జార్ఖండ్ సీఎం పదవికి సిన్హా కరెక్ట్: అద్వానీ
హజారీబాగ్: జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి యశ్వంత్ సిన్హా సరైన అభ్యర్థి అని బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వానీ అన్నారు. విద్యుత్ సంక్షోభానికి నిరసనగా జార్ఖండ్ లో జరుగుతున్న ఆందోళనకు బెయిల్ పై జైలు నుంచి విడుదలైన తర్వాత సిన్హా నాయకత్వం వహించాలని ఆయన ఆకాంక్షించారు. జార్ఖండ్ రాజకీయాల్లో సిన్హా కీలకభూమిక పోషించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హజారీబాగ్ జైలులో ఉన్న సిన్హాను అద్వానీ కలిశారు.
హజారీబాగ్ విభాగం విద్యుత్ శాఖ జనరల్ మేనేజర్ ధనేష్ ఝాపై దాడి చేసినందుకు యశ్వంత్ సిన్హా ఈ నెల 2న అరెస్టయ్యారు. ఆయనకు కోర్టు ఈ నెల 28 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. బెయిల్ తీసుకోవడానికి ఆయన నిరారించారు. కాగా, రాష్ట్రంలో విద్యుత్ సమస్యను బీజేపీ రాజకీయం చేస్తోందని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ విమర్శించారు.