షారుక్ ఖాన్ దంపతులకు బాంబే కోర్టు నోటీసులు
షారుక్ ఖాన్ దంపతులకు బాంబే కోర్టు నోటీసులు
Published Sun, Dec 8 2013 3:25 PM | Last Updated on Sat, Sep 2 2017 1:24 AM
లింగ నిర్ధారణకు సంబంధించిన కేసులో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ లకు బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సర్రోగసీ ద్వారా బిడ్డను కనడానికి లింగ నిర్ఱారణ పరీక్షలు జరిపించారంటూ దాఖలు చేసిన పిటిషన్ కు వ్యతిరేకంగా మేజిస్ట్రేట్ తీర్పు నివ్వడాన్ని సవాల్ చేస్తూ సామాజిక కార్యకర్త కోర్టుకు దృష్టికి తీసుకువచ్చారు. తమ మూడవ బిడ్డ అబ్ రామ్ ను కనడానికి లింగ నిర్ఱారణ పరీక్షలు జరిపించారని వర్ష దేశ్ పాండే ఆరోపణలు చేశారు. కేసుపై విచారణ చేసి షారుక్ దంపతులకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) క్లీన్ చిట్ ఇచ్చింది.
బీఎంసీ ఇచ్చిన పత్రాలను, సర్రోగసి ప్రాసెస్ ఆధారంగా కోర్టు తమ పిటిషన్ తిరస్కరించిందని దేశ్ పాండే తరపు న్యాయవాది తెలిపారు. తమ పిటిషన్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ ముంబై కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో జస్టిస్ ఆర్ పీ సందర్ బల్దోట షారుక్, గౌరీ ఖాన్, జస్లోక్ హస్పిటల్ లకు నోటీసులు జారీ చేశారు. జనవరి 10 తేదిన కేసుపై విచారణను చేపట్టనున్నారు.
Advertisement
Advertisement