ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ: అధికార ఎన్డీయే కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన ద్రౌపది ముర్ము (64)కు కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించింది. సీఆర్‌పీఎఫ్ కమాండోల 'జెడ్ ప్లస్' భద్రతను ఆమెకు కల్పించినట్లు కేంద్ర అధికారులు బుధవారం వెల్లడించారు. జెడ్ ప్లస్ రక్షణ అనేది కేంద్ర ప్రభుత్వం అందించే రెండవ అత్యున్నత స్థాయి సెక్యురిటీ.
24న నామినేషన్
ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము జూన్ 24న నామినేషన్ దాఖలు చేయనున్నారు. జూలై 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. కాగా, కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ఎంపికైన సంగతి తెలిసిందే. (క్లిక్: అంచెలంచెలుగా ఎదిగిన ఆదివాసీ బిడ్డ)
Comments
Please login to add a commentAdd a comment