srilankan president
-
ఢిల్లీలో శ్రీలంక అధ్యక్షుడికి ఘనస్వాగతం
న్యూఢిల్లీ: మూడు రోజుల పర్యటనలో భాగంగా శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే భారత్ చేరుకున్నారు. ఆదివారం(డిసెంబర్15) సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ఆయనకు కేంద్ర సహాయ మంత్రి మురుగన్ స్వాగతం పలికారు.అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి భారత్‌లో పర్యటిస్తున్న దిసనాయకేకు ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలికినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ వెల్లడించారు.#WATCH | Delhi: Sri Lankan President Anura Kumara Dissanayake was received by MoS Dr L Murugan as he arrived in New Delhi.This is President Disanayaka’s first bilateral visit to India since he assumed Presidency. pic.twitter.com/7IF8zFdczK— ANI (@ANI) December 15, 2024 భారత్‌లో మూడు రోజుల పాటు (డిసెంబరు 15-17 వరకు) దిసనాయకే పర్యటన కొనసాగనుంది. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అనంతరం దిసనాయకే మనదేశంలో చేపట్టిన తొలి ద్వైపాక్షిక పర్యటన ఇదే. ఈ పర్యటనలో దిసనాయకే వెంట శ్రీలంక విదేశాంగ మంత్రి విజితా హెరాత్‌తోపాటు మరో మంత్రి అనిల్ జయంత ఫెర్నాండో కూడా ఉన్నారు.పర్యటనలో తొలుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో దిసనాయకే భేటీ కానున్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటి అవుతారు. ప్రధానంగా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం,ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.కాగా శ్రీలంకలో సెప్టెంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అనుర కుమార దిసనాయకే విజయం సాధించిన విషయం తెలిసిందే.దేశ 9వ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. కొవిడ్ అనంతర పరిస్థితుల్లో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న శ్రీలంక ఇప్పుడిప్పుడే అందులో నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. -
అదానీ ప్రాజెక్ట్‌పై కొత్త ప్రభుత్వం పునఃపరిశీలన
పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకోసం అదానీ గ్రూప్‌నకు గత ప్రభుత్వం మంజూరు చేసిన ఆమోదాన్ని పునఃపరిశీలిస్తామని కొత్తగా ఏర్పడిన శ్రీలంక ప్రభుత్వం తెలిపింది. ఈమేరకు అనురా కుమార దిసానాయకే నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం శ్రీలంక సుప్రీంకోర్టుకు వివరాలు తెలియజేసింది.ప్రాజెక్టును సమీక్షించాలని అక్టోబర్ 7న జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఐదుగురు సభ్యులు కలిగిన సుప్రీంకోర్టు బెంచ్‌కి ప్రభుత్వం తెలియజేసింది. నవంబర్ 14న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొత్త కేబినెట్ ఏర్పాటయ్యాక తుది నిర్ణయం తీసుకుంటామని కోర్టుకు విన్నవించింది. సెప్టెంబర్ 21 అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రెసిడెంట్ దిసానాయకే తన నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) కూటమి ప్రతిపాదిత ప్రాజెక్ట్‌ను రద్దు చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ శ్రీలంక ఇంధన రంగ సార్వభౌమత్వానికి ముప్పుగా పరిణమించిందని.. తాము విజయం సాధించిన తర్వాత ప్రాజెక్టును రద్దు చేస్తామని ఎన్పీపీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది.ఇదీ చదవండి: ‘పదేళ్ల అనుభవం.. ఆ ప్రశ్నతో చిరాకేసింది’అదానీ గ్రూప్ శ్రీలంకలోని ఈశాన్య ప్రాంతాలైన మన్నార్, పూనేరిన్‌లలో 484 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేసేలా గత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. 20 సంవత్సరాల ఒప్పందంలో భాగంగా 440 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ శ్రీలంక సుప్రీంకోర్టులో ప్రాథమిక హక్కుల వ్యాజ్యాన్ని ఎదుర్కొంది. పర్యావరణ ఆందోళనలు, అదానీ గ్రీన్ ఎనర్జీకి అనుమతినిచ్చే బిడ్డింగ్ ప్రక్రియలో పారదర్శకత లోపాన్ని పిటిషనర్లు లేవనెత్తారు. ఒక కిలోవాట్ అవర్‌కు అంగీకరించిన 0.0826 డాలర్ల టారిఫ్ శ్రీలంకకు నష్టాన్ని కలిగిస్తుందని.. ఇది 0.005 డాలర్లకు తగ్గించాలని పిటిషనర్లు వాదించారు. -
Harini Amarasuriya: శ్రీలంక ప్రధాని హరిణి.. హక్కుల చుక్కాని!
శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా హరిణి అమరసూర్య. ప్రధాని కావడానికి ముందు పార్లమెంట్ సభ్యురాలు. ఎంపీ కావడానికి ముందు లెక్చరర్. లెక్చరర్‌కు ముందు, లెక్చరర్ అయిన తరువాత స్త్రీవాదం, నిరుద్యోగం, లింగ వివక్ష... ఇలా ఎన్నో సామాజిక అంశాలపై హక్కుల కార్యకర్తగా తన గొంతును బలంగా వినిపించింది. సమస్యలు తెలిసిన... సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి ప్రధాని అయితే ఆ పాలన దేశ సామాజిక, ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని చరిత్ర నిరూపించింది. ‘ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రయాణంతో శ్రీలంకలో మరో చరిత్ర మొదలుకానుంది’ అనే ఆశారేఖలు వెల్లివిరుస్తున్నాయి...కొలంబోలో పుట్టి పెరిగిన హరిణి అమరసూర్య హిందూ కాలేజ్, దిల్లీ యూనివర్శిటీలో బి.ఎ, సిడ్నీలోని మక్వరీ యూనివర్శిటీలో ఆంత్రోపాలజీ అండ్ డెవలప్మెంట్లో ఎం.ఎ, ఎడిన్‌బరో యూనివర్శిటీలో సోషల్ ఆంత్రోపాలజీలో పీహెచ్డీ చేసింది. యూత్, పాలిటిక్స్, యాక్టివిజం, జెండర్, డెవలప్మెంట్, శిశు సంరక్షణ, గ్లోబలైజేషన్ అండ్ డెవలప్మెంట్... ఇలా ఎన్నో అంశాలపై లోతైన పరిశోధన చేసింది. పుస్తకాలు రాసింది. డిగ్రీ తరువాత శ్రీలంకలోని మెంటల్ హెల్త్ ఆర్గనైజేషన్ ‘నెస్ట్’తో కలిసి పనిచేసింది హరిణి. ‘నెస్ట్’ వ్యవస్థాపకురాలైన సాలీ హులుగల్లే అట్టడుగు, అణగారిన వర్గాల కోసం పనిచేసింది. ‘నెస్ట్’ ద్వారా ఎంతో మార్పు తీసుకురాగలిగింది. ఆమె ప్రభావంతో మానసిక వైద్యశాలలలో ఎంతోకాలంగా దిక్కుమొక్కు లేకుండా పడి ఉన్న దీనులు, ఎవరూ పట్టించుకోని హెచ్ఐవీ బాధితులు, అనాథ పిల్లలతో కలిసి పనిచేసింది హరిణి.