
న్యూఢిల్లీ: బీజేపీ మాజీ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దించాలని ఆమ్ ఆద్మీ పార్టీ యోచిస్తోంది. ఇందుకు సంబంధించి యశ్వంత్ సిన్హాతో జరిపిన చర్చలు సానుకూల ఫలితమి చ్చాయని ఆప్ నేత ఒకరు తెలిపారు. బీజేపీ అసమ్మతి ఎంపీ శతృఘ్న సిన్హాను కూడా పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీలో ఉంచే విషయంలోనూ తమ పార్టీ చర్చలు జరుపుతోందని వెల్లడించారు. అయితే, ఆయన మాత్రం సొంత నియోజకవర్గం బిహార్‌లోని పట్నా సాహిబ్‌ను వదిలేందుకు సుముఖంగా లేరన్నారు. కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరీ, బీజేపీ అసమ్మతి ఎంపీ కీర్తి ఆజాద్ కూడా ఆప్‌తో టచ్‌లో ఉన్నట్లు ఆ నేత పేర్కొన్నారు. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు గాను న్యూఢిల్లీ, పశ్చిమ ఢిల్లీల్లో స్థానికేతరులను పోటీలో ఉంచాలని ఆప్ యోచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment