న్యూఢిల్లీ: మొత్తానికి రాష్ట్రపతి అభ్యర్థుల విషయంలో.. అధికార, విపక్షాలు ఒక కొలిక్కి వచ్చాయి. ఎన్డీయే తరపున ద్రౌపది ముర్ము, సుమారు 22 పార్టీల మద్ధతుతో ప్రతిపక్షాల సంయుక్త అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్లు వేయనున్నారు. అయితే..
కుటుంబమా? లేదంటే రాజకీయమా? అనే చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా నడుస్తోంది. బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా తండ్రి యశ్వంత్ సిన్హా.. ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల బరిలో, అదీ ప్రత్యర్థి వర్గం నుంచి ఉన్నారు. అదే సమయంలో పార్టీ బలపరుస్తున్న ద్రౌపది ముర్ముకి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
‘‘ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకి శుభాకాంక్షలు. పేద, వెనుకబడిన వర్గాల కోసం ఆమె ఎంతో కృషి చేశారు. అందుకోసమే ఆమెకు ఈ గౌరవం దక్కింది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు కృతజ్ఞతలు.’’
అలాగే.. ఎన్నికల బరిలో నా తండ్రి(యశ్వంత్ సిన్హా) కూడా ఉన్నారు. అలాగని.. ఈ వ్యవహారాన్ని కుటుంబ వ్యవహారంగా చూడొద్దని కోరుతున్నారు ఆయన. ఒక బీజేపీ కార్యకర్తగా, పార్లమెంటేరియన్‌గా రాజ్యాంగానికి లోబడి నడుచుకుంటా అని తెలిపారాయన.
Comments
Please login to add a commentAdd a comment