్‌ ఉన్నారు
► 2008లో, ఖాన్, జూహీ చావ్లా ఆమె భర్త జే మెహతా భాగస్వామ్యంతో , కోల్‌కతాకు ప్రాతినిధ్యం వహిస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) క్రికెట్‌ జట్టును కొనుగోలు చేశారు
► పల్స్ పోలియో, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సహా వివిధ ప్రభుత్వ ప్రచారాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఆయన ఉన్నారు
► కోవిడ్‌ సమయంలో తన 4-అంతస్తుల వ్యక్తిగత కార్యాలయ స్థలాన్ని కోవిడ్‌ రోగులకు చికిత్స అందించేందుకు ఇచ్చేశారు
 

► 14 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను షారుక్‌ ఖాన్‌ అందుకున్నాడు
► 2005లో  పద్మశ్రీ పురస్కారంతో భారత ప్రభుత్వం ఆయన్ను సత్కరించింది 
► భారత్‌, ఇతర దేశాలకు చెందిన ప్రముఖ విశ్వ విద్యాలయాల నుంచి  ఐదు గౌరవ డాక్టరేట్లను అందుకున్నారు
► ఖాన్ ప్రకారం, అతను ఇస్లాంను బలంగా విశ్వసిస్తాడు కానీ తన భార్య మతానికి (హిందూ) కూడా విలువ ఇస్తాడు
► షారుఖ్‌ పిల్లలు రెండు మతాలను అనుసరిస్తారు. అతని ఇంటిలో ఖురాన్, హిందూ దేవతల ప్రతిమలు ఒకేచోట ఉంటాయి

- బ్రహ్మ కోడూరు, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement