లంక అధ్యక్ష ఎన్నికల్లో రికార్డు పోలింగ్ | Record polling in Sri Lankan president elections | Sakshi
Sakshi News home page

లంక అధ్యక్ష ఎన్నికల్లో రికార్డు పోలింగ్

Published Fri, Jan 9 2015 7:51 AM | Last Updated on Tue, Oct 16 2018 5:59 PM

Record polling in Sri Lankan president elections

కొలంబో: శ్రీ లంక అధ్యక్ష ఎన్నికలు గురువారం ముగిశాయి. ఓటర్లు భారీగా పోలింగ్‌లో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో కూడా విజయం సాధించి ప్రస్తుత అధ్యక్షుడు మహీం రాజపక్స వరుసగా మూడోసారి అధ్యక్షుడవుతారా? లేక ఆయనకు ప్రత్యర్థిగా మారిన స్నేహితుడు మైత్రిపాల సిరిసేన అధ్యక్ష పగ్గాలు చేపడతారా? అన్నది శుక్రవారం తేలనుంది. తమిళులు, ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అధిక శాతం ఓటింగ్ నమోదవడం విశేషం. మెజారిటీ సింహళ ఓటర్లు ఈ ఇరువురు అభ్యర్థులకు సమానంగా మద్దతిస్తున్న నేపథ్యంలో.. తమిళుల, ముస్లింల ఓట్లు ఫలితంలో కీలకపాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.
 
దేశవ్యాప్తంగా దాదాపు 65% నుంచి 70% పోలింగ్ నమోదయినట్లు అధికారుల అంచనా. ఈ ఎన్నికల్లో రాజపక్సకు సిరిసేన గట్టి పోటీ ఇచ్చారు. సిరిసేన గెలిస్తే దేశంలో రాజకీయంగా పెనుమార్పులకు అది శ్రీకారమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలేవీ జరగలేదని అధికారులు పేర్కొనగా, కొన్ని చోట్ల ఓటర్లను అడ్డుకున్నారని సమాచారం. పోటీలో 19 మంది ఉన్నప్పటికీ.. ప్రధానంగా పోటీ రాజపక్స, సిరిసేనల మధ్యే ఉంది. విజయంపై ఇరువురు నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement