Record Polling
-
370 రద్దు వల్లే కశ్మీర్లో భారీ పోలింగ్
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370ని రద్దు చేయడం వల్లనే జమ్మూకశ్మీర్‌లో గురువారం జరిగిన బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్(బీడీసీ) ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఆ ఎన్నికల్లో 98.3 శాతం పోలింగ్ నమోదైంది. ‘ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్న భారత పార్లమెంటుకు కృతజ్ఞతలు. ఆ నిర్ణయానికి పార్టీలకు అతీతంగా మద్దతు తెలిపిన ఎంపీలకు ధన్యవాదాలు. ఇక యువకులు, ఉత్సాహవంతులైన ప్రజా ప్రతినిధులు జమ్మూకశ్మీర్ రాత మారుస్తారు’ అని శుక్రవారం మోదీ ట్వీట్ చేశారు. ఎలాంటి హింసాత్మక, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ ఎన్నికలు జరిగిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ‘జమ్మూ, కశ్మీర్, లేహ్, లదాఖ్‌ల్లో గురువారం బీడీసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి హింస చోటు చేసుకోలేదు. 98% పైగా పోలింగ్ నమోదైంది. అక్కడి ప్రజల్లో ప్రజాస్వామ్యం పట్ల ఉన్న విశ్వాసానికి ఇదే రుజువు’ అని మోదీ పేర్కొన్నారు. గత సంవత్సరం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లు, వార్డ్ మెంబర్లే ఈ బీడీసీ ఎన్నికల్లో ఓటర్లు. ఆ ఎన్నికల్లో 22 మంది బీజేపీవారు సహా 27 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరించాయి. ఆగస్ట్‌లో జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగ అధికరణ 370 ని రద్దు చేసిన విషయం తెలిసిందే. -
ఓటమిని అంగీకరించిన రాజపక్స
కొలంబో: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మహింద రాజపక్సకు గట్టి షాక్ తగిలింది. మైత్రిపాల సిరిసేన మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. ముందస్తు ఎన్నికలకు వెళితే గెలుపు గ్యారంటీ అన్న రాజపక్స సెంటిమెంట్ బెడిసి కొట్టింది. పదవీ కాలం ఇంకా రెండేళ్లు ఉండగానే రాజపక్స ఎన్నికలకు వెళ్లారు. మూడోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న కలలు కన్న ఆయనకు నిరాశ ఎదురైంది. ఓటమిని అంగీకరించిన రాజపక్స.. అధికార నివాసాన్ని విడిచి వెళ్లిపోయారు. విపక్ష కూటమి ఉమ్మడి అభ్యర్ధిగా బరిలోకి దిగిన సిరిసేన కొత్త అధ్యక్షుడిగా శుక్రవారం సాయంత్రం ప్రమాణం చేయనున్నారు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. -
లంక అధ్యక్ష ఎన్నికల్లో రికార్డు పోలింగ్
కొలంబో: శ్రీ లంక అధ్యక్ష ఎన్నికలు గురువారం ముగిశాయి. ఓటర్లు భారీగా పోలింగ్‌లో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో కూడా విజయం సాధించి ప్రస్తుత అధ్యక్షుడు మహీం రాజపక్స వరుసగా మూడోసారి అధ్యక్షుడవుతారా? లేక ఆయనకు ప్రత్యర్థిగా మారిన స్నేహితుడు మైత్రిపాల సిరిసేన అధ్యక్ష పగ్గాలు చేపడతారా? అన్నది శుక్రవారం తేలనుంది. తమిళులు, ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అధిక శాతం ఓటింగ్ నమోదవడం విశేషం. మెజారిటీ సింహళ ఓటర్లు ఈ ఇరువురు అభ్యర్థులకు సమానంగా మద్దతిస్తున్న నేపథ్యంలో.. తమిళుల, ముస్లింల ఓట్లు ఫలితంలో కీలకపాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 65% నుంచి 70% పోలింగ్ నమోదయినట్లు అధికారుల అంచనా. ఈ ఎన్నికల్లో రాజపక్సకు సిరిసేన గట్టి పోటీ ఇచ్చారు. సిరిసేన గెలిస్తే దేశంలో రాజకీయంగా పెనుమార్పులకు అది శ్రీకారమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలేవీ జరగలేదని అధికారులు పేర్కొనగా, కొన్ని చోట్ల ఓటర్లను అడ్డుకున్నారని సమాచారం. పోటీలో 19 మంది ఉన్నప్పటికీ.. ప్రధానంగా పోటీ రాజపక్స, సిరిసేనల మధ్యే ఉంది. విజయంపై ఇరువురు నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. -
హర్యానా ఎన్నికల్లో రికార్డు పోలింగ్!
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో అత్యధిక పోలింగ్ నమోదైంది. బుధవారం సాయంత్ర 6 గంటల సమయానికి అందిన సమాచారం ప్రకారం 72 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. గతంలో 1967 సంవత్సరంలో అత్యధికంగా నమోదైన 72.65 శాతం పోలింగ్ రికార్డును అధిగమించే సూచనలు కనిపిస్తున్నాయి. 2009 ఎన్నికల్లో 72.37 శాతం పోలింగ్ నమోదైంది.