
సాక్షి, న్యూఢిల్లీ : ఒక దేశం ఒక పన్ను అంటూ బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వస్తుల సేవల పన్ను (జీఎస్‌టీ ) రెండవ వార్షికోత్సవం సందర్భంగా మాజీ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘టూ ఇయర్స్ ఆఫ్టర్ జీఎస్‌టీ’ పేరుతో తన బ్లాగ్‌లో పోస్ట్ చేశారు. జీఎస్‌టీ విధానంలో ఒక స్లాబ్ వుండటం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. భారత్ లాంటి దేశాల్లో ఒకే పన్ను శ్లాబు విధానాన్ని అమలు చేయడం అసాధ్యమన్నారు. అఇయతే భవిష్యత్తులో శ్లాబుల సంఖ్య రెండుకు తగ్గే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
నూతన పన్ను విధానం జీఎస్టీ అమల్లోకి వచ్చిన తరవాత ప్రభుత్వ ఆదాయం పెరిగిందని, దేశంలోని 20 రాష్ట్రాలు ఈ రెండేళ్లలో 14 శాతం అధిక రాబడి సాధించాయన్నారు జైట్లీ పేర్కొన్నారు. ఆదాయం మరింత పెరిగితే ప్రస్తుతం ఉన్న 12శాతం, 18శాతం శ్లాబులను కలిపేసే వెసులుబాటు ఉంటుందన్నారు. కాగా జూన్ మాసానికి సంబంధించిన జీఎస్‌టీ వసూళ్లు లక్షకోట్ల రూపాయల మార్క్ దిగువకు చేరాయి.