
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా.. మరోసారి మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దేశంలో అత్యంత ప్రమాదకరమైన తుక్డే తుక్డే గ్యాంగులో కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారని అన్నారు. వారిద్దరూ బీజేపీలోనే ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి పేరులో ఒకరు దుర్యోదనుడు, మరొకరు దుశ్శాసనుడని.. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఉద్దేశించి యశ్వంత్ సిన్హా ఈ ట్విట్ చేశారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏపై దేశ వ్యాప్తంగా చెలరేగుతున్న నిరసనలను ఉదహరిస్తూనే యశ్వంత్ సిన్హా విమర్శలు చేశారు. దేశంలో ఎన్‌ఆర్‌సీ, సీఏఏలపై కాంగ్రెస్, తుక్డే తుక్డే గ్యాంగ్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment