ఓటమిని అంగీకరించిన రాజపక్స | Mahinda Rajapaksa concedes defeat in Presidential polls | Sakshi
Sakshi News home page

ఓటమిని అంగీకరించిన రాజపక్స

Published Fri, Jan 9 2015 8:06 AM | Last Updated on Sat, Sep 2 2017 7:27 PM

ఓటమిని అంగీకరించిన రాజపక్స

ఓటమిని అంగీకరించిన రాజపక్స

కొలంబో: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మహింద రాజపక్సకు గట్టి షాక్‌ తగిలింది. మైత్రిపాల సిరిసేన మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. ముందస్తు ఎన్నికలకు వెళితే గెలుపు గ్యారంటీ అన్న రాజపక్స సెంటిమెంట్‌ బెడిసి కొట్టింది. పదవీ కాలం ఇంకా రెండేళ్లు ఉండగానే రాజపక్స ఎన్నికలకు వెళ్లారు.

మూడోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న కలలు కన్న ఆయనకు నిరాశ ఎదురైంది. ఓటమిని అంగీకరించిన రాజపక్స.. అధికార నివాసాన్ని విడిచి వెళ్లిపోయారు. విపక్ష కూటమి ఉమ్మడి అభ్యర్ధిగా బరిలోకి దిగిన సిరిసేన కొత్త అధ్యక్షుడిగా శుక్రవారం సాయంత్రం ప్రమాణం చేయనున్నారు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement