running mate
-
అమెరికా ఎన్నికలు: డెమోక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా టిమ్ వాల్ట్స్!
న్యూయార్క్:అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఇండో అమెరికన్ కమలా హారిస్ ఖరారై.. ప్రచారంలో దూసుకువెళ్తుతున్నారు. తాజా డెమోక్రటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా మిన్నెసొటా గవర్నర్ టిమ్‌వాల్ట్స్ ఎంపికయ్యారు. అధ్యక్ష రేసులో ఉన్న కమలా హారిస్.. తమ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా వాల్ట్స్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై డెమోక్రటిక్ పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.అమెరికా చట్టసభలో 12 ఏళ్లపాటు సేవలందించిన టిమ్‌వాల్ట్స్ 2018లో మిన్నెసొటా గవర్నర్‌గా ఎన్నికయ్యారు. అమెరికా ఆర్మీ నేషనల్ గార్డ్‌లో 20 ఏళ్ల పాటు పనిచేశారు. అదేవిధంగా టిమ్‌వాల్ట్స్ తనదైన వ్యూహాలతో రిపబ్లికన్ పార్టీ, అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్‌లపై విమర్శలు గుప్పించటంతో అందరిని ఆకర్షించారు. మరోవైపు.. అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ విజయం సాధిస్తారని అన్ని సర్వేలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు.. ఆదివారం సీబీఎస్ న్యూస్/యూగవ్ సంస్థ చేపట్టిన సర్వేలో కమలా హరీస్ ఆధిక్యం కనబరిచారు. ట్రంప్ అధ్యక్ష పదవిలో మానసికంగా స్థిమితంగా ఆలోచించగలరని 51 శాతం మంది, కమల మెరుగ్గా పరిపాలించగలరని 64 శాతం చెప్పారు. -
US presidential election 2024: నిక్కీ హేలీ నా రన్నింగ్ మేట్ కాదు: ట్రంప్
వాషింగ్టన్: అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీదారుగా ఉన్న భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ తన రన్నింగ్ మేట్ (ఉపాధ్యక్ష పదవి అభ్యర్థి) కాదని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఆమెకు అంత సామర్థ్యం లేదని, ఉపాధ్యక్ష పదవికి ఆమెను ఎంపిక చేసుకోనని వ్యాఖ్యానించారు. అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ తరఫున అగ్రభాగాన ఉన్న ట్రంప్ శుక్రవారం కాంకార్డ్‌లో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. న్యూహ్యాంప్‌షైర్‌లో ట్రంప్‌కు సమీప ప్రత్యర్థిగా ఉన్న నిక్కీ హేలీ..తాను ఉపాధ్యక్ష పదవి రేసులో లేనని ఇప్పటికే ప్రకటించగా ట్రంప్ పైవిధంగా స్పందించడం గమనార్హం. అదేవిధంగా, ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో నిక్కీ హేలీని జాతిపరంగా హేళన చేశారు. పంజాబ్‌కు చెందిన సిక్కు తల్లిదండ్రుల కుమార్తె అయిన నిక్కీ హేలీని ‘నింబ్రా’అంటూ పలుమార్లు పేర్కొన్నారు. నిక్కీ తల్లిదండ్రులు అమెరికన్లు కానందున అధ్యక్ష పదవికి ఆమె అర్హురాలు కాదని ఇటీవల పేర్కొన్న ట్రంప్..ఆమె పేరును ‘నిమ్రద’అంటూ తప్పుగా ఉచ్చరించారు. సౌత్ కరోలినాకు రెండు పర్యాయాలు గవర్నర్‌గా పనిచేసిన నిక్కీ హేలీ అసలు పేరు నిమ్రతా నిక్కీ హేలీ. వివాహానంతరం నిక్కీ హేలీగా మార్చుకున్నారు. -
మళ్లీ ఎన్నికల బరిలోకి
వాషింగ్టన్: అసంపూర్తిగా ఉన్న బాధ్యతలను పూర్తి చేసేందుకు తనకు మరో అవకాశమివ్వాలని అమెరికా ప్రజలను అధ్యక్షుడు జో బైడెన్ (80) కోరారు. వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన మూడు నిమిషాల వీడియోతో ఎన్నికల ప్రచారానికి ఆయన అధికారికంగా శ్రీకారం చుట్టారు. భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌నే మరోసారి తన రన్నింగ్ మేట్‌గా ఎంచుకున్నారు. డెమొక్రటిక్ పార్టీ కి చెందిన బైడెన్ అమెరికా చరిత్రలో అత్యంత ఎక్కువ వయసున్న అధ్యక్షుడు. ఇక కమల దేశ తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్గారికార్డు సృష్టించారు. బైడెన్‌పై ట్రంప్ ధ్వజం: బైడెన్ అమెరికా చరిత్రలోనే అత్యంత అవినీతిపరుడైన అధ్యక్షుడని ట్రంప్ ఆరోపించారు. ‘‘ప్రపంచ వేదికపై దేశ పరువు ప్రతిష్టలను ఆయన పూర్తిగా మంటగలిపారు. తన చేతగానితనంతో అమెరికాను మూడో ప్రపంచ యుద్ధం ముంగిట నిలబెట్టారు’’ అంటూ నిప్పులు చెరిగారు. బైడెన్ అధికార ప్రకటనకు కాస్త ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడారు. అఫ్గానిస్తాన్ నుంచి వైదొలగడాన్ని అమెరికా చరిత్రలోనే అత్యంత సిగ్గుచేటైన విషయంగా అభివర్ణించారు. రిపబ్లికన్ల అతివాదంపై పోరు 2024 ఎన్నిలను రిపబ్లికన్ల అతివాదంపై పోరుగా బైడెన్ అభివర్ణించారు. అబార్షన్ హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక భద్రత చట్రం వంటివి ఎన్నికల్లో ప్రధానాంశాలన్నారు. ‘‘గత అధ్యక్ష ఎన్నికలను అమెరికా ఆత్మను పరిరక్షించేందుకు జరిగిన పోరు. అదింకా కొనసాగుతూనే ఉంది. మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, హక్కులు మున్ముందు మరింత వికసిస్తాయా, కుదించుకుపోతాయా అన్నది ఇప్పుడు మనందరి ముందున్న పెద్ద ప్రశ్న. రానున్న ఎన్నికలు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పిడికిలి బిగించేందుకు తరానికి ఒక్కసారే వచ్చే అవకాశం. రండి అందరమూ కలిసికట్టుగా పని పూర్తి చేద్దాం’’ అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటంలో కలసి రావాల్సిందిగా అనంతరం కమల కూడా ఒక ప్రకటనలో అమెరికన్లకు పిలుపునిచ్చారు. ‘‘దేశ చరిత్రలో ఇది అత్యంత కీలక సమయం. స్వేచ్ఛ తదితర మౌలిక హక్కులపై రిపబ్లికన్ అతివాదుల దాడి నానాటికీ పెరిగిపోతోంది. మహిళకు తన శరీరానికి సంబంధించిన నిర్ణయాలపై హక్కులను హరించజూస్తున్నారు. ఓటు హక్కునూ వదల్లేదు. ప్రజల గొంతు నొక్కేందుకూ ప్రయత్నిస్తున్నారు. రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ప్రయత్నిస్తున్న వాళ్లు దేశాన్ని తిరోగమనంలోకి నెట్టజూస్తున్నారు’’ అంటూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష అభ్యర్థి రేసులో ట్రంప్ ముందున్న విషయం తెలిసిందే. భారత అమెరికన్లు నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి తదితరులు ఆయనకు పోటీదారులుగా ఉన్నారు. -
బరిలో కమలా హారిస్ : ట్రంప్ స్పందన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాలిఫోర్నియా సెనేటర్ కమలా హారిస్‌పై మరోసారి నోరు పారేసుకున్నారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా హారిస్‌ను జో బిడెన్ ప్రకటించిన కొద్ది నిమిషాల తరువాత, హారిస్‌ను "ఫోనీ" గా ముద్ర వేస్తూ ఒక ప్రచార వీడియోను ట్రంప్ ట్వీట్ చేశారు. (చరిత్ర సృష్టించిన జో బిడెన్) డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా తొలి నల్లజాతి మహిళగా బరిలో నిలిచిన ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ట్రంప్. జో బిడెన్ వైస్ ప్రెసిడెంట్ గా ఆమెను ఎన్నుకోవడం తనకు కొంచెం ఆశ్చర్యం కలిగించిందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా సెనేట్‌లో ఆమె అత్యంత నీచమైన, అత్యంత భయంకరమైన, ఏమాత్రం మర్యాదలేని వ్యక్తిగా తాను భావిస్తున్నానంటూ హారిస్‌పై దాడిచేశారు. అలాగే "జాత్యహంకార విధానాలకు" బిడెన్ మద్దతు ఇస్తున్నారంటూ విమర్శించారు. కాగా కాలిఫోర్నియాకు మూడుసార్లు ఎంపికైన కమలా హారిస్ తాజాగా అమెరికా ఉపాధ్యక్ష పదవి పోటీలో సంగతి తెలిసిందే. ప్రస్తుత అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీలో దూకుడు ప్రచారకురాలిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. -
అమెరికా ఎన్నికల్లో అనూహ్య పరిణామం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న జో బిడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ను అమెరికా ఉపాధ్యక్ష రేసులో నిలిపారు. వైస్ ప్రెసిడెంట్‌గా మహిళను ఎంచుకుంటానని ఇప్పటికే ప్రకటించిన బిడెన్ ఈ పదవికి మొదటి నల్లజాతి మహిళను పోటీలో నిలిపి చరిత్ర సృష్టించారు. బ్లాక్ ఓటర్లను ఆకర్షించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెక్ పెట్టే వ్యూహంలో భాగంగా బిడెన్ హారిస్ ను ఎంపిక చేశారు. ఈ విషయాన్నిబిడెన్ ట్విటర్ ద్వారా ధృవీకరించారు. దేశంలోని అత్యుత్తమ ప్రజా సేవకులలో ఒకరంటూ హారిస్ ను ప్రశంసించిన బిడెన్ మీతో కలిసి, ట్రంప్ ను ఓడించబోతున్నామంటూ పేర్కొన్నారు. అటు హారిస్ కూడా తనను ఎంపిక చేసినందుకు సంతోషం ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. మరోవైపు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం హారిస్ అభ్యర్థిత్వానికి మద్దతు పలకడం విశేషం. అమెరికా చరిత్రలో ఇంతవరకూ ఒక మహిళ అధ్యక్షులుగా లేదా ఉపాధ్యక్షురాలిగా పనిచేయలేదు. ప్రధాన పార్టీలకు సంబంధించి ఇద్దరు మహిళలు రన్నింగ్ మేట్స్‌గా నామినేట్ అయ్యారు 1984 లో డెమొక్రాట్ జెరాల్డిన్ ఫెరారో, 2008 లో రిపబ్లికన్ సారా పాలిన్ బరిలో నిలిచినా ఆ పార్టీలు ఓడిపోయాయి. దీంతో తాజాగా హారిస్ ఎంపికపై అభినందనల వెల్లువ కురుస్తోంది. I have the great honor to announce that I’ve picked @KamalaHarris — a fearless fighter for the little guy, and one of the country’s finest public servants — as my running mate. — Joe Biden (@JoeBiden) August 11, 2020 .@JoeBiden can unify the American people because he's spent his life fighting for us. And as president, he'll build an America that lives up to our ideals. I'm honored to join him as our party's nominee for Vice President, and do what it takes to make him our Commander-in-Chief. — Kamala Harris (@KamalaHarris) August 11, 2020 I’ve known Senator @KamalaHarris for a long time. She is more than prepared for the job. She’s spent her career defending our Constitution and fighting for folks who need a fair shake. This is a good day for our country. Now let’s go win this thing. pic.twitter.com/duJhFhWp6g — Barack Obama (@BarackObama) August 11, 2020 -
’దాడిచేసే కుక్కలాంటివాడి తోడు కావాలి’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మరోసారి గబ్బుమాట మాట్లాడారు. తనకు తోడుగా ఓ దాడి చేసే కుక్కలాంటి వాడు కావాలని అన్నారు. తాను అధ్యక్షుడు అయితే, తనతోపాటు ఉండబోయే ఉపాధ్యక్షుడికి ఇలాంటి లక్షణాలు ఉండాలి అని పరోక్షంగా వ్యాఖ్యానిస్తూ అందరిని అవాక్కయ్యేలా చేశాడు. అంతేకాకుండా తాను ఈ మాట ఎవరిని ఆశ్చర్యపరిచేందుకో, ఆటలాడేందుకో చెప్పడం లేదని, అంతటి సమర్థంగా పనిచేసే లక్షణాలు ఉండాలని చెప్పడమే తన ఉద్దేశం అన్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఉన్న ట్రంప్ పలు టీవీ చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ది వాల్ స్ట్రీట్ జర్నల్ కు ఇండియానా గవర్నర్ మైక్ పెన్స్, మాజీ స్పీకర్ గింగ్రిచ్, న్యూజెర్సీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ, అలబామా సెనేటర్ జెఫ్, మరో ఇద్దరు రాజకీయ నాయకులతోపాటు ట్రంప్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడి అంశంపై చర్చ వచ్చినప్పుడు ట్రంప్ ఈ విధంగా వ్యాఖ్యానించాడు. పరిస్థితులకు తగినట్లుగా పనిచేసే వ్యక్తి తనకు తోడుగా ఉండాలని, ఒక్క మాటలో చెప్పాలంటే ఓ దాడి చేసే కుక్కలాగా పనిచేయగలగాలని, అలాంటివాడి తోడు తనకు అవసరం అని ట్రంప్ చెప్పారు. తనను ఎంతోమంది ఎన్నో మాటలతో విమర్శిస్తుంటారని, అయితే, వ్యక్తిగత అభిప్రాయాలు కలిస్తేనే సమర్థంగా ముందుకెళ్లగలమని ఆయన చెప్పారు.