న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో ఓటర్లు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలైన్లలో నిల్చున్నారు. ఇక.. పోలింగ్ పాల్గొని ఓటు వేయాలని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా పౌరులకు విజ్ఞప్తి చేశారు.
బ్యాలెట్ పేపర్ విధానంలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. హ్యాండ్‌మార్క్‌డ్ పేపర్ బ్యాలెట్స్ ద్వారా కొందరు, బ్యాలెట్ మార్కింగ్ డివైజ్(BMD)లతో కూడిన పేపర్‌బ్యాలెట్‌తో మరికొందరు ఓటేసే ఛాన్స్ ఇచ్చారు. బీఎండీ డిజిటల్ బ్యాలెట్.. ఓటేసి అప్పటికప్పుడే ప్రింట్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈవీఎంల తరహా డైరెక్ట్ రికార్డింగ్ ఎలక్ట్రానిక్(DRE) ద్వారా కేవలం ఐదు శాతం ఓటేసే ఛాన్స్ ఉంది. హ్యాకింగ్ ఆరోపణలు, ట్యాంపరింగ్ అనుమానాల నేపథ్యంలోనే డీఆర్‌ఈలకు అమెరికా ఓటర్లు దూరంగా ఉన్నారు.
ఇక.. గత ఎన్నికల్లో కేవలం 66 శాతమే పోలింగ్ నమోదైంది. ఈసారి ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థులు నిలబడ్డారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇద్దరి మధ్యే పోటీ నెలకొంది. ట్రంప్-హారిస్ మధ్య పోటీతో అమెరికన్ల తీర్పు ఎలా ఉండనుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. కనెక్టికట్, ఇండియానా, కెంటకీ, న్యూజెర్సీ, మెయినే, న్యూహాంప్సైర్, న్యూయార్క్ వర్జీనీయాలో పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ అయిన వెంటనే కౌంటింగ్ ప్రారంభం కానుంది.ఇక.. రేపు సాయంత్రం లేదంటే ఎల్లుండి కల్లా ఫలితంపై స్పష్టత రానుంది.
Comments
Please login to add a commentAdd a comment