సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ రసవత్తరంగా మారింది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ఖరారైన సంగతి తెలిసిందే. అయితే, ముందునుంచీ మద్దతు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనూహ్యంగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు మద్దతు పలికారు. ఈమేరకు కేంద్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ మంగళవారం వెల్లడించారు. యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వానికి సంబంధించి కేసీఆర్‌తో రెండుసార్లు ఫోన్‌లో మాట్లాడినట్టు ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా యశ్వంత్ సిన్హాకు కేసీఆర్ మద్దతు తెలిపారని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. కాయస్త బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన యశ్వంత్ సిన్హా 2002లో కేంద్ర విదేశాంగశాఖ మంత్రిగా పనిచేశారు. 2018లో బీజేపీకి గుడ్‌బై చెప్పారు. 2021లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. టీఎంసీకి రాజీనామా చేస్తున్నట్టు మంగళవారం ఉదయం ప్రకటించారు.
చదవండి👇
శివసేనకు మంత్రి గుడ్ బై?.. స్పందించిన ఏక్‌నాథ్ షిండే
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిపై ఉత్కంఠ.. రేసులో బలంగా ఆ ఇద్దరు..?
Comments
Please login to add a commentAdd a comment