రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఆయన సన్నిహితులపై నమోదైన మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సోరెన్‌కు చెందిన రూ.31 కోట్ల విలువైన 8.86 ఎకరాల భూమిని అటాచ్ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తెలిపింది.
సోరెన్‌తోపాటు భాను ప్రతాప్ ప్రసాద్, రాజ్ కుమార్ పహన్, హిలరియాస్ కచ్ఛప్, బినోద్ సింగ్‌లపై మార్చి 30వ తేదీన రాంచీలోని మనీ లాండరింగ్ నిరోధక(పీఎంఎల్‌ఏ) ప్రత్యేక కోర్టులో ఈడీ ఈమేరకు చార్జిషీట్ వేసింది. ఈ చార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకున్నట్లు ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment