హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా సరోగసీ (అద్దె గర్భం) సేవలు అందిస్తున్న సాయికిరణ్ ఆస్పత్రి లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు డీఎమ్‌హెచ్‌వో వెల్లడించారు. ఇప్పటివరకూ 400 నుంచి 500 మందికి సరోగసి చేసినట్లు నిర్థారణ అయిందని, వాటికి సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కాగా సాయికిరణ్ ఆస్పత్రి ప్రధాన గేటుకు నిర్వాహకులు తాళాలు వేశారు.
ఆస్పత్రిలో పని చేస్తున్న వైద్యుల పేర్లు బయటకు రాకుండా జాగ్రత పడుతున్నారు. లోపల ఉన్నవారు బయటకు రాకుండా...బయటవారు లోనికి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. కనీసం ఆ చుట్టుపక్కల ఎవరూ కనిపించకుడా జాగ్రత్తలు తీసుకున్నారు.
కాగా శనివారం రాత్రి ఆస్పత్రిలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించిన 48మంది గర్భిణుల పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఇంటికి వెళ్లలేక, ఆస్పత్రిలో ఉండలేక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఇప్పటికే రికార్డులను సీజ్ చేశారు. రెండు రోజుల్లో ఆస్పత్రిని కూడా సీజ్ చేసే అవకాశం ఉండటంతో ... గర్భిణులు ఆరోగ్య పరిస్థితి, భవిష్యతులో వారికి అందించే వైద్య సేవలు, పుట్టిన పిల్లలను ఎవరికి అప్పగించాలి అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.
బంజారాహిల్స్ రోడ్‌నంబర్ 14లోని ‘సాయికిరణ్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్’లో అక్రమ సెరోగసీలు జరుపుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. అక్కడ అద్దె గర్భాన్ని మోస్తోన్న 48 మంది మహిళలను పోలీసులు గుర్తించారు. వారిలో 16 మంది తెలుగు మహిళలే కావడం గమనార్హం. ఆయా గర్భాలకు సంబధించిన రికార్డుల్లో అవకతవకలున్నట్లు అధికారులు గుర్తించారు.
సాయికిరణ్ ఆస్పత్రి లైసెన్స్ రద్దు
Published Mon, Jun 19 2017 6:46 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM
Advertisement
Advertisement