చైల్డ్ ప్రొటెక్షన్, సైకలాజికల్ ప్రాక్టీషనర్‌గా ఎన్నో సంవత్సరాలు పని చేసిన తరువాత శ్రీలంక ఓపెన్ యూనివర్శిటీలో లెక్చరర్‌గా చేరింది. యాక్టివిస్ట్‌గా ఉచిత విద్య కోసం ఎన్నో ఉద్యమాలు చేసింది. ‘ఫెడరేషన్ ఆఫ్ యూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్’ సభ్యురాలైన హరిణి లింగసమానత్వం నుంచి జంతుసంక్షేమం వరకు ఎన్నో అంశాలపై తన గళాన్ని వినిపించింది.ఇక రాజకీయాల విషయానికి వస్తే... 2019లో ‘నేషనల్ ఇంటలెక్చువల్ ఆర్గనైజేషన్’లో చేరిన హరిణి శ్రీలంక అధ్యక్ష ఎన్నికల సమయంలో నేషనల్ పీపుల్స్ పవర్(ఎన్పీపీ) అభ్యర్థి అనురా కుమార దిస్సానాయకే తరఫున ప్రచారం చేసింది. 2020 శ్రీలంక పార్లమెంటరీ ఎన్నికల తరువాత ఎంపీగా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టింది. ఎంపీగా తన రాజకీయ జీవితాన్ని కొనసాగించడానికి లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేసింది. అత్యున్నత పదవి విషయంలో ‘సరిౖయెన వ్యక్తి’ అనే ప్రశంస చాలా తక్కువమందికి లభిస్తుంది. ఇలాంటి వారిలో 54 సంవత్సరాల హరిణి అమరసూర్య ఒకరు. ‘ప్రధానిగా ఆమె సరిౖయెన వ్యక్తి’ అనేది ఇప్పుడు చాలామంది నోట వినిపిస్తున్న మాట.సమాజం అనే పుస్తకాన్ని చదివి..హరిణికి ఆంగ్ల సాహిత్యం అంటే చాలా ఇష్టం. ‘ఇంగ్లీష్ సాహిత్యాన్ని అధ్యయనం చేయాలని ఉంది’ అంటూ నాన్న స్నేహితుడైన మాజీ దౌత్యవేత్త దగ్గర తన మనసులో మాట బయటపెట్టింది. మొదట ఆయన ఎగతాళిగా నవ్వినా ఆ తరువాత మాత్రం ఆంగ్ల సాహిత్యంలోని ఎంతో మంది దిగ్గజ రచయితలను పరిచయం చేశాడు. వారి రచనలు చదువుతుంటే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లుగా అనిపించింది. ‘ఆంగ్ల సాహిత్యంలోకి అడుగు పెట్టిన తరువాత నా చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మొదలైంది. ఆ తరువాత కాలంలో సాహిత్య అధ్యయనం కంటే నా చుట్టూ ఉన్న సమాజాన్ని లోతుగా అధ్యయనం చేయాలనిపించింది’ అంటుంది హరిణి. పుస్తక ప్రపంచంలో కంటే సామాజిక ప్రపంచంలోనే ఆమెకు ఎక్కువ విషయాలు తెలిసాయి. నిరుద్యోగం నుంచి లింగ వివక్ష వరకు ఎన్నో సమస్యలను ప్రత్యక్షంగా చూసింది. ఆమె ఉద్యమకారిణిగా ప్రయాణంప్రారంభించడానికి, ఆ తరువాత రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి ‘సమాజం’ అనే పుస్తకం ఎంతో ఉపయోగపడింది.అవును... ఆమె దిల్లీ స్టూడెంట్!‘హిందూ కళాశాల పూర్వ విద్యార్థి అయిన హరిణి శ్రీలంక ప్రధాని కావడం మా కళాశాలకు గౌరవంగా భావిస్తున్నాను. ఆమె విజయం పట్ల మేము గర్వపడుతున్నాం. హరిణి సాధించిన విజయం మా కళాశాల చరిత్రలో మరో మైలురాయి. హిందూ కళాశాలలో హరిణి గడిపిన కాలం ఆమె నాయకత్వానికి మార్గనిర్దేశం చేయడంలో సహాయపడుతుందని ఆశిస్తున్నాను’ అన్నారు ఆ కళాశాల ప్రిన్సిపాల్ అంజు శ్రీవాస్తవ. హరిణి హిందూ కాలేజీలో 1991 నుండి 1994 వరకు చదివింది. బాలీవుడ్ దర్శకుడు నళిన్ రాజన్సింగ్ హిందూ కాలేజీలో హరిణి బ్యాచ్ మేట్.‘కాలేజీ ఉత్సవాలు, చర్చలలో హరిణి చురుగ్గా పాల్గొనేది. ఆమె ప్రధాని స్థాయికి ఎదగడం గర్వంగా ఉంది’ అంటున్నాడు నళిన్ రాజన్సింగ్.ఇవి చదవండి: మహిళల ప్రపంచకప్ టికెట్ల విక్రయం షురూ -
శ్రీలంక ప్రధానిగా హరిణి
కొలంబో: శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా హరిణి అమరసూర్య(54) ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్ష పదవికి ఎన్నికలు ముగియడంతో సోమవారం ప్రధాని దినేశ్ గుణవర్థనే పదవికి రాజీనామా చేశారు. నూతన అధ్యక్షుడు అనూర కుమార దిస్స నాయకే మంగళవారం జరిగిన ఒక కార్య క్రమంలో హరిణితో ప్రధానిగా ప్రమాణం చేయించారు.ఎన్‌పీపీకే చెందిన విజితా హెరత్, లక్ష్మణ్ నిపుణ రచ్చిలతోపాటు అధ్యక్షుడు దిస్సనాయకే కూడా మంత్రిగా ప్రమాణం చేయడం గమనార్హం. నవంబర్ 14∙పార్లమెంట్ ఎన్నికలు జరిగేదాకా తాత్కాలిక కేబినెట్ పనిచేస్తుంది. పార్లమెంటును రద్దు చేస్తూ నూతన అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకే మంగళవారం రాత్రి నిర్ణయం ఉత్తర్వులు జారీ చేశారు.బండారునాయకే తర్వాత: సిరిమావో బండారు నాయకే (2000) తర్వాత శ్రీలంక ప్రధాని అయిన తొలి మహిళగా హరిణి నిలిచారు. ఆమె హక్కుల కార్యకర్త. యూనివర్సిటీ లెక్చరర్‌గా చేస్తున్నారు.డిగ్రీ చదివింది ఢిల్లీలోనే..శ్రీలంక నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన హరిణి అమరసూర్య డిగ్రీ చదివింది ఢిల్లీ యూనివర్సిటీ లోనే. ఇక్కడి హిందూ కాలేజీలో 1991– 1994 సంవత్సరాల్లో సోషియాలజీలో బీఏ పూర్తి చేశారు. హిందూ కాలేజీ పూర్వ విద్యార్థిని శ్రీలంక ప్రధాని కావడం తమకెంతో గర్వకారణమని కాలేజీ ప్రిన్సిపాల్ అంజు శ్రీవాస్తవ హర్షం వ్యక్తం చేశారు. హరిణి బ్యాచ్‌మేట్, బాలీవుడ్ డైరెక్టర్ నళినీ రంజన్ సింగ్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. -
భారత్, చైనాల మధ్య నలిగిపోము: శ్రీలంక అధ్యక్షుడు
కొలంబో: భారత్, చైనా దేశాలతో విదేశాంగ విధానంలో శ్రీలంక సమానమైన వైఖరిని పాటిస్తుందని ఆ దేశ కొత్త అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే అన్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి భారత్, చైనా విదేశాంగ విధానంపై స్పందించారు. భారత్, చైనాల మధ్య నలిగిపోయే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. ఆయన ఓ ఇంటర్వ్యులో పొరుగుదేశాలతో విదేశాంగ విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘మా నాయకత్వంలో దేశం భౌగోళిక, రాజకీయ ప్రత్యర్థుల జోలికి వెళ్లకుండా చూస్తాం. నేషనల్ పీపుల్స్ పవర్( ఎన్పీపీ) ప్రభుత్వం ఏ దేశంతోను జతకట్టదని, పొరుగు దేశాలైన భారత్, చైనా రెండు దేశాలతో సమతుల్య సంబంధాలను పెంపొందించుకోవాలని భావిస్తోంది.మేము భౌగోళిక, రాజకీయ పోరాటంలో ఎవరితో పోటీదారులం కాదు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోము. ముఖ్యంగా భారత్, చైనాల మధ్య నలిగిపోవాలనే ఉద్దేశం మాకు లేదు. రెండు దేశాలు విలువైన స్నేహితులుగా మా ప్రభుత్వ సన్నిహిత భాగస్వాములు కావాలని ఆశిస్తున్నాం. యూరోపియన్ యూనియన్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాతో కూడా సంబంధాలను కొనసాగించుతాం” అని అన్నారు.పొరుగు దేశాల ఆధిపత్య పోరులో శ్రీలంక నలిగిపోవద్దని ఇరుదేశాలతో పరస్పర ప్రయోజనకరమైన దౌత్య భాగస్వామ్యం నిర్మించడంపై దృష్టి సారిస్తోందని అన్నారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీలంక తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి తటస్థ విదేశాంగ విధాన విధానమే కీలకమని భావిస్తున్నట్లు తెలుస్తోంది.చదవండి: సంక్షోభ లంకపై నెలవంక! -
శ్రీలంక అధ్యక్షునిగా అనురకుమార విజయం
కొలంబో:శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ వీడింది. అధ్యక్ష ఎన్నికల్లో అనురకుమార దిసనాయకే విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో అనురకుమారకు ఆధిక్యం లభించింది. దీంతో అధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయం సాధించినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికల్లో విజయంతో శ్రీలంక 9వ అధ్యక్షునిగా అనురకుమార ప్రమాణస్వీకారం చేయనున్నారు. అధ్యక్ష ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌లో మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ 50 శాతం ఓట్లు రాకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. -
శ్రీలంక అధ్యక్ష ఫలితాలు.. అనూర కుమార ముందంజ
కొలంబో: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజార్టీతో వామపక్ష జనతా విముక్తి పెరమున (జేవీపీ) చీఫ్ అనూర కుమార దిస్సనాయకె భారీ విజయానికి చేరువలో ఉన్నారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో అనూర కుమార 52 శాతం ఓట్లతో ముందంజలో దూసుకువెళ్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే కేవలం 16 శాతం ( 2,35,00 ఓట్లు)తో మూడో స్థానంలోకి పడిపోయారు. ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస 22 శాతంతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు.Sri Lanka elections result 2024Left-leaning Anura Kumara Dissanayake is close to registering victory in the Sri Lanka Presidential elections after he amassed 52% of votes by 7 am on Sunday. The incumbent President, Ranil Wickremesinghe, is trailing way behind with 235,000 votes…— Brig V Mahalingam (@BrigMahalingam) September 22, 2024ఈ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, విపక్ష నేత సజిత్ ప్రేమదాసతో, జనతా విముక్తి పెరమున (జేవీపీ) చీఫ్ అనూర కుమార దిస్సనాయకె మధ్య పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. అయితే.. ఫలితాల్లో మాత్రం ఊహించని రీతిలో శ్రీలంక ప్రజలు అనూర కుమారకు భారీ ఓట్లు వేశారు. ఈ దెబ్బతో ప్రస్తుత అధ్యక్షుడు ఊసులో లేకుండా పోయారు.Sri Lanka’s presidential election has delivered a humiliating defeat to @RW_SRILANKA and his former ally @sajithpremadasa . Congratulations to Sri Lanka’s first Marxist President @anuradisanayake who will be the new head of state and commander-in-chief. pic.twitter.com/iCig0QmHFH— Ranga Sirilal (@rangaba) September 21, 2024 ఇక.. ఎన్నికలు ప్రారంభమైనప్పటినుంచి దిస్సనాయకె ముందున్నట్టు ముందస్తు సర్వేలన్నీ తేల్చాయి. సర్వే ఫలితాలను నిజం చేస్తూ.. అనూర కుమార భారీ లీడింగ్‌లో కొనసాగుతున్నారు. మొత్తం అర్హులైన 17 మిలియన్ల మంది ఓటర్లలో 75 శాతం మంది శనివారం జరిగిన ఎన్నికల్లో తమ ఓటు వియోగించుకున్నారు. 2022లో చోటుచేసుకున్న ఆర్థిక సంక్షోభం అనంతరం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలు విలక్షమైన తీర్పు ఇచ్చారని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. -
Christmas: శ్రీలంక ప్రభుత్వ సంచలన నిర్ణయం
కొలంబో: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పలు నేరాల్లో జరిమానాలు కట్టకుండా జైలు పాలైన వెయ్యికిపైగా మంది ఖైదీలకు క్రిస్మస్ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు రణిల్ విక్రమసింగే క్షమాభిక్ష ప్రసాదించారు. క్షమాభిక్షపొందిన 1004 మంది ఖైదీలను విడుదల చేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు. గత వారం దేశంలో డ్రగ్స్‌పై నిరోధానికి చేపట్టిన యాంటీ నార్కొటిక్ డ్రైవ్‌లో పోలీసులు ఏకంగా 15 వేల మందిని అరెస్టు చేశారు. వీరిలో 1100 మందిని నిర్బంధ మిలిటరీ పునరావాస కేంద్రంలో ఉంచారు. మిగతా వారిని జైళ్లలో ఉంచారు. దీంతో దేశంలో జైళ్లన్నీ నిండిపోయాయి. ఈ నేపథ్యంలో క్రిస్మస్ను పురస్కరించుకుని 1000 మందిని జైళ్ల నుంచి విడుదల చేయడం చర్చనీయాంశమవుతోంది. గడిచిన శుక్రవారం వరకు దేశంలోని జైళ్లలో 30 వేల మంది ఖైదీలు ఉన్నారు. అయితే దేశంలో ఉన్న జైళ్ల మొత్తం కెపాసిటీ కేవలం 11 వేలేనని జైళ్ల శాఖ అధికారిక గణాంకాలు చెబుతుండడం గమనార్హం. బౌద్ధ మతస్తులు మెజారిటీలుగా ఉండే శ్రీలంకంలో గతంలో బుద్ధ జయంతి రోజు కూడా భారీ సంఖ్యలో ఖైదీలను విడుదల చేశారు. ఇదీచదవండి..హిజాబ్ వివాదం: కర్ణాటక హోం మంత్రి కీలక వ్యాఖ్యలు -
సాయంతో మనసు గెలిచే యత్నం!
జూలై 21 నాటి రణిల్ విక్రమసింఘే భారత్ పర్యటన తాలూకూ అజెండా బహుముఖీనమైనది. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తవడం ఒక సందర్భమైతే, శ్రీలంక రాజకీయాల్లో అత్యున్నత పదవిని అందుకునేందుకు పరోక్షంగా ఆశీస్సులందించిన భారత్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవడం మరొకటి. శ్రీలంక ప్రస్తుత సంక్షోభం, ఆర్థికమే. అందుకే విక్రమసింఘే ఆర్థిక సహకారం కోరుతూనే భారత్‌ను సందర్శించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని దేశాలు సురక్షితంగా అభివృద్ధి చెందుతూండాలన్న లక్ష్యంతో రూపొందించిన ‘సాగర్’, ‘తొలుత పొరుగు’ విధానాలతో భారత్ కూడా శ్రీలంకతో గొప్ప ఆర్థిక సమన్వయాన్ని ఆశిస్తోంది. ఇది పెరుగుతున్న చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టడమే కాకుండా, వ్యూహాత్మకంగా శ్రీలంకలో భారత్ తన ఉనికిని పెంచుకునేందుకూ ఉపయోగపడుతుంది. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ఇటీవలే భారత్‌కు వచ్చిపోయారు. బోలెడన్ని ఒప్పందాలు కుదిరాయి. చాలావరకూ ఆర్థిక వ్యవహారాలే. రణిల్ మనకు మిత్రుడే అన్నది చాలాకాలంగా ఉన్న గట్టి అభిప్రాయం. గత ఏడాది జూలైలో అధ్య క్షుడు గొటబయ రాజకపక్స దేశం నుంచి పారిపోవడం, ప్రజాగ్రహం నేపథ్యంలో తన పదవిని వదులుకోవాల్సి రావడం మనకు తెలిసిన విషయమే. అలాంటి అనూహ్యమైన, మునుపెన్నడూ లేని పరిస్థితుల్లో రణిల్ గద్దెనెక్కారు. దారుణమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని కొట్టు మిట్టాడుతోంది ఆ దేశం అప్పుడు. సాధారణంగా పదవి చేపట్టిన కొద్ది కాలానికి శ్రీలంక నేతలు భారత్ పర్యటనకు రావడం కద్దు. కానీ ఈసారి రణిల్ ముందు దేశంలో పరిస్థితులు కొంతైనా చక్కబెట్టుకున్న తరువాతే, విదేశీ పర్యటనల గురించి ఆలోచించాల్సిన వచ్చింది. అటు ఆర్థిక, ఇటు రాజకీయాలూ సర్దుకున్న తరువాత ఆహ్వానం పంపు దామని భారత్ కూడా వేచి చూసింది. 75 ఏళ్ల దౌత్య బంధం జూలై 21 నాటి రణిల్ విక్రమసింఘే భారత్ పర్యటన తాలూకూ అజెండా బహుముఖీనమైనది. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తవడం ఒక సందర్భమైతే, శ్రీలంక రాజకీయాల్లో అత్యున్నత పదవిని అందుకునేందుకు పరోక్షంగా ఆశీస్సులందించిన భారత్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవడం మరో విషయం. దేశవాళీ ఆర్థిక, రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు తగిన సాయం అందిస్తున్నందుకూ విక్రమసింఘే కృతజ్ఞతలు చెప్పుకుని ఉంటారు. ఈ సాయం భవిష్యత్తులోనూ కొనసాగించేందుకు భారత్‌తో సమావేశాలు ఉపయో గపడి ఉంటాయి. ఎందుకంటే భారత్‌తో పాటు ఐఎంఎఫ్ లాంటి సంస్థల సాయంతో శ్రీలంక ఆర్థిక వ్యవస్థలో కొంత స్థిరత్వం కనిపిస్తున్నప్పటికీ పరిస్థితి పూర్తిగా చక్కబడలేదు. సబ్సిడీల తగ్గింపు, పన్నుల పెంపు వంటి సంస్కరణలకు ఐఎంఎఫ్ షరతులు విధించిన విషయమూ చెప్పుకోవాలిక్కడ. ఈ సంస్కరణల భారం మోయడం సామాన్యుడికి కష్టమైతే, ఆ అసంతృప్తిని వాడుకుని తిరగబడేందుకు శ్రీలంకలోని కొన్ని నియోజకవర్గ నేతలు కాచుకుకూర్చున్నారు. శ్రీలంకకే చెందిన అంతర్జాతీయ ఆర్థికవేత్తలు సీపీ చంద్రశేఖర్, అహిల్ కదిర్గమర్ వంటి వారు ఐఎంఎఫ్ పథకం సమస్య పరిష్కా రానికి అస్సలు ఉపయోగపడదనీ, పరిస్థితిని మరింత దిగజారుస్తుందనీ అభిప్రాయపడుతున్నారు. ఐఎంఎఫ్ షరతుల ప్రకారం శ్రీలంక 2031 వరకూ సంస్కరణలు కొనసాగించాల్సి ఉంటుంది. అంటే ఇంకో ఎనిమిదేళ్లు. చాలా సమయం. విక్రమసింఘేకు ఈ విషయమే కాకుండా, భవిష్యత్తులో ఎదురుకాగల సవాళ్ల గురించి కూడా తెలుసు. విదేశీ అప్పులు ప్రస్తుతం 40 బిలియ¯Œ డాలర్ల వరకూ ఉంటే, అందులో 30 శాతం అయినా తగ్గించుకోవాలని చూస్తున్నారు. అలాగే తొమ్మిదేళ్లపాటు రుణాల చెల్లింపులను నిలిపివేయడం అప్పులిచ్చే వారి ఆగ్రహానికి కారణమవుతోంది. పొరుగుకు ప్రాధాన్యత శ్రీలంక ప్రస్తుత సంక్షోభం ఆర్థికమే. అందుకే విక్రమసింఘే ఆర్థిక సహకారం కోరుతూనే భారత్‌ను సందర్శించారు. దేశ ఆర్థిక వ్యవహా రాల్లో భారత్ జోక్యం పెరగాలని లంక ఆశిస్తోంది. హిందూ మహా సముద్ర ప్రాంతంలోని దేశాలు సురక్షితంగా అభివృద్ధి చెందుతూండాలన్న లక్ష్యంతో భారత్ రూపొందించిన ‘సాగర్’(సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్), ‘తొలుత పొరుగు’ విధానాలతో భారత్ కూడా శ్రీలంకతో గొప్ప ఆర్థిక సమన్వయాన్ని ఆశిస్తోంది. వీటి ప్రకారం, పెరుగుతున్న చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టడమే కాకుండా... వ్యూహాత్మకంగా శ్రీలంకలో భారత్ తన ఉనికిని పెంచుకునేందుకూ ఉపయోగపడుతుంది. ఇరుదేశాల మధ్య అనుసంధానాన్ని పెంచేందుకు, ఆర్థిక సమృద్ధికి ఉపయోగపడే కొన్ని చర్యలకు ప్రధాని మోదీ, విక్రమసింఘే తమ దార్శనిక పత్రం ద్వారా శ్రీకారం చుట్టారు. దీని ప్రకారం ఇరుదేశాల మధ్య అటు సముద్ర మార్గం ఇటు విమాన, భూతల మార్గాల ద్వారా కూడా కనెక్టివిటీ పెంచుకునేందుకు ప్రాధాన్యం ఉంటుంది. ఇందుకు తగ్గట్టుగానే తెగల పోరు నేపథ్యంలో 1980లో నిలిపివేసిన పడవల సేవలను పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘే పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ఐదు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. యూపీఐ ద్వారా శ్రీలంకలో రూపాయి ద్వారా చెల్లింపులు జరపాలన్నది వీటిల్లో ఒకటి. ఇంధన రంగంతోపాటు ట్రింకోమలై ప్రాంతంలో అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి అదాని వంటి భారతీయ వ్యాపారవేత్తలకు సరికొత్త అవకాశాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. భారత పర్యటనలో విక్రమసింఘేను గౌతమ్ అదాని కూడా కలిసిన విషయం గమనార్హం. శ్రీలంక తమిళుల సమస్య సున్నితత్వాన్ని గుర్తించిన విక్రమసింఘే ఆ విషయంలో తాను తీసుకోబోయే చర్యల గురించి ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు. 13వ రాజ్యాంగ సవరణ ప్రకారం, దక్షిణాఫ్రికా తరహాలో తమిళుల కోసం ఓ నిజనిర్ధారణ కమిటీ ఒకదాన్ని ఏర్పాటు చేయడం కూడా ఇందులో ఉంది. ప్రాంతాల వారీగా అధికార పంపిణీ జరగాలని 13వ సవరణ చెబుతోంది. అయితే దీని అమల్లో ఉన్న సాధకబాధకాల గురించి కూడా శ్రీలంక అధ్యక్షుడు భారత ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది. పార్లమెంటు అనుమతి లేకుండా పోలీసు తదితర సున్నితమైన వ్యవస్థల అధికారాలను పంపిణీ చేయడం కష్టమని వివరించారు. యునైటెడ్ నేషనల్ పార్టీ విక్రమసింఘే వర్గానికి ప్రతినిధి ఈయనొక్కరే. పార్లమెంటులో మద్దతు లభిస్తున్నది కూడా రాజపక్సే పార్టీ నుంచి మాత్రమే. రాజపక్సే పార్టీకి అధికార పంపిణీ సుతరామూ ఇష్టం లేకపోవడం గమనార్హం. ఈ విషయాలన్నింటినీ గుర్తు పెట్టుకునే ప్రధాని మోదీ రాజ్యాంగ సవరణ అమలును మరోసారి గుర్తు చేశారు. తమిళులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల కౌన్సిల్ ఎన్నికలు తొందరగా జరిపించడం గురించి ప్రస్తావించారు. తమ ప్రాంతంలో పెద్దగా అభివృద్ధి జరగడం లేదనీ, విక్రమసింఘే అధికార పంపిణీ ప్రణాళిక తమకు సమ్మతం కాదనీ తమిళ వర్గాలు ఇప్పటికే మోదీకి వేరుగా లేఖలు రాశాయి. తమిళ సామాజిక వర్గపు ప్రజల ఆశయాలను, ఆకాంక్షలను నెరవేర్చేలా లంకను ఒప్పించాలని వీరు కోరుతున్నారు. కలిసి పనిచేయాలి విక్రమసింఘే పర్యటనలో భద్రతా పరమైన అంశాలపై చర్చలు జరక్కపోయినా, చైనా అంశం కచ్చితంగా ఇద్దరు నేతల మనసుల్లో ఉండి ఉంటుంది. విక్రమసింఘే కొన్ని రోజుల క్రితమే ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా శ్రీలంకలో చైనా భద్రతా వ్యవహారాలు లేవని స్పష్టం చేయడం గమనార్హం. అంతేకాకుండా, భారత్‌కు ముప్పు కాగలఎలాంటి విషయానికైనా శ్రీలంక వేదిక కాదని కూడా ఆయన ప్రకటించారు. ఇది చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు కొంత ఫలితం లభించినట్లే భావించాలి. భారత ప్రధాని మాట్లా డుతూ, ‘భారత్ భద్రత, శ్రీలంక అభివృద్ధి రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఇరు దేశాలు భద్రత, సున్నితత్వాలను దృష్టిలో ఉంచుకుని కలిసి పని చేయాలి’ అన్నారు. అభివృద్ధి పనులతో భద్రతను పొందాలనుకోవడం భారత్ ఎంత సమర్థంగా, సకాలంలో తన ఆర్థిక హామీలు నెరవేర్చగలదన్న అంశంపై ఆధారపడి ఉంటుంది. ఎస్.డి.ముని, వ్యాసకర్త మాజీ దౌత్యవేత్త, శ్రీలంక రత్న అవార్డు గ్రహీత- (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
శ్రీలంకలో మళ్లీ ఆందోళనలు.. విక్రమ సింఘేకూ ‘గొటబయ’ పరిస్థితే!
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్న శ్రీలంకలో పరిస్థితులు ఇప్పట్లో చక్కబడేలాకనిపించటం లేదు. ఇటీవలే ఏర్పడిన కొత్త ప్రభుత్వంపైనా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. అధిక పన్నులు, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలపై మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ రాజధాని కొలంబోలో బుధవారం వందల మంది ర్యాలీ నిర్వహించారు. అధ్యక్షుడు రణీల్ విక్రమ సింఘేకు వ్యతిరేకంగా ‘రణీల్ గో హోమ్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో అప్పటి అధ్యక్షుడు గొటబయ రాజపక్స పరిస్థితి ప్రస్తుత ప్రెసిడెంట్‌కూ ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నిరసనలను విపక్ష పార్టీలు, వాణిజ్య సంఘాలు, పౌర హక్కుల గ్రూప్‌లు సంయుక్తంగా నిర్వహించాయి. నగరంలోని అధ్యక్ష నివాసం, ఇతర మంత్రుల నివాసలు ఉన్న ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించగా నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ‘ప్రజలు మూడుపూటల కడుపునిండా తినలేకపోతున్నారు. ఈ ప్రభుత్వం ప్రజలకు సాయం చేయకపోగా.. భారీగా పన్నులు విధిస్తోంది. దీనికి పరిష్కారం కావాలి. అందుకోసం పోరాడుతూనే ఉంటాం.’అని టీచర్స్ యూనియన్ సెక్రెటరీ జోసేఫ్ స్టాలిన్ తెలిపారు. ఈ ఏడాది శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది. విదేశీ మారక నిల్వలు తగ్గిపోయి చమురు, ఆహార పదార్థాలు, కుకింగ్ గ్యాస్, ఔషధాల వంటి నిత్యావసరాల దిగుమతులకు సైతం డబ్బులు చెల్లించలేని పరిస్థితికి చేరుకుంది. దీంతో ప్రజాగ్రహం కట్టలు తెచ్చుకుని గత జూలైలో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. దీంతో అప్పటి అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. ఆ తర్వాత రణీల్ విక్రమ సింఘే అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆయన నవంబర్ 14న తొలి బడ్జెన్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు పన్నుల పెంపు సహా కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలు మళ్లీ ఆందోళనబాట పడుతున్నట్లు తెలుస్తోంది. బుధవారం వందల మంది కొలంబోలో ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండా పట్టుకుని ‘రణీల్ గో హోమ్’ అంటూ నినాదాలు చేశారు. ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిరసనకారులను అణచివేసేందుకు తీవ్రవాద నిరోధక చట్టాలను ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. ఇదీ చదవండి: GOA New Rules: గోవాలో ఇకపై ఈ పనులు చేస్తే భారీగా జరిమానా -
శ్రీలంకకు తిరిగొచ్చిన ‘గొటబయ’.. ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం!
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయేందుకు కారణమై, ప్రజాగ్రహంతో దేశం విడిచి పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స స్వదేశం తిరిగివచ్చారు. ఈ ఏడాది జూలై 13న దేశం విడిచి మాల్దీవులకు వెళ్లారు. అక్కడి నుంచి సింగపూర్ పారిపోయిన గొటబయ సుమారు ఏడు వారాల తర్వాత శనివారం తెల్లవారుజామున దేశంలో అడుగుపెట్టారు. బ్యాంకాక్ నుంచి వయా సింగపూర్ మీదుగా కొలంబోలోని బందారనాయక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి శనివారం వచ్చినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ సందర్భంగా ఆయన పార్టీకి చెందిన పలువురు చట్టసభ్యులు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని స్వాగతం పలికారు. భారీ భద్రత నడుమ ఎయిర్పోర్ట్ నుంచి మాజీ అధ్యక్షుడిగా ఆయనకు కేటాయించిన ప్రభుత్వ అధీనంలోని భవనానికి చేరుకున్నారు గొటబయ. 2019లో శ్రీలంక అధ్యక్ష పదవిని చేపట్టారు గొటబయ రాజపక్స. అయితే, దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తటంతో ప్రజలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలు తీవ్రమవటం వల్ల జులై 9న అధ్యక్ష భవనం నుంచి పరారయ్యారు. నాలుగు రోజుల తర్వాత మిలిటరీ జెట్‌లో మాల్దీవులకు వెళ్లారు. అక్కడి నుంచి సింగపూర్ చేరుకున్నారు. తర్వాత అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత రెండు వారాలకు దౌత్య వీసా ద్వారా థాయిలాండ్‌కు వెళ్లారు. ఇదీ చదవండి: అమెరికాలో సెటిల్ కావడానికి ప్లాన్ చేసిన గొటబయా రాజపక్స! -
Gotabaya Rajapaksa: సింగపూర్‌లో ‘గొటబయ’కు ఊహించని షాక్..!
సింగపూర్: శ్రీలంక మాజీ అధ్యక్షుడు, ప్రజాగ్రహంతో దేశం విడిచిన గొటబయ రాజపక్స ప్రస్తుతం సింగపూర్‌లో తలదాచుకుంటున్నారు. అయితే.. అక్కడా ఊహించని షాక్ తగిలింది. దక్షిణాఫ్రికాకు చెందిన ఓ ప్రజాహక్కుల గ్రూప్ గొటబయపై క్రిమినల్ కేసు పెట్టింది. యుద్ధ నేరాల ఆరోపణలతో గొటబయను అరెస్ట్ చేయాలంటూ.. సింగపూర్ అటార్నీ జెనరల్‌కు 63 పేజీల ఫిర్యాదును అందజేశారు ఇంటర్నేషనల్ ట్రూత్ అండ్ జస్టిస్ ప్రాజెక్ట్(ఐటీజేపీ) న్యాయవాదులు. 2009లో జరిగిన అంతర్యుద్ధం సమయంలో రక్షణ మంత్రిగా ఉన్న రాజపక్సే.. జెనీవా ఒప్పందాలను తీవ్రంగా ఉల్లంఘించారని పిటిషన్లో పేర్కొన్నారు. అవి అంతర్జాతీయ న్యాయపరిధిలో భాగంగా సింగపూర్ దేశీయ ప్రాసిక్యూషన్‌కు లోబడిన నేరాలుగా పేర్కొన్నారు. పిటిషన్ ప్రకారం.. అంతర్యుద్ధం సమయంలో అంతర్జాతీయ మానవహక్కుల చట్టం, అంతర్జాతీయ క్రిమినల్ చట్టాలను గొటబయ ఉల్లంఘించారు.‘అందులో హత్య, ఉరి తీయించటం, వేధించటం, అమానవీయంగా కొట్టటం, అత్యాచంర, ఇతర లైంగిక వేధింపులు, స్వేచ్ఛను హరించటం, మానసికంగా క్షోభకు గురిచేయంట వంటివి ఉన్నాయి. ఆర్థిక మాంద్యంతో ప్రభుత్వం పతనాన్ని చూసింది, అయితే శ్రీలంకలో సంక్షోభం నిజంగా మూడు దశాబ్దాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం క్రితం జరిగిన తీవ్రమైన అంతర్జాతీయ నేరాలతో ముడిపడి ఉంది. ఈ ఫిర్యాదు కేవలం అవినీతి, ఆర్థిక అవకతవకల గురించే కాదు.. తీవ్ర నేరాలకు బాధ్యత వహించాలని నమోదు చేశాం.’ అని ఐటీజేపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యోస్మిన్ సూకా పేర్కొన్నారు. గొటబయ రాజపక్సను అరెస్ట్ చేసి యుద్ధ నేరాలపై దర్యాప్తు చేపట్టాలని కోరింది ఐటీజేపీ. 1989లో ఆయన ఆర్మీ కమాండర్‌గా ఉన్నప్పుడు.. సుమారు 700 మంది కనిపించకుండా పోయారని ఆరోపించింది. ముఖ్యంగా రక్షణ శాఖ సెక్రెటెరీగా ఉన్నప్పుడు ఆ నేరాలు మరింత పెరిగాయని తెలిపింది. తన కింది అధికారులకు టెలిఫోన్ ద్వారా నేరుగా ఆదేశాలు ఇచ్చి ప్రజలపై దాడి చేయించే వారని ఆరోపించింది. ఇదీ చదవండి: కారుతో ఢీకొట్టి చోరీకి పాల్పడిన దుండగులు.. వీడియో వైరల్! -
Srilanka crisis: అధ్యక్షుడి భవనంలో విలువైన వస్తువులు మిస్సింగ్.. వారి పనేనా?
కొలంబో: ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు ప్రజాగ్రహంతో దేశం మొత్తం ఆందోళనలతో అట్టుడుకింది. ఇటీవలే కొత్త అధ్యక్షుడు, ప్రధాని బాధ్యతలు చేపట్టగా నిరసనలు కాస్త సద్దుమణిగినట్లు తెలుస్తోంది. అయితే.. జులై 9న గొటబయ రాజపక్స రాజీనామా చేయాలంటూ అధ్యక్ష భవనాన్ని చుట్టు ముట్టారు నిరసనకారులు. ప్రధాని నివాసానికి నిప్పు పెట్టారు. అధ్యక్షుడి భవనంలోకి ప్రవేశించి రచ్చ రచ్చ చేశారు. ఇదే అదునుగా కొందరు చేతివాటం చూపించినట్లు తెలుస్తోంది. అధ్యక్ష, ప్రధాని భవనాల్లోని అత్యంత విలువైన, పురాతనమైన 1,000కిపైగా వివిధ కళాకృతులు కనిపించకుండా పోయాయి. ప్రత్యేక బృందాల ఏర్పాటు.. రెండు భవనాల్లో ఎన్ని కళాఖండాలు మిస్సయ్యాయనేది ప్రాథమిక విచారణ తర్వాత తేలుతుందని అధికారులు తెలిపారు. అయితే.. శ్రీలంక పురావస్తు శాఖ వద్ద ఎలాంటి రికార్డులు లేకపోవటం వల్ల కచ్చితమైన సంఖ్యను కనిపెట్టలేరని వెబ్ పోర్టల్ కొలంబో పేజ్ పేర్కొంది. వెయ్యికిపైగా విలువైన కళాఖండాలు చోరీకి గురైన సంఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. భవనాల ముట్టడి.. ఆర్థిక సంక్షోభానికి పాలకుల నిర్ణయాలే కారణమని, అధ్యక్షుడు, ప్రధాని రాజీనామా చేయాలనే పిలుపు మేరకు లక్షల మంది ఒక్కసారికి రోడ్లపైకి వచ్చారు. జులై 9న అధ్యక్ష భవనాన్ని చుట్టు ముట్టారు. దీంతో అప్పటి అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. ఈ క్రమంలో భవనంలోకి ప్రవేశించిన నిరసనకారులు అక్కడ గుట్టలకొద్ది నోట్ల కట్టలను గుర్తించి పోలీసులకు అప్పగించారు. కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇదీ చదవండి: Financial Crises: పేకమేడలు... ఆర్థిక సంక్షోభం అంచున దేశాలు -
'గొటబయ' కుమారుడికీ నిరసనల సెగ.. అమెరికాలో ఆందోళనలు
వాషింగ్టన్: శ్రీలంకలో ఆందోళనలు ఉద్ధృతంగా మారటం వల్ల దేశాన్ని విడిచి పారిపోయారు మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స. ముందుగా మాల్దీవులకు వెళ్లగా.. అక్కడ సైతం లంక పౌరులు గొటబయకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. ఆ తర్వాత సింగపూర్ వెళ్లిపోయారు. ప్రస్తుతం గొటబయ రాజపక్స కుమారుడు మనోజ్ రాజపక్సకు సైతం నిరసనల సెగ తగిలింది. అమెరికా, లాస్‌ఎంజల్స్‌లోని ఆయన ఇంటి ముందు పలువురు లంకేయులు నిరసనలు చేపట్టారు. తన తండ్రి తిరిగి స్వదేశాని వెళ్లాలని చెప్పాలంటూ నినాదాలు చేశారు. గొటబయ రాజపక్స జులై 13న రాజీనామా చేసేందుకు ముందు ఆందోళనలు చేపట్టినట్లు అమెరికా మీడియా తెలిపింది. 'మేము లాస్‌ఎంజల్స్‌లో గొటబయ రాజపక్స కుమారుడు మనోజ్ రాజపక్స ఇంటి ముందు ఉన్నాము. ఆయన శ్రీలంక ప్రజల సొమ్మును దోచుకున్నారు. దాంతో విలాసవంతమైన ఈ ఆస్తిని కొనుగోలు చేశారు. ఇది మా డబ్బు. ఇది మా ఆస్తి.' అని పేర్కొన్నారు నిరసనకారులు. మరోవైపు.. మనోజ్ రాజపక్స ఇంటి ముందు ఆందోళనలు చేయటాన్ని పలువురు శ్రీలంక నెటిజన్లు తప్పుపట్టారు. ఆయన రాజకీయాల్లో లేరని, అమెరికాలో ఉంటున్నారని గుర్తు చేశారు. ఆయన తండ్రి గొటబయ రాజకీయాలతో మనోజ్‌కు ఎలాంటి సంబంధాలు లేవని పేర్కొన్నారు. అయితే.. అమెరికా వచ్చినప్పుడు మనోజ్‌కు నిలువ నీడలేదని, ఇప్పుడు పలు ఇళ్లు కొనుగోలు చేశారని తిప్పికొట్టారు ఆందోళనకారులు. ఇదీ చదవండి: Gotabaya Rajapaksa: అందుకోసం శతవిధాల ప్రయత్నం చేశా: గొటబయ -
సంక్షోభంపై గొటబయ సంచలన వ్యాఖ్యలు.. అందుకు వారే కారణమటా!
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి తినడానికి సరిగా తిండి దొరకని దీన స్థితికి చేరుకుంది శ్రీలంక. ప్రజాగ్రహం కట్టలు తెంచుకున్న నేపథ్యంలో దేశం విడిచి పారిపోయారు మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స. ముందుగా మాల్దీవులు వెళ్లి అక్కడి నుంచి సింగపూర్ చేరుకున్నారు. ఈ క్రమంలో శ్రీలంక పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు గొటబయ. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని తప్పించేందుకు శతవిధాల ప్రయత్నం చేశానని పేర్కొన్నారు. తాను పదవి చేపట్టక ముందే ఏళ్ల తరబడి కొనసాగిన ఆర్థిక అవకతవకల వళ్లే ఇది జరిగిందని ఆరోపించారు. సింగపూర్ వెళ్లిన తర్వాత తన రాజీనామాను స్పీకర్‌కు పంపించారు గొటబయ. దీంతో ఆయన రాజీనామాను పార్లమెంటు శుక్రవారం ఆమోదించింది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను శనివారం ప్రారంభించింది. ఈ సందర్భంగా గొటబయ రాజీనామాను చదివి నిపించారు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ధమ్మిక దసనయాకే. ఈ లేఖ ద్వారా దేశంలో నెలకొన్ని పరిస్థితులను వివరించారు గొటబయ. 'కొన్నేళ్లుగా అసమర్థ పాలన, ఆర్థిక అవకవతకల కారణంగానే దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. దాంతో పాటు కోవిడ్-19 శ్రీలంక పర్యాటకాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. విదేశీ పర్యాటకులు రాకుండా చేసింది. ఆ సంక్షోభాన్ని తప్పించేందుకు.. సమైఖ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విపక్షాలను ఆహ్వానించటం సహా అన్ని రకాల చర్యలను చేపట్టానని నమ్ముతున్నా.' అని పేర్కొన్నారు. బుధవారం కొత్త అధ్యక్షుడి ఎన్నిక.. అధ్యక్ష పదవికి నామినేషన్లను ఆమోదించేందుకు వచ్చే మంగళవారం సమావేశం కానుంది శ్రీలంక పార్లమెంట్. బుధవారం ఓటింగ్ ద్వారా దేశాధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ప్రస్తుతం ప్రధాని రణీల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. కొత్త అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టే వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు అధికారులు. ఇదీ చూడండి: కష్టాల్లో ఉన్న లంకను భారత్ ఆదుకుంటుంది: హైకమిషనర్ -
మాల్దీవుల్లో ‘గొటబయ’కు నిరసనల సెగ.. మళ్లీ ఏ దేశం వెళ్తారో?
మాలే: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ప్రజాగ్రహంతో అట్టుడుకుతోంది శ్రీలంక. ఆందోళనల నేపథ్యంలో అధ్యక్షుడు గొటబయ రాజపక్స కుటుంబంతో సహా బుధవారం వేకువజామునే దేశం విడిచి మాల్దీవులకు పారిపోయారు. అయితే.. అక్కడ కూడా గొటబయకు నిరసనల సెగ తగిలింది. పదుల సంఖ్యలో అక్కడి శ్రీలంక పౌరులు ఆందోళన చేపట్టారు. గొటబయకు మాలే ఒక సురక్షితమైన ప్రాంతం కాకూడదని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలపాలని అక్కడి ప్రజలను కోరారు. శ్రీలంక జాతీయ జెండాలు, ప్లకార్డులతో రాజపక్సకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు నిరసనకారులు. ' ప్రియమైన మాల్దీవుల స్నేహితులారా.. క్రిమినల్స్‌కు ఈ ప్రాంతం సురక్షితమైనదిగా మారకుండా మీ ప్రభుత్వానికి తెలియజేయండి' అని బ్యానర్ ప్రదర్శించారు. మరోవైపు.. మిలిటరీ విమానంలో వెలనా అంతర్జాతీయ విమానంలో దిగిన రాజపక్సకు వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేస్తున్న వీడియోలను మాల్దీవులకు చెందిన మీడియాలు ప్రసారం చేశాయి. అలాగే.. మాలేలోని కృత్రిమ బీచ్ ప్రాంతంలో పలువురు శ్రీలంక పౌరులు నిరసనలు చేపట్టగా.. పోలీసులు వారిని చెదరగొట్టారు. సింగపూర్‌కు గొటబయ..! శ్రీలంక నుంచి పరారై మాల్దీవులకు చేరిన అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఓ విలాసవంతమైన రిసార్ట్‌లో తలదాచుకున్నట్లు స్థానిక మీడియాలు వెల్లడించాయి. అక్కడి నుంచి యూఏఈ లేదా సింగపూర్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. 'ఆయన రెండు దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అయితే.. ఆ దేశాల్లోనూ శ్రీలంక పౌరులు ఉన్నందున భద్రతాపరమైన సమస్యలు తలెత్తనున్నాయి.' అని శ్రీలంకకు చెందిన భద్రతా విభాగం అధికారి ఒకరు తెలిపారు. గొటబయ రాజపక్సను దేశంలోకి అనుమతించటాన్ని వ్యతిరేకించింది మాల్దీవులకు చెందిన ప్రతిపక్ష ప్రోగ్రెసివ్ పార్టీ. రాజపక్సను అనుమతించటం ద్వారా శ్రీలంకలోని తమ స్నేహితులకు ద్రోహం చేస్తున్నామని పీపీఎం నేత ఒకరు పేర్కొన్నారు. మరోవైపు.. ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. శ్రీలంక పౌరులు మాల్దీవుల్లోని విద్య, ఆరోగ్య, ఆతిథ్య రంగాల్లో పని చేస్తుండగా.. మాల్దీవుల పౌరులు సైతం పెద్ద సంఖ్యలోనే శ్రీలంకలో ఉన్నారు. ఇదీ చూడండి: Gotabaya Rajapaksa: దేశం విడిచిన లంకాధ్యక్షుడు.. అంతా ఇండియానే చేసిందని వదంతులు.. హైకమిషన్ రియాక్షన్ ఏంటంటే? -
శ్రీలంక విడిచి పారిపోయిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స
-
దేశాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన గొటబాయ రాజపక్స
-
గొటబాయ నివాసంలో కరెన్సీ కట్టల గుట్టలు..!
కొలంబో: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చిన క్రమంలో ప్రజలు అక్కడి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో మార్పులు వచ్చినా ఎలాంటి పురోగతి కనిపించకపోవటంతో మళ్లీ పెద్ద ఎత్తున లంకేయులు ఆందోళనలకు దిగారు. ఎవరూ ఊహించని విధంగా శనివారం లక్షల మంది ప్రజలు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలంటూ ఆందోళన చేపట్టారు. అధ్యక్షుడి నివాసాన్ని ముట్టడించారు. భద్రతావలయాన్ని దాటుకుని లోపలికి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలోనే గొటబాయ పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. అధ్యక్షుడి అధికారిక నివాసంలో ప్రవేశించిన నిరసన కారులు రచ్చ రచ్చ చేశారు. స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టడం, గొటబాయ పడగది, వంటగదిలోని వీడియోలు బయటకు వచ్చాయి. ఇదిలా ఉండగా.. అధ్యక్షుడి భవనంలో పెద్ద మొత్తంలో నగదును నిరసనకారులు స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. శ్రీలంక దినపత్రిక డైలీ మిర్రర్ ప్రకారం.. అధ్యక్ష భవనంలో దొరికిన సొమ్మును అక్కడి భద్రతా విభాగానికి అందించారు. దేశం ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్న తరుణంలో కోట్లాది రూపాయలు అధ్యక్షుడి భవనంలో లభించటంపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగదుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. అందులో ఓ నిరసనకారుడు కరెన్సీ నోట్లను లెక్కిస్తున్నట్లు కనిపించాడు. ఆ నోట్ల కట్టలను అధ్యక్షుడి అధికారిక నివాసం నుంచి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు నిరసనకారులు. ఈ అంశంపై దర్యాప్తు చేపట్టాకే నిజానిజాలు తెలుస్తాయని, సరైన ఆధారాలతో సమాచారం అందిస్తామని అక్కడి అధికారులు వెల్లడించారు. మరో ఇద్దరు మంత్రుల రాజీనామా.. దేశంలో పరిస్థితులు దిగజారిన నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు శ్రీలంక పర్యాటక శాఖ మంత్రి హరిన్ ఫెర్నాండో, కార్మిక, విదేశీ ఉపాధి శాఖ మంత్రి మనుష ననయక్కరలు ప్రకటించారు. మరోవైపు.. దేశంలో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు, సైన్యానికి ప్రజలు సహకరించాలని కోరారు త్రిదళాధిపతి(సీడీఎస్) జనరల్ శవేంద్ర సిల్వా. దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్న క్రమంలో త్రివిధ దళాల అధిపతులతో కలిసి ఈ ప్రకటన చేశారు సీడీఎస్. ఇదీ చదవండి: కొనడానికి లేదు.. తినడానికి లేదు -
ఈ విజయం శ్రీలంక ప్రజలకు అంకితం: దిముత్ కరుణరత్నే
ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో 10 వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను శ్రీలంక 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఈ విజయాన్ని తమ దేశ ప్రజలకు అంకితమిస్తున్నట్లు శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే ట్విటర్ వేదికగా తెలిపాడు. కాగా శ్రీలంక ప్రస్తుతం తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. మరో వైపు ప్రస్తుత పరిస్ధితులను మెరుగుపరచడానికి కొత్త ప్రధాని రణిల్ విక్రమసింఘే విదేశీ సహాయం కోసం చూస్తున్నారు." ఈ విజయాన్ని నేను శ్రీలంక ప్రజలందరికీ అంకితం చేయాలనుకుంటున్నాను. దేశంలో ప్రజలు కష్ట పరిస్ధితులను ఎదర్కొంటున్నారు. ఈ విజయం వారి ముఖాల్లో కొంత సంతోషాన్ని నింపుతుంది" అని కరుణరత్నే ట్విట్ చేశాడు. చదవండి: BAN Vs SL 2nd Test: బంగ్లాదేశ్‌పై శ్రీలంక ఘన విజయం.. 10 వికెట్ల తేడాతో గెలుపొంది! -
శ్రీలంకలో ఒక్కో వ్యవస్థ కుప్పకూలుతున్నాయ్ ! ఆ జాబితాలో తాజాగా..
గత ఆర్నెళ్లుగా శ్రీలంక దేశాన్ని చుట్టుముట్టి పీడిస్తున్న ఆర్థిక కష్టాలు ఒక్కో వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. ఇప్పటికే ఆహార, చమురు , విద్యుత్, విదేశీ ద్రవ్య లభ్యత వంటి కష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఆ దేశానికి తాజాగా మరో షాక్ తగిలింది. సోమవారం శ్రీలంక స్టాక్ మార్కెట్ మూతపడింది. సోమవారం శ్రీలంకలోని కోలంబో స్టాక్ మార్కెట్ ప్రారంభైమన నిమిషాల వ్యవధిలోనే ప్రధాన కంపెనీలను ప్రతిబింబించే సూచీలు దాదాపు 6 శాతం నష్టపోయాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు మార్కెట్ మరింతగా క్రాష్ అవకుండా నిరోధించేందుకు చర్యలు చేపట్టారు. కొలంబో మార్కెట్‌ను మూసేస్తున్నట్టు ప్రకటించారు. ఆర్థిక సంక్షోభం తారాస్థాయికి చేరుకోవడంతో శ్రీలంక పౌరులు ఆందోళన బాట పట్టారు. ఆ దేశ అధ్యక్షుడు, ప్రధానితో పాటు కీలక పదవుల్లో ఉన్న వారు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. శ్రీలంక వ్యాప్తంగా అల్లర్లు కొనసాగుతున్నాయి. దీంతో సోమవారం శ్రీలంక కేబినేట్ రాజీనామా సమర్పించింది. కేబినేట్ రాజీనామా నిర్ణయంతో అప్పటి వరకు ఏ మూలనో మిణుకుమిణుకు మంటున్న ఆశలు పూర్తిగా సన్నగిల్లిపోవడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసుకునేందుకు పోటీ పడ్డారు. ఫలిగంగా క్షణాల్లో మార్కెట్ 5.9 శాతం క్షీణించింది. మరింత నష్టం వాటిల్లకుండా కొలంబో మార్కెట్‌ను క్లోజ్ చేశారు. చదవండి: లంకలో ప్రజా వ్యతిరేకత: కేంద్ర కేబినెట్ రాజీనామా.. -
శ్రీలంక ప్రధానిగా మహింద రాజపక్స ప్రమాణస్వీకారం
-
శ్రీలంక పార్లమెంటు రద్దు
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు గొతబయ రాజపక్స ఆ దేశ పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. మరో ఆరు నెలలు మిగిలి ఉండగానే రద్దు చేయడం గమనార్హం. మార్చి 12 నుంచి 19లోపు అభ్యర్థులు నామినేషన్ వేసుకోవచ్చని, ఏప్రిల్ 25న ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. మే 14వ తేదీన కొత్త పార్లమెంటు సమావేశమవుతుందని పేర్కొన్నారు. శ్రీలంక పార్లమెంటును రద్దు చేయడానికి కనీసం నాలుగున్నరేళ్ల పాలన సాగాల్సి ఉంటుంది. -
శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక అధ్యక్షుడు
-
శ్రీవారి చెంత శ్రీలంక అధ్యక్షుడు
తిరుమల : తిరుమలలో శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన దంపతులు మంగళవారం సందడి చేశారు. మొదట శ్రీవారి పాదాలను దర్శించుకుని, అనంతరం లేపాక్షి షాపింగ్ కాంప్లెక్స్‌లో షాపింగ్ చేశారు. ఘనస్వాగతం రేణిగుంట: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు మంగళవారం రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఆయన కుటుంబ సభ్యులతో కలసి మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న, ఏపీ ప్రోటోకాల్ అడిషనల్ సెక్రటరీ కల్నల్ అశోక్‌కుమార్, తిరుపతి సబ్ కలెక్టర్ మహేష్‌కుమార్, తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ స్వాగతం పలికారు. అనంతరం వారు రోడ్డు మార్గాన తిరుమలకు బయలుదేరి వెళ్లారు.