శ్రీలంక అధ్యక్ష ఫలితాలు.. అనూర కుమార ముందంజ | Sri Lanka presidential election counting updates | Sakshi
Sakshi News home page

శ్రీలంక అధ్యక్ష ఫలితాలు.. అనూర కుమార ముందంజ

Published Sun, Sep 22 2024 10:39 AM | Last Updated on Sun, Sep 22 2024 12:27 PM

Sri Lanka presidential election counting updates

కొలంబో: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజార్టీతో వామపక్ష జనతా విముక్తి పెరమున (జేవీపీ) చీఫ్‌ అనూర కుమార దిస్సనాయకె భారీ విజయానికి చేరువలో ఉన్నారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో అనూర కుమార 52 శాతం ఓట్లతో ముందంజలో దూసుకువెళ్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే కేవలం 16 శాతం ( 2,35,00 ఓట్లు)తో మూడో స్థానంలోకి పడిపోయారు. ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస 22 శాతంతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు.

ఈ  అధ్యక్ష ఎన్నికల్లో  ప్రస్తుత అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే, విపక్ష నేత సజిత్‌ ప్రేమదాసతో, జనతా విముక్తి పెరమున (జేవీపీ) చీఫ్‌ అనూర కుమార దిస్సనాయకె మధ్య పోటీ నెలకొన్న విషయం  తెలిసిందే. అయితే.. ఫలితాల్లో మాత్రం ఊహించని రీతిలో శ్రీలంక ప్రజలు అనూర కుమారకు భారీ ఓట్లు వేశారు. ఈ దెబ్బతో ప్రస్తుత  అధ్యక్షుడు ఊసులో లేకుండా పోయారు.

 

ఇక.. ఎన్నికలు ప్రారంభమైనప్పటినుంచి దిస్సనాయకె ముందున్నట్టు ముందస్తు సర్వేలన్నీ తేల్చాయి. సర్వే ఫలితాలను నిజం చేస్తూ.. అనూర కుమార భారీ లీడింగ్‌లో కొనసాగుతున్నారు. మొత్తం అర్హులైన 17 మిలియన్ల మంది ఓటర్లలో 75 శాతం మంది శనివారం జరిగిన ఎన్నికల్లో తమ ఓటు  వియోగించుకున్నారు. 2022లో చోటుచేసుకున్న ఆర్థిక సంక్షోభం అనంతరం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలు విలక్షమైన తీర్పు ఇచ్చారని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement