ఆదిలాబాద్‌ ఎంపీకి అరుదైన అవకాశం | Presidential Polls 2022: Draupadi Murmu To File Nomination On June 24 | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్‌ ఎంపీకి అరుదైన అవకాశం

Published Thu, Jun 23 2022 2:05 AM | Last Updated on Thu, Jun 23 2022 9:47 AM

Presidential Polls 2022: Draupadi Murmu To File Nomination On June 24 - Sakshi

ఆదిలాబాద్‌ టౌన్‌: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఈనెల 24న న్యూఢిల్లీలో నామినేషన్‌ దాఖలు చేయనుండగా.. ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరుకావాలని ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి ఆహ్వానం అందింది.

ఈ మేరకు బుధవారం సాయంత్రం పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి అర్జున్‌రామ్‌ మేఘవాల్‌ స్వయంగా బాపూరావుకు ఫోన్‌చేసి వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానించారు.  ఆదివాసి బిడ్డ ద్రౌపది ముర్ము నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో ఆ పత్రాలపై అదే వర్గానికి చెందిన బాపూరావుకు ప్రతిపాదించేందుకు అరుదైన అవకాశం లభించడం విశేషం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement