సరోగసీకి ఎలాంటి వారు తమ గర్భాన్ని అద్దెకు ఇవ్వొచ్చు?అంటే దానికి ఉండాల్సిన ఆరోగ్య లక్షణాలు ఏమిటి?
– కొండపల్లి వాసవి, నందిగామ
సరోగసీ అంటే అద్దెకు గర్భాన్ని తీసుకోవడం. ఎవరికైనా గర్భధారణ కష్టమైనప్పుడు గర్భకోశం బిడ్డని మొయ్యలేదని తేలినప్పుడు వాళ్ల అండం.. స్పెర్మ్ టెస్ట్ ట్యూబ్‌లో ఫలదీకరణం చెంది పిండంగా మారాక దాన్ని ఇంకొకరి గర్భంలో ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఇంప్లాంట్ చేసి.. వారు డెలివరీ తరువాత బయోలాజికల్ పేరెంట్స్‌కి తిరిగి ఇచ్చేయడం.. ఇదన్న మాట ఆ ప్రక్రియ.
మన దేశంలో అయితే కమర్షియల్ సరోగసీకి అనుమతి లేదు. ఎలాంటి డబ్బు ఆశ లేకుండా కేవలం స్వచ్ఛందంగా ఈ పని చేయాలి. ఇండియన్ సరోగసీ యాక్ట్ ప్రకారం పెళ్లయిన దంపతులు ఏవైనా అనారోగ్య సమస్యల వల్ల ప్రెగ్నెన్సీని క్యారీ చేయలేకపోతే.. ఒకసారి మాత్రమే సరోగేట్ ప్రెగ్నెన్సీని మోయాలి. ఐవీఎఫ్‌కి 3 అటెంప్ట్స్ మాత్రమే ప్రయత్నించాలి. శారీరకంగా.. మానసికంగా ఆరోగ్యంగా.. దృఢంగా ఉండాలి. వైద్య ఖర్చులు మాత్రమే తీసుకోవాలి. గోప్యతను పాటించాలి. సరోగసీ కోసం రిజిస్టర్ అయిన సంతానసాఫల్య కేంద్రంలో మాత్రమే ఈ ప్రక్రియను చేయాలి.
-డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment