
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు గొతబయ రాజపక్స ఆ దేశ పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. మరో ఆరు నెలలు మిగిలి ఉండగానే రద్దు చేయడం గమనార్హం. మార్చి 12 నుంచి 19లోపు అభ్యర్థులు నామినేషన్ వేసుకోవచ్చని, ఏప్రిల్ 25న ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. మే 14వ తేదీన కొత్త పార్లమెంటు సమావేశమవుతుందని పేర్కొన్నారు. శ్రీలంక పార్లమెంటును రద్దు చేయడానికి కనీసం నాలుగున్నరేళ్ల పాలన సాగాల్సి ఉంటుంది.