శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్షే మంగళవారం సాయంత్రం తిరుపతి చేరుకున్నారు.
హైదరాబాద్: శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్షే మంగళవారం సాయంత్రం తిరుపతి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో రేణిగుంటకు వచ్చిన రాజపక్షే అక్కడి నుంచి హెలికాప్టర్ లో తిరుపతి వెళ్లారు. మరికాసేపట్లో తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు.
శ్రీలంక అధ్యక్షుడి రాక సందర్భంగా తిరుపతి, తిరుమలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తమిళనాడు తరలివచ్చిన వైగో అభిమానులు రాజపక్షే పర్యటనను వ్యతిరేకిస్తూ తిరుపతి ఆందోళన నిర్వహించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.