న్యూయార్క్:అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఇండో అమెరికన్ కమలా హారిస్ ఖరారై.. ప్రచారంలో దూసుకువెళ్తుతున్నారు. తాజా డెమోక్రటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా మిన్నెసొటా గవర్నర్ టిమ్‌వాల్ట్స్ ఎంపికయ్యారు. అధ్యక్ష రేసులో ఉన్న కమలా హారిస్.. తమ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా వాల్ట్స్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై డెమోక్రటిక్ పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
అమెరికా చట్టసభలో 12 ఏళ్లపాటు సేవలందించిన టిమ్‌వాల్ట్స్ 2018లో మిన్నెసొటా గవర్నర్‌గా ఎన్నికయ్యారు. అమెరికా ఆర్మీ నేషనల్ గార్డ్‌లో 20 ఏళ్ల పాటు పనిచేశారు. అదేవిధంగా టిమ్‌వాల్ట్స్ తనదైన వ్యూహాలతో రిపబ్లికన్ పార్టీ, అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్‌లపై విమర్శలు గుప్పించటంతో అందరిని ఆకర్షించారు. మరోవైపు.. అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ విజయం సాధిస్తారని అన్ని సర్వేలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు.. ఆదివారం సీబీఎస్ న్యూస్/యూగవ్ సంస్థ చేపట్టిన సర్వేలో కమలా హరీస్ ఆధిక్యం కనబరిచారు. ట్రంప్ అధ్యక్ష పదవిలో మానసికంగా స్థిమితంగా ఆలోచించగలరని 51 శాతం మంది, కమల మెరుగ్గా పరిపాలించగలరని 64 శాతం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment