పుణె : చనిపోయిన కూమారుని వీర్యంతో సరోగసి పద్దతి ద్వారా వారసులను పొందారు మహారాష్ట్రాలోని ఓ తల్లి. అమ్మతనానికి నోచుకోని ఎందరో తల్లులు ఆధునిక వైద్య పద్దతుల ద్వారా పిల్లలను కంటున్న విషయం తెలిసిందే. అయితే ఇలా చనిపోయిన వారి వీర్యంతో పిల్లలను కనడం ఇదే తొలిసారి కావచ్చు. తన కొడుకు మరణాన్ని తట్టుకోలేని ఓ తల్లి ఇదే పద్దతిలో వారుసులను పొందారు.
పుణెకు చెందిన 27 ఏళ్ల ప్రథమేష్ పాటిల్ పైచదవుల కోసం జర్మనీ వెళ్లాడు. 2013లో ఏదో ఆరోగ్య సమస్యతో పరీక్షలు చేయించుకుంటే తనకు బ్రేయిన్ క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. వైద్యులు కీమోథెరపీ చికిత్సను అందించాలన్నారు. ఈ చికిత్స కారణంగా సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్న డాక్టర్లు అతడి అనుమతితో వీర్యం శాంపిళ్లను తీసి భద్రపరిచారు. తొలుత తగ్గినట్లు కనిపించిన క్యాన్సర్ ఒక్కసారిగా తిరగబెట్టింది దీంతో ప్రథమేష్ 2016లో మరణించాడు. అప్పటికి అతనికింకా పెళ్లి కూడా కాలేదు. కొడుకంటే అతని తల్లి రాజ్ శ్రీ పాటిల్‌కు విపరీతమైన ప్రేమ. కొడుకు మరణాన్ని తట్టుకోలేకపోయింది.
ఎలాగైనా తన కొడుకు తిరిగి పొందాలనుకుంది. ఈ తరుణంలో వీర్యం దాచిన విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే పుణెలోని సహ్యాద్రి ఆసుపత్రి వైద్యులను సంప్రదించి ఈ విషయం తెలియజేసింది. ఆమె సాయంతో జర్మనీలో భద్రపరిచిన వీర్యాన్ని తెప్పిచ్చిన వైద్యులు ప్రథమేశ్ కుటుంబ సభ్యులలోని ఓ మహిళ నుంచి అండాలు సేకరించి, వాటితో నాలుగు పిండాలను రూపొందించారు.
వీటిని తన గర్భంలో ఉంచుకోవటానికి ప్రథమేశ్ తల్లి రాజ్ శ్రీ(49) ముందుకొచ్చినప్పటికి ఆమె శరీరం అనుకూలించదని వైద్యులు పేర్కొన్నారు. దీంతో రాజ్ శ్రీ సోదరి గర్భంలో రెండు పిండాలను గతేడాది మే నెలలో ప్రవేశపెట్టారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో గత సోమవారం ఇద్దరు మగ పిల్లలు(కవలలు) జన్మించారు. దీంతో ప్రథమేశ్ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇలాంటి పద్ధతిన పిల్లల్ని కనడం ఇదే మొదటిసారి కాదని, ఇప్పటివరకు రెండు, మూడు జరిగాయని ఇండియన్ సరోగసీ లా సెంటర్ వ్యవస్థాపకుడు హరిరామసుబ్రమణియన్ తెలిపారు.
రాజ్ శ్రీ పాటిల్, ఆమె కూతురు ప్రిషా( పిల్లలు పట్టుకున్నవారు), ప్రథమేష్ ( ఫొటో,ఇన్ సెట్‌లో)
Comments
Please login to add a commentAdd a comment