వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాలిఫోర్నియా సెనేటర్ కమలా హారిస్‌పై మరోసారి నోరు పారేసుకున్నారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా హారిస్‌ను జో బిడెన్ ప్రకటించిన కొద్ది నిమిషాల తరువాత, హారిస్‌ను "ఫోనీ" గా ముద్ర వేస్తూ ఒక ప్రచార వీడియోను ట్రంప్ ట్వీట్ చేశారు. (చరిత్ర సృష్టించిన జో బిడెన్)
డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా తొలి నల్లజాతి మహిళగా బరిలో నిలిచిన ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ట్రంప్. జో బిడెన్ వైస్ ప్రెసిడెంట్ గా ఆమెను ఎన్నుకోవడం తనకు కొంచెం ఆశ్చర్యం కలిగించిందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా సెనేట్‌లో ఆమె అత్యంత నీచమైన, అత్యంత భయంకరమైన, ఏమాత్రం మర్యాదలేని వ్యక్తిగా తాను భావిస్తున్నానంటూ హారిస్‌పై దాడిచేశారు. అలాగే "జాత్యహంకార విధానాలకు" బిడెన్ మద్దతు ఇస్తున్నారంటూ విమర్శించారు. కాగా కాలిఫోర్నియాకు మూడుసార్లు ఎంపికైన కమలా హారిస్ తాజాగా అమెరికా ఉపాధ్యక్ష పదవి పోటీలో సంగతి తెలిసిందే. ప్రస్తుత అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీలో దూకుడు ప్రచారకురాలిగా ఆమె పేరు తెచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment