కరుణరత్నే కెప్టెన్‌ ఇన్నింగ్స్‌.. బం‍గ్లాకు ధీటుగా బదులు ఇస్తున్న శ్రీలంక | Angelo Mathews, Dhanjaya De Silva Take Sri Lanka To 282 4 At Stumps | Sakshi
Sakshi News home page

BAN vs SL: కరుణరత్నే కెప్టెన్‌ ఇన్నింగ్స్‌.. బం‍గ్లాకు ధీటుగా బదులు ఇస్తున్న శ్రీలంక

Published Thu, May 26 2022 8:15 AM | Last Updated on Thu, May 26 2022 8:15 AM

Angelo Mathews, Dhanjaya De Silva Take Sri Lanka To 282 4 At Stumps - Sakshi

ఢాకా: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 97 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 143/2తో ఆట కొనసాగించిన శ్రీలంక మూడు వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. వర్షం అంతరాయం కలిగించడంతో మూడో రోజు 51 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.

లంక జట్టులో దిముత్‌ కరుణరత్నే (155 బంతుల్లో 80; 9 ఫోర్లు), ఎంజెలో మాథ్యూస్‌ (153 బంతుల్లో 58 బ్యాటింగ్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌), ధనంజయ డిసిల్వా (95 బంతుల్లో 58; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. మాథ్యూస్‌తో కలిసి దినేశ్‌ చండీమల్‌ (10 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో షకీబ్‌ 3 వికెట్లు, ఇబాదత్‌ హుస్సేన్‌ 2 వికెట్లు తీశారు. బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు శ్రీలంక 83 పరుగుల దూరంలో ఉంది.

చదవండి: IPL 2022: ఐపీఎల్‌లో కేఎల్‌ రాహుల్‌ అరుదైన రికార్డు.. తొలి ఆటగాడిగా..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement