Arjun Ram
-
ఆదిలాబాద్ ఎంపీకి అరుదైన అవకాశం
ఆదిలాబాద్ టౌన్: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఈనెల 24న న్యూఢిల్లీలో నామినేషన్ దాఖలు చేయనుండగా.. ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరుకావాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి ఆహ్వానం అందింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ స్వయంగా బాపూరావుకు ఫోన్‌చేసి వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆదివాసి బిడ్డ ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆ పత్రాలపై అదే వర్గానికి చెందిన బాపూరావుకు ప్రతిపాదించేందుకు అరుదైన అవకాశం లభించడం విశేషం. -
బీడీ పరిశ్రమకు జీఎస్టీని మినహాయించండి
కేంద్ర మంత్రి అర్జున్రాంను కోరిన బీడీ మజ్దూర్ సంఘ్ సాక్షి, న్యూఢిల్లీ: అధికశాతం మహిళలు బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నందున వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నుంచి ఆ పరిశ్రమకు మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రాం మెగ్వాల్‌ను అఖిల భారత బీడీ మజ్దూర్ మహా సంఘ్ నేతలు కోరారు. శనివారం కేంద్రమంత్రిని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలసిన సంఘం నేతలు.. జీఎస్టీలో బీడీ ఆకులపై 18 శాతం, బీడీలపై 28 శాతం పన్ను విధించడం వల్ల బీడీ పరిశ్రమ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని వివరించారు. బీడీ పరిశ్రమలపై దాదాపు కోటి మంది వరకు ఆధారపడి బతుకుతున్నారని, జీఎస్టీలో పన్నులు పెంచడం వల్ల వారి జీవనాధారం ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. మెగ్వాల్‌ను కలసిన వారిలో ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్ తదితరులున్నారు. -
ఏపీకి హోదాపై కొద్ది రోజుల్లో ప్రకటన
కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ వెల్లడి వన్‌టౌన్ (విజయవాడ): ఏపీకి ప్రత్యేక హోదా లేక ప్రత్యేక ప్యాకేజీ అన్న విషయాన్ని కొద్ది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ వెల్లడించారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా మంగళవారం విజయవాడకు వచ్చిన కేంద్ర మంత్రిని రాష్ట్ర వైద్య మంత్రి కామినేని శ్రీనివాస్ దుర్గాఘాట్‌లోని వీఐపీ ఘాట్‌కు తీసుకొచ్చారు. మంత్రి కృష్ణా నదికి నమస్కరించి నీటిని తలకు రాసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పుష్కరాలు భారతీయ ఔన్నత్యాన్ని చాటే గొప్ప కార్యక్రమమన్నారు. ప్రత్యేక హోదాపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. దీనిపై పార్లమెంటులో ఇటీవల సుదీర్ఘ చర్చ జరిగిందన్నారు. ఏపీకి అన్ని విధాల సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.