Presidential polls
-
అమెరికా ఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో ఓటర్లు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలైన్లలో నిల్చున్నారు. ఇక.. పోలింగ్ పాల్గొని ఓటు వేయాలని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా పౌరులకు విజ్ఞప్తి చేశారు. బ్యాలెట్ పేపర్ విధానంలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. హ్యాండ్మార్క్డ్ పేపర్ బ్యాలెట్స్ ద్వారా కొందరు, బ్యాలెట్ మార్కింగ్ డివైజ్(BMD)లతో కూడిన పేపర్బ్యాలెట్తో మరికొందరు ఓటేసే ఛాన్స్ ఇచ్చారు. బీఎండీ డిజిటల్ బ్యాలెట్.. ఓటేసి అప్పటికప్పుడే ప్రింట్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈవీఎంల తరహా డైరెక్ట్ రికార్డింగ్ ఎలక్ట్రానిక్(DRE) ద్వారా కేవలం ఐదు శాతం ఓటేసే ఛాన్స్ ఉంది. హ్యాకింగ్ ఆరోపణలు, ట్యాంపరింగ్ అనుమానాల నేపథ్యంలోనే డీఆర్ఈలకు అమెరికా ఓటర్లు దూరంగా ఉన్నారు.ఇక.. గత ఎన్నికల్లో కేవలం 66 శాతమే పోలింగ్ నమోదైంది. ఈసారి ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థులు నిలబడ్డారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇద్దరి మధ్యే పోటీ నెలకొంది. ట్రంప్-హారిస్ మధ్య పోటీతో అమెరికన్ల తీర్పు ఎలా ఉండనుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. కనెక్టికట్, ఇండియానా, కెంటకీ, న్యూజెర్సీ, మెయినే, న్యూహాంప్సైర్, న్యూయార్క్ వర్జీనీయాలో పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ అయిన వెంటనే కౌంటింగ్ ప్రారంభం కానుంది.ఇక.. రేపు సాయంత్రం లేదంటే ఎల్లుండి కల్లా ఫలితంపై స్పష్టత రానుంది. -
అమెరికా ఎన్నికలు: డెమోక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా టిమ్ వాల్ట్స్!
న్యూయార్క్:అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఇండో అమెరికన్ కమలా హారిస్ ఖరారై.. ప్రచారంలో దూసుకువెళ్తుతున్నారు. తాజా డెమోక్రటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా మిన్నెసొటా గవర్నర్ టిమ్‌వాల్ట్స్ ఎంపికయ్యారు. అధ్యక్ష రేసులో ఉన్న కమలా హారిస్.. తమ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా వాల్ట్స్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై డెమోక్రటిక్ పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.అమెరికా చట్టసభలో 12 ఏళ్లపాటు సేవలందించిన టిమ్‌వాల్ట్స్ 2018లో మిన్నెసొటా గవర్నర్‌గా ఎన్నికయ్యారు. అమెరికా ఆర్మీ నేషనల్ గార్డ్‌లో 20 ఏళ్ల పాటు పనిచేశారు. అదేవిధంగా టిమ్‌వాల్ట్స్ తనదైన వ్యూహాలతో రిపబ్లికన్ పార్టీ, అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్‌లపై విమర్శలు గుప్పించటంతో అందరిని ఆకర్షించారు. మరోవైపు.. అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ విజయం సాధిస్తారని అన్ని సర్వేలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు.. ఆదివారం సీబీఎస్ న్యూస్/యూగవ్ సంస్థ చేపట్టిన సర్వేలో కమలా హరీస్ ఆధిక్యం కనబరిచారు. ట్రంప్ అధ్యక్ష పదవిలో మానసికంగా స్థిమితంగా ఆలోచించగలరని 51 శాతం మంది, కమల మెరుగ్గా పరిపాలించగలరని 64 శాతం చెప్పారు. -
ద్రౌపది ముర్ము నివాసానికి ప్రధాని మోదీ
-
రాష్ట్రపతిగా గిరిపుత్రిక ద్రౌపది ముర్ము
-
కొత్త చరిత్ర.. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. 15వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన రెండో మహిళగా ద్రౌపది ముర్ము నిలిచారు. ఎన్డీఏ అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలో దిగిన ముర్ము విజయ దుందుభి మోగించారు. సగానికి పైగా ఓట్లు సాధించి ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ మెజార్టీతో గెలుపొందారు. ద్రౌపది ముర్ముకు బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలతోపాటు బీజేడీ, వైఎస్సార్ కాంగ్రెస్ సహా 44 పార్టీలు మద్దతిచ్చాయి. దీంతో ఆమె ఎలక్టోరల్ కాలేజ్‌లో అవసరమైన మెజార్టీకి మించి ఓట్లు సాధించారు. 63 శాతం ఓట్లతో విజయ కేతనం ఎగరవేశారు. ఈ నెల 25న దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేస్తారు. చదవండి👇 రెండు సార్లు రాష్ట్రపతిగా పనిచేసింది ఎవరు?) ఏంటిది? మోదీ ప్రారంభించిన ఎక్స్‌ప్రెస్‌వేపై ఐదు రోజులకే గుంతలు.. -
రాష్ట్రపతి ఎన్నికలకు సర్వం సిద్ధం
-
ఆదిలాబాద్ ఎంపీకి అరుదైన అవకాశం
ఆదిలాబాద్ టౌన్: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఈనెల 24న న్యూఢిల్లీలో నామినేషన్ దాఖలు చేయనుండగా.. ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరుకావాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి ఆహ్వానం అందింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ స్వయంగా బాపూరావుకు ఫోన్‌చేసి వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆదివాసి బిడ్డ ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆ పత్రాలపై అదే వర్గానికి చెందిన బాపూరావుకు ప్రతిపాదించేందుకు అరుదైన అవకాశం లభించడం విశేషం. -
రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాకు సీఎం కేసీఆర్ మద్దతు
-
రాష్ట్రపతి ఎన్నిక.. సీఎం కేసీఆర్ మద్దతు ఆయనకే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ రసవత్తరంగా మారింది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ఖరారైన సంగతి తెలిసిందే. అయితే, ముందునుంచీ మద్దతు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనూహ్యంగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు మద్దతు పలికారు. ఈమేరకు కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మంగళవారం వెల్లడించారు. యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వానికి సంబంధించి కేసీఆర్‌తో రెండుసార్లు ఫోన్లో మాట్లాడినట్టు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా యశ్వంత్ సిన్హాకు కేసీఆర్ మద్దతు తెలిపారని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. కాయస్త బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన యశ్వంత్ సిన్హా 2002లో కేంద్ర విదేశాంగశాఖ మంత్రిగా పనిచేశారు. 2018లో బీజేపీకి గుడ్‌బై చెప్పారు. 2021లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. టీఎంసీకి రాజీనామా చేస్తున్నట్టు మంగళవారం ఉదయం ప్రకటించారు. చదవండి👇 శివసేనకు మంత్రి గుడ్ బై?.. స్పందించిన ఏక్నాథ్ షిండే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిపై ఉత్కంఠ.. రేసులో బలంగా ఆ ఇద్దరు..? -
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిపై ఉత్కంఠ.. రేసులో బలంగా ఆ ఇద్దరు..?
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుండగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో బీజేపీ అగ్రనేతలు భేటీ కావడం చర్చనీయాంశమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వెంకయ్యనాయుడును కలిశారు. కాగా, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రేసులో ఛత్తీస్‌ఘడ్ గవర్నర్ అనసూయ ఉయికే, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన అనసూయ ఉయికే గిరిజన సామాజిక వర్గానికి చెందినవారు. 2019 జూలై నుంచి ఛత్తీస్‌ఘడ్ గవర్నర్‌గా సేవలందిస్తున్నారు. అజిత్ ధోవల్ రాష్ట్రపతి అభ్యర్థి అయితే అనసూయ ఉయికే ఉపరాష్ట్రపతి అవుతారని తెలుస్తోంది. అలాగే ఉపరాష్ట్రపతి రేసులో రాజ్యసభ సభ్యుడు వినయ్ సహస్త్ర బుద్ధే పేరు కూడా వినిపిస్తోంది. కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఛత్తీస్‌ఘడ్ గవర్నర్‌గా వెళ్తారని సమాచారం. చదవండి: (Yashwant Sinha: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా) -
రాష్ట్రపతి ఎన్నికల బరిలో యశ్వంత్ సిన్హా
-
Yashwant Sinha: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: వచ్చే నెలలో జరిగే భారత 16వ రాష్ట్రపతి ఎన్నికపై ఊగిసలాట ధోరణికి స్వస్తి పలుకుతూ ప్రతిపక్ష పార్టీలు ప్రతిపాదించిన యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వానికి టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపారు. సీనియర్ నేత యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వంపై పలు విపక్ష పార్టీల నడుమ దాదాపుగా ఏకాభిప్రాయం కుదిరిన నేపథ్యంలో ఎన్సీపీ అధినేత, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ సోమవారం రాత్రి సీఎం కేసీ ఆర్‌ను ఫోన్లో సంప్రదించారు. సిన్హా అభ్యర్థిత్వంపై అభి ప్రాయం కోరడంతో పాటు మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అయితే తమ నిర్ణయాన్ని వెల్లడించేందుకు కొంత గడువు కావాలని కోరిన కేసీఆర్.. యశ్వంత్‌కు టీఆర్ఎస్ మద్దతుపై విభిన్న కోణాల్లో మదింపు చేసినట్లు తెలిసింది. కాగా మంగళవారం మధ్యాహ్నం మళ్లీ ఫోన్ చేసిన పవార్‌కు సీఎం తన అంగీకారాన్ని తెలియజేసినట్లు సమాచారం. తొలుత పావులు కదిపినా.. కొంతకాలంగా జాతీయ పార్టీ ఏర్పాటు సన్నాహాల్లో నిమ గ్నమైన కేసీఆర్.. తొలుత కాంగ్రెస్, బీజేపీయేతర ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించే దిశగా పావులు కది పారు. అయితే ఈ నెల 9న రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ విడుదల తర్వాత పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రంగ ప్రవేశం చేయ డంతో, తదనంతర రాజకీయ పరిణామాలను కేసీఆర్ అధినేత నిశితంగా గమనిస్తూ వచ్చారు. ఈ నెల 15న బీజే పీయేతర విపక్ష పార్టీల సమావేశానికి హాజరు కావాల్సిందిగా మమత నుంచి ఆహ్వానం అందినా భేటీకి వెళ్లలేదు. ‘బీజేపీ, కాంగ్రెస్‌కు సమదూరం’ అనేది తమ విధానం కాగా.. కాం గ్రెస్‌ను కూడా మమత ఆహ్వానించడం, రాష్ట్రపతి అభ్యర్థిగా అందరికీ ఆమోద యోగ్యమైన వ్యక్తిపై ఏకాభి ప్రాయ సాధన ప్రస్తావన లేకపోవడం, తదితర కారణాలతో ఆ భేటీకి తాము దూరంగా ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. దూరంగా ఉంటే విమర్శలకు తావిచ్చినట్లవుతుందని.. జాతీయ పార్టీ స్థాపన దిశగా కసరత్తు చేస్తూనే, మరోవైపు కాంగ్రెస్ మినహా మిగతా విపక్ష పార్టీల నేతలతో కేసీఆర్ సత్సంబంధాలు నెరుపుతున్నారు. ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్), అరవింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ), భగవంత్ మాన్ (పంజాబ్), ఎంకే స్టాలిన్ (తమిళ నాడు), ఉద్ధవ్ థాక్రే (మహారాష్ట్ర), హేమంత్ సొరేన్ (జార్ఖండ్) తదితరులతో పాటు శరద్ పవార్, అఖిలేశ్ యాదవ్, తేజస్వీ యాదవ్, హెచ్డీ దేవెగౌడ, కుమారస్వామి వంటి నేతలతో భేటీ అవుతూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రపతి ఎన్నిక విషయంలో పలు విపక్ష పార్టీలు ఏకతాటి పైకి వస్తున్నా, టీఆర్ఎస్ దూరంగా ఉంటే విమర్శలకు తావు ఇచ్చినట్లు అవుతుందనే భావన పార్టీలో వ్యక్తమైంది. మరో వైపు కాంగ్రెస్‌ను సాకుగా చూపుతూ రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండటం వల్ల బీజేపీ విషయంలో పార్టీ వైఖరి అనుమానాలకు తావిస్తుందనే అభిప్రాయం కూడా టీఆర్ ఎస్ అంతర్గత చర్చల్లో వ్యక్తమైంది. సిన్హాకు మద్దతు సరైనదే..! ఈ అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ముఖ్యంగా విపక్ష పార్టీల ఐక్యతకు టీఆర్ఎస్ అడ్డుపడుతోం దనే భావన నష్టం చేకూరుస్తుందనే అంచనాకు కేసీఆర్ వచ్చి నట్లు తెలిసింది. బీజేపీ, కాంగ్రెస్‌కు సమదూరమనే విధా నంతో జాతీయ రాజకీయాల్లో ఏకాకి అయ్యే అవకాశం ఉం దని కూడా భావించినట్లు సమాచారం. మరోవైపు యశ్వంత్ సిన్హా 2018లో బీజేపీని వీడి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్రపతి అభ్యర్థిగా బరి లోకి దిగుతున్నారు. ఇలా కాంగ్రెస్ నేపథ్యంలేని యశ్వంత్ సిన్హాకు మద్దతు పలకడం సరైనదేనని భావించి తాజా నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్ ఓటు విలువ 2.28 శాతం రాష్ట్రపతి ఎన్నికకు గాను దేశవ్యాప్త ఎలక్టోరల్ కాలేజీలో 776 మంది ఎంపీలు, 4,033 మంది ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉండగా, టీఆర్ఎస్కు రాష్ట్రంలో 16 మంది ఎం పీలు, 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దేశ వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎంపీల ఓటు విలువ 10.86 లక్షలు కాగా, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేల ఓటు విలువ 24,796గా ఉంది. దేశ వ్యాప్త ఎలక్టోరల్ కాలేజీలో టీఆర్ఎస్ ఓటు విలువ 2.28 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ పత్రాల్లో ఆయనకు మద్దతుగా టీఆర్ఎస్ ఎంపీలు కూడా సంతకాలు చేయనున్నట్లు సమాచారం. దీనిపై సీఎం కేసీఆర్ ఒకటి రెండురోజుల్లో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
రాష్రపతి ఎన్నికలపై విపక్షాల సమావేశం
-
ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి శరద్ పవార్..?
న్యూఢిల్లీ: జూలై 18న జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్సీపీ నేత శరద్ పవార్ పోటీ చేస్తున్నారా? ప్రతిపక్షాల అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారా? తాజా పరిణామాలు చూస్తే ఔననే చెబుతున్నాయి. ప్రతిపక్షాలలో ఎవరినోట చూసిన శరద్ పవార్ పేరే వినిపిస్తోంది. అదీగాక రాష్ట్రపతి పదవికి శరద్ పవార్‌ను నామినేట్ చేసేలా కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే శరద్ పవర్‌తో సమావేశమైనట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఐతే ఈ విషయమై ఎన్సీపీ నేత శరద్ పవర్ ఇంకా స్పందించలేదు. పవార్‌తో ఆమ్ఆద్మీపార్టీ నేత సంజయ్ సింగ్ కూడా ఫోన్లో మాట్లాడారు . ఖర్గే ఈ విషయమై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, తమిళనాడు ముఖ్య మంత్రి స్టాలిన్ చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తృణమాల్ అధినేత పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతోనూ ఖర్గే ఫోన్లో సంభాషించారు. పైగా రాష్ట్రపతి ఎన్నిక గురించి ఈ నెల 15న ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నింటితో మమతా బెనర్జీ సమావేశం ఏర్పాటు చేశారు. దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకులలో ఒకరైన శరద్ పవార్ అనేక పొత్తులు, సంకీర్ణ ప్రభుత్వాలను నెలకొల్పడంలో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి. మహారాష్ట్రలో సైద్ధాంతిక వైరుధ్యాలు కలిగిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లను బీజేపీకి వ్యతిరేకంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు బీజేపీ అన్ని పార్టీలతో చర్చలు జరిపి రాష్ట్రపతి ఎన్నికను ఏకాభిప్రాయం చేసే దిశగా జేపీ నడ్డా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను రంగంలోకి దింపింది. 2017లో కూడా బీజేపీ ఏకాభిప్రాయం కోసం వెంకయ్యనాయుడు, రాజ్‌నాథ్ పేర్లను నామినేట్ చేసింది. ఐతే ఆ తర్వాత ఎన్డీయే తరుపున వెంకయ్య నాయుడుని బరిలోకి దింపిన సంగతి తెలిసిందే. ఒకవేళ బీజేపీ ప్రతిపక్షాలతో ఏకాభ్రిప్రాయ చర్చలు ఫలించనట్లయితే రాష్ట్రపతి ఎన్నికకు సిద్ధం కానున్నట్లు సమాచారం. (చదవండి: గవర్నర్ అధికారాల కోతలో దీదీ సక్సెస్.. బీజేపీ వ్యతిరేకత ఉన్నా 40 ఓట్లేనా?) -
President Election Schedule 2022: రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్.... ఎప్పుడంటే..!
-
రాష్ట్రపతి ఎన్నికలో 99% పోలింగ్
► 20న కౌంటింగ్, ఫలితాలు ►పార్లమెంటు హాల్లో తొలి ఓటు వేసిన ప్రధాని ► యూపీలో కోవింద్‌కు ఓటేసిన ఎస్పీ నేత శివ్‌పాల్ ► విజయంపై అధికార, విపక్షాల ధీమా న్యూఢిల్లీ: భారత 14వ రాష్ట్రపతి ఎన్నిక సోమవారం ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 99 శాతం పోలింగ్ జరగగా.. అరుణాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, గుజరాత్, బిహార్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, ఉత్తరాఖండ్, పుదుచ్చేరిల్లో వందశాతం పోలింగ్ నమోదైంది. ఢిల్లీలోని పార్లమెంటు భవన్లో 99 శాతం ఓటింగ్ జరిగినట్లు రిటర్నింగ్ అధికారి, లోక్‌సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా వెల్లడించారు. ఇప్పటివరకు జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఇదే అత్యధిక శాతం పోలింగ్. ఢిల్లీలో ఓటేయాల్సిన 717 మంది ఎంపీల్లో 714 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. తృణమూల్ ఎంపీ తపస్ పాల్, బీజేడీ సభ్యుడు రాంచంద్ర హన్స్‌దక్, పీఎంకే సభ్యుడు అన్బుమణి రాందాస్ గైర్హాజరయ్యారు. కాగా, అనారోగ్యం కారణంగా డీఎంకే చీఫ్ కరుణానిధి ఓటేయలేదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ చెన్నైలో వెల్లడించారు. 54 మంది ఎంపీలు వారి రాష్ట్రాల్లో ఓటేసేందుకు అనుమతి తీసుకున్నారు. సోమవారం పార్లమెంటు హాల్లో ప్రధాని నరేంద్ర మోదీ తొలి ఓటు వేశారని మిశ్రా వెల్లడించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు, గుజరాత్ ఎమ్మెల్యే అమిత్ షా కూడా ఢిల్లీలో ఓటువేశారు. జూలై 20 ఉదయం 11 గంటలకు కౌంటింగ్ మొదలవుతుందని.. ముందుగా పార్లమెంటు బ్యాలెట్ బాక్స్ లెక్కించిన తర్వాత అక్షర క్రమంలో రాష్ట్రాలనుంచి వచ్చిన బాక్సుల కౌంటింగ్ చేపట్టనున్నట్లు మిశ్రా తెలిపారు. పలుచోట్ల క్రాస్ ఓటింగ్ యూపీలో సమాజ్‌వాద్ పార్టీ విపక్షాల అభ్యర్థి మీరాకుమార్‌కు బహిరంగంగానే మద్దతు తెలిపినప్పటికీ.. ఆ పార్టీ ముఖ్య నేత శివ్‌పాల్ యాదవ్.. ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు ఓటేశారు. ‘కోవింద్‌కు నా సంపూర్ణ మద్దతుంది. మీరాకుమార్ తనకు ఓటేయమని నన్ను అడగలేదు. నేతాజీ (ములాయం) సూచనల మేరకే కోవింద్‌కు ఓటేశాను’ అని శివ్‌పాల్ స్పష్టం చేశారు. ఆయనతోపాటుగా ఒకరిద్దరు ఎస్పీ, పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా కోవింద్‌కు అనుకూలంగా ఓటేశారు. మణిపూర్‌తోపాటు పలు ఈశాన్యరాష్ట్రాల్లోనూ కాంగ్రెస్, తృణమూల్ సభ్యులు కూడా కోవింద్ అభ్యర్థిత్వానికి అనుకూలంగా ఓటింగ్‌లో పాల్గొన్నట్లు తెలిసింది. కోవింద్ విజయం ఖాయం: బీజేపీ ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ స్పష్టమైన మెజారిటీతో ఘనవిజయం సాధిస్తారని బీజేపీ ధీమా వ్యక్తం చేసింది. ‘కోవింద్ తప్పనిసరిగా భారీ మెజారిటీతో గెలుస్తారు’ అని వెంకయ్య ఢిల్లీలో తెలిపారు. రాజ్యాంగం గురించి బాగా తెలిసిన వ్యక్తిగా అత్యున్నత పదవికి కోవింద్ సరైన న్యాయం చేస్తారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. అయితే భిన్న సిద్ధాంతాల మధ్య జరిగిన ఈ పోటీలో తమ అభ్యర్థిదే విజయమని కాంగ్రెస్ తెలిపింది. ఈ ఎన్నికల్లో మీరాకుమార్‌దే విజయమని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ స్పష్టం చేశారు. మీరాకుమార్ అసలైన రాజ్యాంగ పరిరక్షకురాలని సీపీఎం, సీపీఐ వ్యాఖ్యానించాయి. అయితే ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా దళిత నేతే రాష్ట్రపతి అవుతారని బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలిపారు. ‘దేశంలో జరుగుతున్న దానికి నిరసనగానే మీరాకుమార్‌కు మద్దతుగా ఇవాళ తృణమూల్ పార్టీ ఓటేస్తోంది’ అని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. -
ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సోమవారం సాయంత్రం అయిదు గంటలకు ముగిసింది. ఢిల్లీ పార్లమెంట్ హౌస్‌లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఎంపీలు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ తొలి ఓటు వేశారు. తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ అగ్రనేత మురళీమనోహర్ జోషి తదితరులు ఓటేశారు. అధికార, విపక్ష ఎంపీలు కూడా పార్లమెంట్ హౌస్ పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందే పలువురు ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా పార్లమెంట్‌కు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నెల 20న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. 25న కొత్త రాస్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు.కాగా 24న ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగియనుంది. ఏపీలో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ముగిసింది. వెలగపూడిలోని అసెంబ్లీ ప్రాంగణంలో రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఓటు వేశారు. బిజెపి ఎమ్మెల్యేలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీలో మొత్తం 174 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ రాయపాటి సాంబశివరావు ఓటు వేశారు. అలాగే తెలంగాణలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముసిగింది. ముఖ్యమంత్రి కేసిఆర్ తొలి ఓటు వేయగా.. స్పీకర్ మధుసూదనాచారి రెండో ఓటు వేశారు. విపక్షనేత జానారెడ్డి మూడో ఓటు వేశారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా బస్సుల్లో అసెంబ్లీకి చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విపక్ష ఎమ్మెల్యేలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, గీతారెడ్డి, ఎంఐఎం , టీడీపీ ఎమ్మెల్యేలు, బిజెపి పక్షనేత కిషన్‌రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. తెలంగాణలో మొత్తం 117 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. అయితే టిఆర్ఎస్కు చెందిన మనోహర్‌రెడ్డి, ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ అనారోగ్యం కారణంగా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. -
కాంగ్రెస్ పార్టీ... ఈజిప్టు మమ్మీ!
ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకరరెడ్డి సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సలహాలు ఇచ్చే స్థాయిగానీ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఉచ్ఛరించే అర్హత గానీ జాతీయ కాంగ్రెస్‌కు లేదని పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత వైఎస్సార్ లేకపోతే 2004లో యూపీఏ ప్రభుత్వమే ఏర్పడేది కాదన్నారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఈజిప్టు మమ్మీకి ఏ స్థాయి ఉందో.. దేశంలో కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థానం ఉందన్నారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామనాథ్ కోవింద్‌కు వైఎస్సార్సీపీ మద్దతు ఇవ్వటాన్ని ప్రశ్నిస్తూ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి లేఖ రాయటంపై భూమన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి 10 సంవత్సరాలు దేశాన్ని పాలించే అవకాశం ఇచ్చిన మహానేత వైఎస్సార్ తనయుడు అని కూడా చూడకుండా సోనియాను ధిక్కరించాడనే నెపంతో అభియోగాలు మోపి జైలుకు పంపించిన నీచ చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి మాట్లాడే స్థాయి ఎక్కడదని సూటిగా ప్రశ్నించారు. ఎన్డీయే అభ్యర్థిని జగన్ బలపరిచారు: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాలంటూ జగన్‌కు రఘువీరారెడ్డి లేఖ రాయడం రాయడం విడ్డూరంగా ఉందని భూమన చెప్పారు.రాష్ట్రపతి ఎన్నికపై బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా జగన్ మద్దతు కోరారని తెలిపారు. రాష్ట్రపతి లాంటి సమున్నత పదవికి, రాజకీయేతర పదవికి గెలిచే వ్యక్తికి మద్దతు ఇవ్వటం పద్ధతని జగన్ చాలా స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు. -
చిరంజీవి మళ్లీ నెం.1
మెగాస్టార్ చిరంజీవి తెలుగు చిత్రసీమలో నెంబర్ వన్. ఆయన తన డాన్స్‌లతో, డైలాగ్‌లతో టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపారు. ఎన్టీఆర్ తర్వాత సినీ ఇండస్ట్రీలో మకుటంలేని మహారాజుగా వెలుగొందారు. చిత్రసీమలో నెంబర్ వన్ స్థానాన్ని అధిరోహించారు. అనంతరం రాజకీయల్లోకి వెళ్లారు. కాంగ్రెస్ తరపున రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. ఇప్పుడు చిరంజీవికి మరో అరుదైన స్థానం లభించింది. తొలి ఓటు చిరంజీవిదే దేశంలో రాష్ట్రపతి ఎన్నికల కోలాహలం మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీ వ్యూహ ప్రతివ్యూహాల మధ్య జులై 17న జరిగే రాష్ట్రపతి ఎన్నికల కోసం ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఎన్డీఏ తరపున రామ్‌నాధ్ కోవింద్ బరిలో ఉండగా, విపక్ష కాంగ్రెస్, విపక్షాల తరపున మాజీ స్పీకర్ మీరాకుమార్ రాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్నారు. ఓటింగ్ కోసం మొత్తం రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలు, రాష్ట్రాల శాసనసభ్యుల పేర్లను అక్షర క్రమంలో పొందుపర్చి తాజాగా ఎలక్ట్రోరల్ కాలేజి జాబితా విడుదల చేశారు. కాగా, ఇందులో మొదటి పేరు కాంగ్రెస్ పార్లమెంటుసభ్యుడు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిదే. దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటరుగా చిరంజీవి ఓటు వేయనున్నారు. ఇందులో మరో విశేషం ఏంటంటే చివరి పేరుకూడా తెలుగువారిదే కావడం. పాండిచ్చేరి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మల్లాది కృష్ణారావు చిట్టచివరిదైన 4896వ స్థానంలో ఉన్నారు. చిరంజీవి ఓటు ఎవరికి? గత కొంతకాలంగా చిరంజీవి కాంగ్రెస్ పార్టీ, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పీసీసీ పదవిని సైతం తిరస్కరించారనే వార్తలు కూడా వచ్చాయి. కాంగ్రెస్ తరపున ఏకార్యక్రమంలోను చిరంజీవి పాల్గొనలేదు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి నేతృత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ, స్పీకర్ మీరాకుమార్ పట్ల చిరంజీవి అసంతృప్తిగా ఉన్నారు. దీంతో చిరంజీవి ఎవరికి ఓటేస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
'ఓడిపోవడానికి బిహార్ బేటిని పెట్టారు'
పట్నా: లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ అంటే తనకు అమితమైన గౌరవం అని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. అయిన, రాష్ట్రపతి ఎన్నికల విషయంలో తన మద్దతు ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కేనని ఈ విషయంలో తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. ఓడిపోవడానికి బిహార్ కి బేటీని(మీరాకుమార్)ను ప్రతిపక్షాలు నిలబెట్టాయని విమర్శించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి నితీష్ మద్దతివ్వడం చారిత్రక తప్పిదం అని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ అన్న నేపథ్యంలో ఆ ఇద్దరు విడిపోయినట్లేనని అందరూ భావించారు. కానీ, లాలూ ప్రసాద్ యాదవ్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు నితీష్ కుమార్ హాజరయ్యారు. అయితే, ఈ సమయంలో వారిద్దరి మధ్య చర్చ జరిగి తిరిగి నితీష్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారని అనుకున్నారు. అయితే, తన నిర్ణయం మారే ప్రసక్తి లేదని చెప్పారు. అయినా, తమ బంధానికి రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధం లేదని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి మీరా కుమార్‌కే లాలూ ప్రసాద్ మద్దతిచ్చారు. -
సోనియాకు నితీష్ ఝలక్.. మోదీకే జై
పట్నా: అనుకున్నదే అయింది. కేంద్రంలో విపక్షాలకు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఝలక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి షాకిస్తూ ప్రధాని నరేంద్రమోదీకే జై అన్నారు. ఎన్డీయే తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన రామ్‌నాథ్ కోవింద్‌కు తాను మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మహాగట్బందన్ (జేడీయూ, ఆర్జేడీ,కాంగ్రెస్) బంధానికి బీటలు వారిన పరిస్థితి ఏర్పడినట్లయింది. వాస్తవానికి నితీష్ తమకే మద్దతిస్తాడని ముందునుంచి కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. ఆయన మద్దతిస్తాడే లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన దళిత వర్గానికి చెందిన మీరాకుమార్ను తమ రాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించాలనుకుంది. కానీ, ఆయన తాజా నిర్ణయంతో కాంగ్రెస్ ఆశలకు గండికొట్టినట్లయింది. కేంద్రం పాకిస్థాన్‌పై సర్జికల్ దాడులు నిర్వహించినప్పటి నుంచి ప్రధాని నరేంద్రమోదీ ఏ ప్రకటన చేసినా దానిని నితీష్ కుమార్ తెగ పొగుడుతున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాలన్నీ కూడా పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించగా వారిలో భాగస్వామ్యం అయి ఉన్న జేడీయూ అధ్యక్షుడిగా ఉన్న నితీష్ కుమార్ బహిరంగంగా మద్దతిచ్చారు. అలాగే, జీఎస్టీకి మద్దతిచ్చిన రాష్ట్రాల్లో అన్నింటికంటే బీహారే ముందుంది. ప్రధాని మోదీ కూడా నితీష్‌ను తెగ పొగుడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా నితీష్ మరోసారి ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ప్రకటించడంతో తిరిగి ఆయన తన పాత మిత్ర కూటమికి దగ్గరవుతున్నారా అని చర్చ ఊపందుకుంది. అంతేకాకుండా, నితీష్ ప్రభుత్వంలో భాగస్వామ్యం కలిగి ఉన్న లాలూ కుటుంబం లక్ష్యంగా అవినీతి ఆరోపణలు, అక్రమ ఆస్తుల పేరిట పలు దర్యాప్తు సంస్థల దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. -
ఓటమిని అంగీకరించిన రాజపక్స
కొలంబో: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మహింద రాజపక్సకు గట్టి షాక్ తగిలింది. మైత్రిపాల సిరిసేన మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. ముందస్తు ఎన్నికలకు వెళితే గెలుపు గ్యారంటీ అన్న రాజపక్స సెంటిమెంట్ బెడిసి కొట్టింది. పదవీ కాలం ఇంకా రెండేళ్లు ఉండగానే రాజపక్స ఎన్నికలకు వెళ్లారు. మూడోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న కలలు కన్న ఆయనకు నిరాశ ఎదురైంది. ఓటమిని అంగీకరించిన రాజపక్స.. అధికార నివాసాన్ని విడిచి వెళ్లిపోయారు. విపక్ష కూటమి ఉమ్మడి అభ్యర్ధిగా బరిలోకి దిగిన సిరిసేన కొత్త అధ్యక్షుడిగా శుక్రవారం సాయంత్రం ప్రమాణం చేయనున్నారు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. -
మాల్దీవుల అధ్యక్ష ఎన్నికలు 16కు వాయిదా
మాలే: మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల తుది అంకం వారంపాటు వాయిదా పడింది. శనివారం జరిగిన ఎన్నికల్లో అభ్యర్థుల్లో ఎవరికీ అవసరమైన మెజారిటీ(50 శాతం ఓట్లు) రాకపోవడంతో ఆదివారం మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, సుప్రీంకోర్టు ఈ నెల 16కు వాయిదా వేసింది. ఎన్నికలు జరిగిన మరుసటిరోజే మళ్లీ ఎన్నికలు జరిపితే ప్రజల రాజ్యాంగ హక్కులను బలహీనపరచినట్లవుతుందని కోర్టు ఆదివారం వేకువజామున ఇచ్చిన తీర్పులో పేర్కొంది. శనివారం నాటి ఎన్నికల్లో మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ అధినేత, మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్‌కు 46.4 శాతం, మాల్దీవ్స్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన ఆయన సమీప ప్రత్యర్థి అబ్దుల్లా యామీన్‌కు 30.3 శాతం, జుమ్‌హూరీ పార్టీ అభ్యర్థి గాసిమ్ ఇబ్రహీమ్‌కు 23.4 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో తన మద్దతుదారులు నషీద్, యామీన్లలో ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవడానికి తగినంత సమయం ఇవ్వాలని ఇబ్రహీం కోర్టును కోరారు. మాల్దీవుల అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడడం రెండు నెలల్లో ఇది మూడోసారి. సెప్టెంబర్ 7 నాటి ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థికీ పూర్తి మెజారిటీ రాకపోవడం తెలిసిందే. కాగా, ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం ఆదివారంతో పూర్తయింది కనుక అధ్యక్ష స్థానంలో ఉన్న మహమ్మద్ వహీద్ పాలనలో ఎన్నికలు నిర్వహించడం చట్టవిరుద్ధమని, ఆయన రాజీనామా చేయాలని నషీద్ డిమాండ్ చేశారు. అయితే ఎన్నికలు పూర్తయ్యేంతవరకు వహీదే అధ్యక్షుడిగా కొనసాగాలని సుప్రీంకోర్టు శనివారం సూచించింది.