Red Chillies Entertainment
-
ఇండియన్ రిచ్చెస్ట్ హీరో 'షారుఖ్ ఖాన్' ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. ఇండియన్ రిచ్చెస్ట్ సినీ నటుడు ఎవరని అడిగితే వెంటనే షారుఖ్ పేరే చెబుతారు. 1965లో ఢిల్లీలో తాజ్ మొహమ్మద్ ఖాన్, లతీఫ్ ఫాతిమా దంపతులకు ఆయన జన్మించారు. మొదట ఆయన సిరీయల్స్తోనే కెరియర్ ప్రారంభించి ఆపై వెండితెరపైన తన సత్తా ఏంటో చూపించాడు. ఒక సాదారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన షారుక్ బాలీవుడ్ బాద్షా అవడమే కాకుండా కోట్ల రూపాయలు సంపాదించారు. ఇండియాలోమ రిచ్చెస్ట్ హీరోగా షారుఖ్ ఉన్నారు.ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోషారుఖ్ ఖాన్ ఆస్తులు విలువ సుమారు రూ. 7300 కోట్లకు పైమాటే అని చెప్పవచ్చు. సినిమా,వ్యాపార ప్రకటనలు,ఐపీఎల్ వంటి వాటిపై ఆయన భారీగానే సంపాదిస్తున్నారు. అలా ఏడాదికి రూ 300 కోట్ల వరకు షారుఖ్ అర్జిస్తున్నట్లు సమాచారం. ఒక్కో సినిమా కోసం రూ 120 నుంచి 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ ఉంది. తన సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉండటంతో ఆయన అడిగినంత డబ్బు ఇచ్చేందుకు నిర్మాతలు రెడీగా ఉంటారు. కానీ ఆయన ఈ మధ్య ఎక్కువ సినిమాలు తన రెడ్ చిల్లీస్ సంస్థ ద్వారా తన భార్య గౌరీ ఖాన్ నిర్మిస్తుండటం విశేషం. తన సంపాదనలో ఎక్కువగా పేద పిల్లలకు విద్యను అందించడానికి అతని స్వచ్ఛంద సంస్థ ద్వారా సాయం అందిస్తున్నాడు.18 ఏళ్ల వయసులోనే ప్రేమ.. హిందూ సాంప్రదాయంలో పెళ్లిషారుక్ సినిమాల్లోకి రాకముందే గౌరీ ఖాన్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. పంజాబీ హిందువు అయిన గౌరీ చిబ్బర్‌ను 1991లో సాంప్రదాయ హిందూ వివాహ పద్ధతిలో ఆయన పెళ్లి చేసుకున్నారు. పలు సందర్భాల్లో షారుక్ తమ ప్రేమకథను పంచుకున్నారు. షారుక్ 18 ఏళ్ల వయసులో ఓ పార్టీలో గౌరీని చూశారు. తొలిచూపులోనే ఆమెను ప్రేమించారు. అప్పుడు గౌరీ వయసు 14 ఏళ్లట. ఆపై షారుక్ గౌరీ ఫోన్ నెంబర్ తెలుసుకుని.. ఫోన్లు చేసేవారట. అలా వారి మనసులు కలిసి, ఆ పరిచయం ప్రేమగా మారింది. అలా 1991 అక్టోబరు 25న వీరు వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు ఆర్యన్ (జననం 1997), ఒక కుమార్తె సుహానా (జననం 2000) 2013లో వారు మూడవ బిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు, అబ్రామ్ అనే కుమారుడు అద్దె తల్లి ద్వారా జన్మించాడు. -
షారుక్ ఖాన్ నిర్మాత.. డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తున్న థ్రిల్లర్ చిత్రం
తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకొని అభిమానులను సొంతం చేసుకుంది బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్. వరుస సినిమాలతో ఆమె కెరియర్ ఎంతో బిజీగా ఉంది. గతేడాదిలో ఆరు సినిమాలతో మెప్పించినా ఈ బ్యూటీ కొత్త ఏడాదిలో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది. బదాయి దో, గోవింద నామ్ మేరాలో రెండు అద్భుతమైన ప్రదర్శనలతో భారతదేశంలోని అత్యుత్తమ నటీమణులలో తానూ ఒకరని మరోసారి నిరూపించుకుంది భూమి ఆమె కీలక పాత్రలో పులకిత్ దర్శకత్వంలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘భక్షక్’ సినిమాతో ఆమె ఈ ఏడాది తొలిసారి కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై షారుక్‌ఖాన్, గౌరీఖాన్‌లు నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అన్నీ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ప్రముఖ ఓటీటీ వేదిక అయిన నెట్‌ఫ్లిక్స్‌లో భక్షక్ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఈ చిత్రం హిందీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. తాజాగా విడుదుల అయిన టీజర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. నిజాలు నిర్భయంగా బయట పెట్టే జర్నలిస్ట్ వైశాలీ సింగ్ పాత్రలో భూమి పెడ్నేకర్ కనిపించనుంది. వాస్తవ సంఘటనల ఆధారం చేసుకుని ఈ చిత్రాన్ని డైరెక్టర్ తెరకెక్కించాడు. ప్రస్తుత సమాజంలో బాలికలు, మహిళలపై జరుగుతున్న నేరాలను జర్నలిస్ట్‌గా వైశాలి ఎలా గుర్తించింది..? అనేది చాలా ఆసక్తిగా ఉండనున్నట్లు టీజర్‌ను చూస్తే అర్థం అవుతుంది. ఈ సాహసవంతమైన కార్యచరణలో ఆమెకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి అనేది తెలియాలంటే ఫిబ్రవరి 9వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో చూడాల్సిందే.. -
షారుఖ్ ఖాన్ తల్లిది హైదరాబాద్, తండ్రిది పెషావర్.. ఫీనిక్స్ పక్షిలా జీవితం
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.. 1965లో ఢిల్లీలో తాజ్ మొహమ్మద్ ఖాన్, లతీఫ్ ఫాతిమా దంపతులకు జన్మించారు. మొదట ఆయన సిరీయల్స్తోనే కెరియర్ ప్రారంభించి ఆపై వెండితెరపైన తన సత్తా ఏంటో చూపించాడు. ఒక సాదారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన షారుక్ బాలీవుడ్ బాద్షా ఎలా అయ్యాడు..? ఒక నటుడిగా మూడు దశాబ్దాలుగా బాలీవుడ్‌ను కింగ్‌లా ఎలా ఏలుతున్నాడు..? తన తండ్రి ఎం చేసేవాడు..? వంటి విషయాలు నేడు నవంబర్ 2 ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలుసుకుందాం. షారుఖ్ ఖాన్ 2 నవంబర్ 1965 న ఢిల్లీలోని ఒక ముస్లిం కుటుంబంలో జన్మించాడు . అతను తన జీవితంలో మొదటి ఐదు సంవత్సరాలు మంగళూరులో గడిపాడు , అక్కడ అతని తల్లితండ్రులు ఇఫ్తికార్ అహ్మద్ 1960లలో పోర్ట్ చీఫ్ ఇంజనీర్‌గా పనిచేశారు. ఖాన్ ట్విట్టర్లో తనను తాను 'సగం హైదరాబాదీ (తల్లి), సగం పఠాన్ (తండ్రి), కొంత కాశ్మీరీ (అమ్మమ్మ)' గా అభివర్ణించుకున్నారు. ఆటలలో ఎంతో చురుగ్గా ఉన్న షారుఖ్ తన భుజానికి గాయం కావడంతో గేమ్స్ నుంచి వైదొలిగాడు. హాకీ,ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఆయన ఎన్నో అవార్డులను దక్కించుకున్నాడు. భుజానికి గాయం కారణంగా ఆటలకు ఫుల్ స్టాప్ పడింది. అంతటితో తన కలల ప్రపంచం ఆగినట్లు అయింది. కానీ అంతటితో తన టాలెంట్ ఆగిపోలేదు. ఆ తర్వాత మొదటిసారిగా సీరియల్ వైపు అడుగులు వేశాడు. 1989లో ఫౌజీ అనే టెలివిజన్ సిరీస్ ద్వారా షారుఖ్ ఎంట్రీ ఇచ్చాడు. అలా పలు సిరీస్‌లలో కనిపించిన షారుఖ్ తన అమ్మగారు 1991లో మరణించండంతో ఒక్కసారిగా ఒంటిరి అయిపోయిడు. కొంత కాలం తర్వాత సీరియల్స్‌కు గుడ్‌బై చెప్పి 1992లో దీవానాలో ఆయన కనిపించాడు. ఇందులో దివ్యభారతి హీరోయిన్గా నటించింది.. మొదటి సినిమాతోనే బాలీవుడ్ బాక్స్ ఆఫీస్‌ను షారుఖ్ షేక్ చేశాడు. అలా తన కెరియర్‌కు బలమైన పునాది మొదటి సినిమాతోనే పడిపోయింది. అలా పలు యాంటీ-హీరో చిత్రాల్లో కూడా ఆయన నటించాడు. కానీ 2002లో వచ్చిన ‘దేవదాస్’ సినిమా ఆయన కెరీర్లో మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో షారుక్ నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం 10 ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా అనేక ప్రశంసలను పొందింది. ఆ తర్వాత వరుస సినిమాలతో అగ్ర కథానాయకుడిగా ఎదిగారాయన. 1999–2003 సమయంలో నిర్మాతగా పలు సినిమాలు నిర్మించి ఆర్థికంగా భారీగా నష్టపోయాడు. ఆ సమయంలో ఆయనకు సినిమా ఛాన్స్‌లు కూడా తగ్గాయి. 2004లో తన డ్రీమ్జ్ అన్లిమిటెడ్ను రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్గా మార్చాడు షారుఖ్.. ఆ బ్యానర్లోనే మై హూ నా, వీర్-జారా వంటి చిత్రాలు తనే హీరోగా నిర్మించాడు. . భారతదేశం-పాకిస్తాన్ సంబంధాల యొక్క కల్పిత కథనంతో అవి తెరకెక్కాయి. అవి బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపాయి. 2004లో ఆ రెండు చిత్రాల ద్వారా సుమారు రూ. 170 కోట్లు ఆయన ఆర్జించాడు. అలా కష్టాల నుంచి ఫీనిక్స్ పక్షిలా ఒక్కసారిగా ఎగిసిపడ్డాడు షారుఖ్.. బాద్షా సినీ కెరీర్ ఆరంభించడానికి ముందే ఆయన తల్లిదండ్రులు మరణించారు. ఈ విషయంలో ఆయన అనేక సందర్భాల్లో ఆవేదన చెందారు. తన సక్సెస్‌ను తల్లిదండ్రులు చూడలేదని, వారు ప్రాణాలతో ఉండుంటే చాలా సంతోషించే వారని అన్నారు. షారుఖ్ ఖాన్ ఆస్తులు విలువ షారుఖ్ ఖాన్ ఆస్తులు విలువ సుమారు రూ. 6500 కోట్లకు పైమాటే అని చెప్పవచ్చు. సినిమా,వ్యాపార ప్రకటనలు,ఐపీఎల్ వంటి వాటిపై ఆయన భారీగానే సంపాదిస్తున్నారు. అలా ఏడాదికి రూ 300 కోట్ల వరకు షారుఖ్ అర్జిస్తున్నట్లు సమాచారం. ఒక్కో సినిమా కోసం రూ 120 నుంచి 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ ఉంది. తన సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉండటంతో ఆయన అడిగినంత డబ్బు ఇచ్చేందుకు నిర్మాతలు రెడీగా ఉంటారు. కానీ ఆయన ఈ మధ్య ఎక్కువ సినిమాలు తన రెడ్ చిల్లీస్ సంస్థ ద్వారా తన భార్య గౌరీ ఖాన్ నిర్మిస్తుండటం విశేషం. తన సంపాదనలో ఎక్కువగా పేద పిల్లలకు విద్యను అందించడానికి అతని స్వచ్ఛంద సంస్థ ద్వారా సాయం అందిస్తున్నాడు. హిందూ సాంప్రదాయంలో ప్రేమ పెళ్లి షారుక్ సినిమాల్లోకి రాకముందే గౌరీ ఖాన్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. పంజాబీ హిందువు అయిన గౌరీ చిబ్బర్‌ను 25 అక్టోబర్ 1991న సాంప్రదాయ హిందూ వివాహ పద్ధతిలో ఆయన పెళ్లి చేసుకున్నారు. పలు సందర్భాల్లో షారుక్ తమ ప్రేమకథను పంచుకున్నారు. ఢిల్లీకి చెందిన షారుక్ 18 ఏళ్ల వయసులో ఓ పార్టీలో గౌరీని చూశారు. తొలిచూపులోనే ఆమెను ప్రేమించారు. అప్పుడు గౌరీ వయసు 14 ఏళ్లట. ఆపై షారుక్ గౌరీ ఫోన్ నెంబర్ తెలుసుకుని.. ఫోన్లు చేసేవారట. అలా వారి మనసులు కలిసి, ఆ పరిచయం ప్రేమగా మారింది. వివాహానికి ముందు షారుక్, గౌరీల మధ్య చిన్న గొడవ రావడంతో.. షారుక్‌కు చెప్పకుండా గౌరీ డిల్లీ నుంచి ముంబయి బయలుదేరారు. అప్పుడు షారుక్ జేబులో రూ.10వేలు మాత్రమే ఉన్నాయట. ప్రియురాలు కోపంతో వెళ్లిపోవడంతో ఆమె వెంటే షారుక్ కూడా బయలుదేరారట. చివరికి ముంబయి బీచ్‌లో ఇద్దరు కలుసుకున్నారు. 1991 అక్టోబరు 25న వీరు వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు ఆర్యన్ (జననం 1997), ఒక కుమార్తె సుహానా (జననం 2000) 2013లో వారు మూడవ బిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు, అబ్రామ్ అనే కుమారుడు అద్దె తల్లి ద్వారా జన్మించాడు. షారుక్ ఖాన్ జీవితంలో ఇవన్నీ ప్రత్యేకం.. ► షారుఖ్ తల్లిది హైదరాబాద్(భారత్), తండ్రిది పెషావర్(పాకిస్తాన్), నానమ్మది కశ్మీర్ ► షారూఖ్ ఖాన్ తండ్రి, మీర్ తాజ్ మహమ్మద్ ఖాన్, పెషావర్ నుంచి వచ్చిన ఒక భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త , అతను అహింసా ప్రతిఘటన ఉద్యమంలో పాల్గొని స్వతంత్ర భారతదేశాన్ని కోరుకున్నాడు ► షారుఖ్‌ను సైన్యంలో చేర్పించాలనే ఉద్దేశ్యంతో కోల్‌కతాలోని సైనిక పాఠశాలలో ఆయన తండ్రి చేర్పించితే షారుఖ్ తల్లి వద్దని పట్టుబట్టడంతో తిరిగి వచ్చేశాడు ► చాలా రోజుల వరకు షారుఖ్ ఖాన్‌కు హిందీ భాషా రాదు ► ప్రపంచవ్యాప్తంగా యాభై మంది అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో ఒకరిగా ఖాన్ ఉన్నారు ► 2008లో, ఖాన్, జూహీ చావ్లా ఆమె భర్త జే మెహతా భాగస్వామ్యంతో , కోల్‌కతాకు ప్రాతినిధ్యం వహిస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) క్రికెట్ జట్టును కొనుగోలు చేశారు ► పల్స్ పోలియో, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సహా వివిధ ప్రభుత్వ ప్రచారాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఆయన ఉన్నారు ► కోవిడ్ సమయంలో తన 4-అంతస్తుల వ్యక్తిగత కార్యాలయ స్థలాన్ని కోవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు ఇచ్చేశారు ► 14 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను షారుక్ ఖాన్ అందుకున్నాడు ► 2005లో పద్మశ్రీ పురస్కారంతో భారత ప్రభుత్వం ఆయన్ను సత్కరించింది ► భారత్, ఇతర దేశాలకు చెందిన ప్రముఖ విశ్వ విద్యాలయాల నుంచి ఐదు గౌరవ డాక్టరేట్లను అందుకున్నారు ► ఖాన్ ప్రకారం, అతను ఇస్లాంను బలంగా విశ్వసిస్తాడు కానీ తన భార్య మతానికి (హిందూ) కూడా విలువ ఇస్తాడు ► షారుఖ్ పిల్లలు రెండు మతాలను అనుసరిస్తారు. అతని ఇంటిలో ఖురాన్, హిందూ దేవతల ప్రతిమలు ఒకేచోట ఉంటాయి - బ్రహ్మ కోడూరు, సాక్షి వెబ్‌డెస్క్ -
IPL 2023:షారుక్ రైట్ హ్యాండ్, కేకేఆర్ సీఈవో గురించి ఇంట్రస్టింగ్ విషయాలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాపులర్ జట్లలో ఒకటి కోల్‌కతా నైట్ రైడర్స్ .రెండుసార్లు( 2012 , 2014లో) ఐపీఎల్ టైటిల్‌ను దక్కించుకుని క్రికెట్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. తాజాగా ఐపీఎల్ 2023 పోరు నడుస్తున్న సందర్భంగా, షారుక్ ఖాన్ కుడిభుజం లాంటివాడు, కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ నెట్‌వర్త్ తదితర విషయాలపై ఆసక్తి నెలకొంది. ఐపీఎల్ క్రికెట్ ఫ్రాంచైజీ కేకేఆర్ యజమాని, బాలీవుడ్ స్టార్హీరో షారుక్ ఖాన్ దేశంలోని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఓనరు కూడా. అలాగే కేకేఆర్ సీఈవోఅయిన వెంకీ రెడ్ చిల్లీస్ సీఈవో కూడా కావడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెడ్ చిల్లీస్‌కు సీఈవోగా బాధ్యతలను స్వీకరించారు వెంకీ . అనుభవజ్ఞుడైన వ్యాపార నిపుణుడు రెడ్ చిల్లీస్‌కు సీఈవోగా ఉండడం చాలా ఆనందంగా ఉందని,కేకేర్లో అద్భుతంగా పనిచేసిన వెంకీ రెడ్ చిల్లీస్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెడతానే నమ్మకం ఉందని షారుక్ ఖాన్ ప్రకటించారు. అనేక గ్లోబల్ మార్కెట్లలో ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశ్రమలో 25 సంవత్సరాలు, అమెరికా, కెనడా, ఆసియాలో అనేక సీనియర్ నాయకత్వ స్థానాల్లో పనిచేసిన అనుభవం వెంకీ సొంతం.క్రికెటర్ అవ్వవాలనుకున్న వెంకీ క్రికెట్ జట్టు సీఈవోగా అవతరించాడం విశేషం. ప్రస్తుతం కేకేఆర్, రెడ్ చిల్లీస్ బాధ్యతలను చూస్తున్న వెంకీ మైసూర్ నికర విలువ మీడియా కథనాల ప్రకారం దాదాపు రూ.14 కోట్లు. (సర్కార్ కొలువుకు గుడ్‌బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?) కర్ణాటకలోని మైసూర్లో పుట్టారు వెంకీ. క్రికెటర్‌గా రంజీ ట్రోఫీకి చేరాలని కలలుకన్న వెంకీ తండ్రి కోరికనుమన్నించి క్రికెట్ నుండి తప్పుకుని మద్రాస్ విశ్వవి ద్యాలయంలో మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. (గుడ్ ఫ్రైడే ఆఫర్: రూ.1500కే నథింగ్ ఫోన్ (1)) కేకేఆర్‌లో చేరడానికి ముందు వెంకీ మైసూర్‌కు బీమా పరిశ్రమలో పెద్ద పేరే ఉంది. 2010లో, వెంకీ మైసూర్ మెట్‌లైఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో, అన్నింటినీ విడిచిపెట్టి, షారుక్ ఖాన్ కేకేఆర్ ఫ్రాంచైజీలో చేరారు. అసలు కరీబియన్ ప్రీమియర్ లీగ్ జట్టు ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌ను కొనుగోలు ప్లాన్ వెనుక వెంకీ ఉన్నట్టు క్రీడా వర్గాలు నమ్ముతారు. బెంగుళూరులోని అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. వెంకీ భార్య పేరు వీణ, ముగ్గురు పిల్లలున్నారు. కాగా ఐపీఎల్ 2022లో పేలవ ప్రదర్శనపై వెంకీపై విమర్శలొచ్చాయి. అలాగే టీం సెలక్షన్లో జోక్యం చేసుకుంటు న్నాడంటూ కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆరోపణలు వీటికి మరింత ఆజ్యం పోసాయి. అయితే ఇది అంతర్జాతీయ క్రికెట్ లాంటిది కాదు. ఓనర్లుప్రత్యక్షంగా పాల్గొనక పోయిన సమయంలో తమ అభిప్రాయాలను సీఈవో ద్వారా లేదా ప్రధాన కోచ్‌తో నేరుగా మాట్లాడతారని ఫ్రాంచైజీ తిప్పికొట్టింది. కేకేఆర్ విజయపథంలో నడిపిండం ద్వారా అనేక లాభాలను తెచ్చిపెట్టారు వెంకీ. ఫోర్బ్స్ ప్రకారంకేకేఆర్ నికర విలువ 1.1 బిలియన్లు డాలర్లు, ఆదాయం 41.2 మిలియన్ డాలర్లు. 2004లో స్థాపించిన డ్రీమ్జ్ అన్లిమిటెడ్ సంస్థను కొనుగోలు చేసిన ఎస్ఆర్కే, గౌరీ ఖాన్ రెడ్ చిల్లీస్గా మార్చారు. రెడ్ చిల్లీస్ పది చిత్రాలకు నిర్మాతగా, ఐదు చిత్రాలకు సహనిర్మాతగా ఉంది. -
లవ్ హాస్టల్
విక్రాంత్ మెస్సే, ‘దంగల్’ ఫేమ్ శాన్యా మల్హోత్రా జంటగా బాబీ డియోల్ ముఖ్యపాత్రలో నటించనున్న నూతన చిత్రాన్ని గురువారం అధికారికంగా ప్రకటించారు. ‘గుర్గావ్’ చిత్రదర్శకుడు శంకర్ రమణ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మనీష్ ముంద్రాతో కలిసి షారుక్ ఖాన్ తన నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ పతాకంపై నిర్మించనున్నారు. నార్త్ ఇండియాలో జరిగిన ఘటనల ఆధారంగా ‘లవ్హాస్టల్’ సినిమాను రూపొందించనున్నారు. వచ్చే ఏడాది మొదట్లో షూటింగ్ ఆరంభం కానుంది. ఈలోపు ఈ సినిమాలో నటించనున్న నటీనటులందరూ వర్క్‌షాప్స్‌లో పాల్గొంటారని చిత్రబృందం తెలిపింది. ఊపిరిబిగపట్టే క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం సాగుతుందని నిర్మాతలు చెప్పారు. -
ఆ పుస్తకం షారూఖ్ ఆలోచనలు మార్చేసింది
హీరోగా వ్యాపారా వేత్తగా బిజీగా ఉండే బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్, ఏ మాత్రం కాళీ సమయం దొరికినా పుస్తకాలు చదువుతూ కాలం గడుపుతాడు. ఎక్కువగా ఫిక్షన్, నాన్ ఫిక్షన్ రచనలను ఇష్టపడే షారూఖ్, ఇటీవల చదివిన స్టీవ్ జాబ్స్ బయోగ్రఫి, వ్యాపారం పట్ల తన ఆలోచనా విధానాన్ని మార్చేసిందంటున్నాడు. యాపిల్ సహ వ్యవస్థాపకుడైన స్టీవ్ జాబ్స్ సూచించినట్టుగా ఒక సమయంలో కేవలం ఒక పని మీదే దృష్టి పట్టాలని నిర్ణయించుకున్నాడు షారూఖ్. ప్రస్తుతం తన వ్యాపార సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా క్రియేటివ్ ఫీల్డ్‌కు సంబంధించిన ఎన్నో వ్యాపారాలు చేస్తున్నాడు షారూఖ్. సినిమా నిర్మాణంతో పాటు విజువల్ ఎఫెక్ట్స్, టివి ప్రొడక్షన్, యాడ్ ఫిలిం మేకింగ్ లాంటి రంగాల్లో ఉన్న షారూఖ్, టివి, యాడ్ రంగాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. పూర్తిగా సినీ రంగం మీద దృష్టి పెట్టాలన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించాడు షారూఖ్ ఖాన్. -
హ్యాపీ న్యూ ఇయర్‌తో కేశ్‌కింగ్ సంయుక్త ప్రచారం
హైదరాబాద్: షారూక్‌ఖాన్ నటించిన హ్యాపీ న్యూ ఇయర్‌ను నిర్మించిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్తో కేశ్‌కింగ్ హెయిర్ ఆయిల్, షాంపూ, క్యాప్సూల్స్‌ను తయారు చేసే ఎస్బీఎస్ బయోటెక్ సంస్థ కో-ప్రమోషన్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా హ్యాపీ న్యూ ఇయర్ సినిమా ప్రచారాన్ని కేశ్ కింగ్ ప్రచారంతో కలిపి నిర్వహిస్తామని ఎస్బీఎస్ బయోటెక్ ఒక ప్రకటనలో తెలిపింది. కేశ్‌కింగ్ ఉత్పత్తుల తయారీలో ఉత్తమమైన ప్రమాణాలను పాటిస్తున్నామని, నాణ్యత విషయంలో రాజీ పడడం లేదని ఎస్బీఎస్ బయోటెక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, జితేందర్ మహాజన్ పేర్కొన్నారు. అందుకే తమ కేశ్కింగ్కు అంతకంతకూ ఆదరణ పెరుగుతోందని వివరించారు. ప్రింట్ మీడియాలో ప్రచారం కోసం వార్షిక వ్యయం విషయంలో కేశ్‌కింగ్ బ్రాండ్ అగ్రస్థానంలో ఉందని ట్యామ్ అడెక్స్ సర్వే వెల్లడించిందని జితేందర్ ఈ సందర్భంగా తెలిపారు.