
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా-నిక్ జోనస్ దంపతులు ఇటీవల సరోగసీ ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. 2018, డిసెంబర్‌లో వివాహం చేసుకున్న ఈ జంట.. మూడేళ్ల తర్వాత ఈ ఏడాది జనవరిలో సరోగసి ద్వారా తల్లిదండ్రులైయ్యారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ బిడ్డకు సంబంధించిన ఫోటోలను కానీ, పేరుని కానీ బయటకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డారు.
తాజాగా ప్రియాంక, నిక్‌లు తమ బిడ్డకు పేరు పెట్టినట్లు తెలుస్తోంది. తమ గారాల పట్టికి ‘మాల్టీ మేరీ చోప్రా జోనస్’అని నామకరణం చేశారట. మాల్టీ అంటే సంస్కృతంలో సువాసన కలిగిన పువ్వు అని అర్థం. అంతేకాకుండా ప్రియాంక తల్లి మధుమాల్టీ నుంచి మాల్టీ అని తీసుకున్నారట. ఇక మేరీ అంటే నక్షత్రం అని అర్థం. అలాగే జోనస్ తల్లి పేరు కూడా కలుస్తుంది. ఇక చివరిగా తన పేరు, భర్త పేరు వచ్చేలా చోప్రా జోనస్ పెట్టారట.
బర్త్ సర్టిఫికేట్ ప్రకారం ప్రియాంక కూతురు అమెరికాలోని శాండియాగోలో 2022, జనవరి 15న ఉదయం 8 గంటలకు జన్మించినట్లు ఉంది. ఇక ప్రియాంక సినిమాల విషయానికొస్తే.. ఒకప్పుడు బాలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగిన ఈ భామ.. ఇటీవల హాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. టీవలే హాలీవుడ్ యాక్షన్ సినిమా ఫ్రాంచైజీలో ఒకటైన 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్'తో అలరించింది. ప్రస్తుతం 'సిటాడెల్' అనే అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్‌లో నటిస్తోంది.
(చదవండి: బిడ్డ పుట్టాక కాజల్ ఫస్ట్ పోస్ట్, ఇదేమీ ఆకర్షణీయంగా ఉండదంటూ!)
Comments
Please login to add a commentAdd a comment