![హ్యాపీ న్యూ ఇయర్‌తో కేశ్‌కింగ్ సంయుక్త ప్రచారం](/styles/webp/s3/article_images/2017/09/2/81415132446_625x300.jpg.webp?itok=1zNBu0Yo)
హ్యాపీ న్యూ ఇయర్‌తో కేశ్‌కింగ్ సంయుక్త ప్రచారం
హైదరాబాద్: షారూక్‌ఖాన్ నటించిన హ్యాపీ న్యూ ఇయర్‌ను నిర్మించిన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్‌తో కేశ్‌కింగ్ హెయిర్ ఆయిల్, షాంపూ, క్యాప్సూల్స్‌ను తయారు చేసే ఎస్‌బీఎస్ బయోటెక్ సంస్థ కో-ప్రమోషన్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా హ్యాపీ న్యూ ఇయర్ సినిమా ప్రచారాన్ని కేశ్ కింగ్ ప్రచారంతో కలిపి నిర్వహిస్తామని ఎస్‌బీఎస్ బయోటెక్ ఒక ప్రకటనలో తెలిపింది.
కేశ్‌కింగ్ ఉత్పత్తుల తయారీలో ఉత్తమమైన ప్రమాణాలను పాటిస్తున్నామని, నాణ్యత విషయంలో రాజీ పడడం లేదని ఎస్‌బీఎస్ బయోటెక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, జితేందర్ మహాజన్ పేర్కొన్నారు. అందుకే తమ కేశ్‌కింగ్‌కు అంతకంతకూ ఆదరణ పెరుగుతోందని వివరించారు. ప్రింట్ మీడియాలో ప్రచారం కోసం వార్షిక వ్యయం విషయంలో కేశ్‌కింగ్ బ్రాండ్ అగ్రస్థానంలో ఉందని ట్యామ్ అడెక్స్ సర్వే వెల్లడించిందని జితేందర్ ఈ సందర్భంగా తెలిపారు.