
సాక్షి, న్యూఢిల్లీ : లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రాజ్‌ఘాట్ వద్ద ధర్నా చేపట్టిన మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హాను సోమవారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వలస కూలీలను స్వస్ధలాలకు పంపేందుకు వారికి సాయంగా సాయుధ బలగాలను రంగంలోకి దింపాలని డిమాండ్ చేస్తూ యశ్వంత్ సిన్హా నిరసనకు దిగారు. తనను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారని ఆయన సోషల్ మీడియా ద్వారా సమాచారం అందించారు.
లాక్‌డౌన్‌తో స్వస్ధలాలకు కాలిబాటన నడిచి వెళ్లూ పలువురు వలస కూలీలు మృత్యువాతన పడ్డారని ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ధర్నా సందర్భంగా సిన్హా విమర్శించారు. వలస కూలీలు గౌరవంగా తమ ఇళ్లు చేరుకునేలా సైన్యాన్ని రంగంలోకి దింపాలని, వారిని కొట్టడం, వీధుల పాలు చేయడం కాకుండా వారికి ప్రభుత్వం సాయం కావాలని అన్నారు. తన డిమాండ్లను నెరవేర్చేవరకూ తాను ధర్నాను కొనసాగిస్తానని మాజీ బీజేపీ నేత సిన్హా స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment