
ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో 10 వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను శ్రీలంక 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఈ విజయాన్ని తమ దేశ ప్రజలకు అంకితమిస్తున్నట్లు శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే ట్విటర్ వేదికగా తెలిపాడు. కాగా శ్రీలంక ప్రస్తుతం తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
దీంతో ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. మరో వైపు ప్రస్తుత పరిస్ధితులను మెరుగుపరచడానికి కొత్త ప్రధాని రణిల్ విక్రమసింఘే విదేశీ సహాయం కోసం చూస్తున్నారు." ఈ విజయాన్ని నేను శ్రీలంక ప్రజలందరికీ అంకితం చేయాలనుకుంటున్నాను. దేశంలో ప్రజలు కష్ట పరిస్ధితులను ఎదర్కొంటున్నారు. ఈ విజయం వారి ముఖాల్లో కొంత సంతోషాన్ని నింపుతుంది" అని కరుణరత్నే ట్విట్ చేశాడు.
చదవండి: BAN Vs SL 2nd Test: బంగ్లాదేశ్‌పై శ్రీలంక ఘన విజయం.. 10 వికెట్ల తేడాతో గెలుపొంది!