
కొలంబో:శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ వీడింది. అధ్యక్ష ఎన్నికల్లో అనురకుమార దిసనాయకే విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో అనురకుమారకు ఆధిక్యం లభించింది. దీంతో అధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయం సాధించినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
ఎన్నికల్లో విజయంతో శ్రీలంక 9వ అధ్యక్షునిగా అనురకుమార ప్రమాణస్వీకారం చేయనున్నారు. అధ్యక్ష ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌లో మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ 50 శాతం ఓట్లు రాకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు.
Comments
Please login to add a commentAdd a comment