![TN Govt Constitutes a Committee For Nayanthara Surrogacy Inquiry - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/13/nayanthara_0.jpg.webp?itok=EhCJOqPl)
లేడీ సూపర్‌స్టార్ నయనతారకు సరోగసీ వివాదంపై తమిళనాడు ప్రభుత్వం ఆమెకు షాకిచ్చింది. ఇటీవల పెళ్లి పీటలు ఎక్కిన నయనతార-విఘ్నేశ్ శివన్‌లు 5 నెలలు తిరక్కుండానే కవలకు తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. దీంతో వారు సరోగసీ(అద్దె గర్భం) ద్వారానే తల్లిదండ్రులు అయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై తమిళనాడు ప్రభుత్వం కూడా స్పందించింది. దీంతో ప్రస్తుతం నయన్ సరోగసీ అంశంపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా తమిళనాడు ప్రభుత్వం నయన్ దంపతులకు షాకిచ్చింది.
చదవండి: సైలెంట్‌గా పెళ్లి చేసుకోబోతున్న బిగ్‌బాస్ బ్యూటీ! వరుడు అతడేనా?
దీనిపై విచారణ జరిపేందుకు తమిళనాడు ప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నయన్ సరోగసీపై సమగ్ర విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఈ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. కాగా వారు తల్లిదండ్రులు కావడంపై ప్రభుత్వానికి వివరణ ఇవ్వాల్సి ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణ్యన్ మీడియాతో పేర్కొన్నారు. అయినప్పటికీ దీనిపై ఇప్పటి వరకు నయన్ దంపతులు స్పందించకపోవడం గమనార్హం.
చదవండి: నేనేమి పెద్ద అందగత్తెను కాదు..: జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment