
రాంచీ: భూ మాఫియాకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణకు రావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు సమన్లు జారీ చేసింది. వచ్చే వారంలో 29 లేదా 31వ తేదీల్లో ఎప్పుడు వీలైతే అప్పుడు విచారణకు రావాలంటూ అందులో కోరింది.
తేదీని ఖరారు చేయాలని అందులో స్పష్టం చేసింది. అంతకుముందు, ఈడీ అధికారులు ఈ నెల 27 లేదా 31వ తేదీల్లో ఏదో ఒక రోజు విచారణకు రావాల్సి ఉందంటూ సీఎం సోరెన్‌ను కోరగా ఆయన స్పదించలేదు. దీంతో, తాజాగా మరోసారి ఆయనకు సమన్లు ఇచ్చారు.