Chinmayi Sripaada Shares Selfie With Baby Bump To Shuts Down Surrogacy Rumours - Sakshi
Sakshi News home page

Chinmayi Sripaada: ఇకనైనా నోళ్లు మూస్తారా...చిన్మయి వైరల్‌ ఫోటోలు

Published Tue, Oct 18 2022 2:43 PM | Last Updated on Thu, Dec 8 2022 1:00 PM

Chinmayi Sripaada selfie with baby bump to check surrogacy rumours - Sakshi

చెన్నై: సరోగసీ ఒక విలాసవంతమైన వ్యాపారంగా మారిపోతున్న వైనం, సరోగసీ వివాదం, సోషల్‌ మీడియాలో ఆమెపై వస్తున్న వేధింపుల నేపథ్యంలో గాయని చిన్మయి శ్రీపాద బేబీ బంప్‌తో ఒక సెల్ఫీని ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. తద్వారా అద్దెగర్భం ద్వారా పిల్లల్ని కన్నారన్న పుకార్లకు చెక్‌ చెప్పారు. అంతేకాదు ఇద్దరు బిడ్డలకు పాలిస్తున్న  ఫోటోను కూడా చిన్మయి షేర్‌ చేశారు. దీంతోపాటు తన అభిపప్రాయాలతో  ఒక వీడియోను కూడా పంచుకున్నారు. ట్విన్స్‌కు పాలు పట్టడంలోని ఇబ్బందులు, బ్యాక్‌పెయిన్‌, షోల్టర్స్‌ పెయిన్‌ గురించి కూడా ఆమె చెప్పకనే చెప్పారు. దీంతో నిజంగా మీరు  రియల్‌ శివగామి అంటున్నారు ఫ్యాన్స్‌.  (Dhanteras 2022: బంగారు, వెండిపై ఫోన్‌పే క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌)

‘ఓన్లీ సెల్ఫీ’ అటూ ప్రెగ్నెన్సీ సమయంలో తీసిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక నోళ్లు మూత పడ్డాయి. నిజంగా ఇది 'ఐకానిక్' పిక్‌ అంటూ ఫ్యాన్స్‌ కమెంట్‌ చేస్తున్నారు. “సరోగసీ అంటూ  కారు కూతలు కూసిన వాళ్లంతా ఇకనైనా నోరు మూయండి” అని మరొకరు వ్యాఖ్యానించారు. చిన్మయి శ్రీపాద, నటుడు, నిర్మాత రాహుల్‌ రవీంద్రన్‌ దంపతులు ఈ ఏడాది జూన్‌లో ద్రిప్తా, శర్వాస్ అనే  కవలలకు జన్మనిచ్చారు.  

వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు సరోగసీ విధానం ద్వారా పిల్లల్ని కనడం సాధారణంగా మారిపోయింది. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొందరు మహిళలు అద్దె తల్లులుగా మారుతున్నారనీ, కుటుంబ అవసరాల కోసం, డబ్బు సంపాదన కోసం సరోగేట్‌గా మారుతున్నారనేది ఒక వాదన.  ఇందుకు పరిస్థితులను బట్టి కనీసం రూ.15 లక్షల నుంచి 30 లక్షల వరకు లేదా అంతకు మించి డబ్బు వసూలు చేస్తారట. అయితే దీనిపై నియంత్రణ లేకపోవడంతో భారత్ లో సరోగసీ దుర్వినియోగం అవుతుందన్న వాదనలు ఉన్నాయి. దీంతో భారత ప్రభుత్వం 2019లో సరోగసీని నిషేధించి, నియమ నిబంధనలను కఠినతరం చేసింది. (Motorola Edge 30 Ultra: కొత్త వేరియంట్‌, 200 ఎంపీ కెమెరా, భారీ లాంచింగ్‌ ఆఫర్‌)

అద్దెగర్భం ద్వారా పిల్లల్ని కనడం(సరోగసీ) అనేది వ్యాపారంగా మారిపోయిందనే ఆరోపణల నేపథ్యంలో  ఇటీవల సినీ నటులు నయన్‌, విఘ్నేష్‌ దంపతులు  సరోగసి ద్వారా పిల్లల్ని కనడం పెద్ద చర్చకు దారి తీసింది. దీనిపై ప్రభుత్వం కూడా స్పందించిన వివరణ కోరింది. అయితే ఆరేళ్ల క్రితమే తమ పెళ్లిన రిజిస్టర్‌ చేసుకున్నామని నయన్‌ దంపతులు ప్రకటించారు.  ఇంతకుముందు బాలీవుడ్ స్టార్‌  హీరోయిన్‌ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ తో కలిసి సరోగసీ ద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చారు. వీరే కాదు, నటుడు షారుఖ్ ఖాన్ దంపతులు, శిల్పాశెట్టి దంపతులతోపాటు, తెలుగు నటి మంచు లక్ష్మి దంపతులు సైతం సరోగసీ విధానంలో పిల్లలకు జన్మనిచ్చారు.(Diwali Gifts: గిఫ్ట్స్, బోనస్‌లు అందుకున్నారా? మరి ట్యాక్స్ ఎంతో తెలుసా? )

>

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement