సాక్షి,న్యూఢిల్లీ: మోదీ సర్కార్‌పై మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా దాడి కొనసాగుతోంది. జీఎస్‌టీపై దేశంలో గందరగోళం నెలకొని, పలుసార్లు పన్ను రేట్లలో మార్పులకు కారకుడైన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై వేటు వేయాలని ప్రధాని నరేంద్ర మోదీని సిన్హా కోరారు. జీఎస్‌టీ రూపకల్పన, అమలు విషయంలో ఆర్థిక మంత్రి మనసు పెట్టి పనిచేయలేదని, ఈ తప్పిదానికి జైట్లీని మంత్రివర్గం నుంచి తప్పించాలని యశ్వంత్ సిన్హా సూచించారు.
కేంద్ర ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ దేశవ్యాప్తంగా జీఎస్‌టీ అమలులో కీలక పాత్ర పోషించాలని, ప్రస్తుతం జీఎస్‌టీ పన్ను వ్యవస్థ పలు లోపాలతో కూడుకున్నదని, ఈ తప్పులకు బాధ్యుడైన జైట్లీని తొలగించి సమర్ధుడైన మరొకరికి ఆర్థిక మంత్రిత్వ శాఖను ప్రధాని కట్టబెట్టాలని సిన్హా అన్నారు. జీఎస్‌టీ పన్ను శ్లాబుల్లో రోజూ సవరణలు చేయడం వల్ల దేశంలో గందరగోళం నెలకొని, వినియోగదారులు..వ్యాపారుల్లో గందరగోళం మినహా ఎలాంటి ప్రయోజనం చేకూరదన్నారు.
జీఎస్‌టీ కష్టాలను సరిదిద్దేందుకు ప్రఖ్యాత ఆర్థిక వేత్త విజయ్ కేల్కర్ నేతృత్వంలో నూతన కమిటీని ఏర్పాటు చేసి భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జీఎస్‌టీ అమలుజరిగేలా చూడాలని సూచించారు.మరోవైపు ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్ల అమలు ప్రతిపాదనను యశ్వంత్ సిన్హా సమర్ధించారు.
Comments
Please login to add a commentAdd a comment