'ఎన్ఎస్జీతో భారత్కే నష్టం'
న్యూఢిల్లీ: ఓ పక్క న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్లో భారత్ కు సభ్యత్వం కోసం ప్రధాని నరేంద్రమోదీ కంటిమీద కునుకులేకుండా పనిచేస్తుండగా ఆయన పార్టీకే చెందిన సీనియర్ నేత యశ్వంత్ సిన్హా మాత్రం ఆ ప్రయత్నమంతా వృధా అంటున్నారు. భారత్కు ఎన్ఎస్జీ సభ్యత్వం అవసరం లేదని అన్నారు. ఒక అభ్యర్థిలాగా సభ్యత్వం కోసం ఎన్ఎస్జీ తలుపుతట్టాల్సిన పనిలేదని చెప్పారు.
'ఎట్టి పరిస్థితుల్లో భారత్ ఎన్ఎస్జీ సభ్యత్వం తీసుకోవద్దు. ఒక దరఖాస్తు దారుగా వెళ్లాల్సిన పనిలేదు. ఒక వేళ మనకు సభ్యత్వం వస్తే.. మనం చాలా నష్టపోతాం. దానివల్ల పెద్ద ప్రయోజనం కూడా లేదు. గతంలో ఒకసారి మనకు అది అవసరం లేదనుకున్న సందర్బం కూడా ఉంది' అని ఆయన చెప్పారు. అధికారంలోకి వచ్చిన కొందరు నేతల తప్పుడు మార్గదర్శకాల ప్రభావానికి భారత ప్రభుత్వం లోనవుతుందని చెప్పారు.