
కన్నీ‘టి’ పిలుపు
మానవ సంబంధాల విలువను విభిన్న కోణంలో చూపించే నాటకం ‘మా చాయ్’.
మానవ సంబంధాల విలువను విభిన్న కోణంలో చూపించే నాటకం ‘మా చాయ్’. పొట్టచెక్కలయ్యేలా నవ్వించే సీన్లతో పాటు.. ఎద కరిగించే సన్నివేశాలతో సాగుతుంది. కథలోకి వెళ్తే.. యశ్వంత్ తల్లి చనిపోతుంది. అతడిని ఓదార్చేందుకు మిత్రులు వివేక్, సమీర్ వెళ్తారు. తల్లి పోయిన బాధ యశ్వంత్‌లో ఏ మాత్రం కనిపించదు.
స్నేహితులతో టీ, సిగరెట్లు, మందూ తాగుతూ యశ్వంత్ ఆదరమరచి నిద్రపోతాడు. లేవగానే ‘మా-చాయ్’ అని అంటాడు. ఫొటోలోంచి నవ్వుతున్న తల్లిని చూసి గుండెలు అవిసేలా ఏడుస్తాడు. ఇదీ కథ. ఈ నాటకం ఆదివారం రాత్రి 7.30 గంటలకు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లోని లామకాన్‌లో ప్రదర్శించనున్నారు. ఫోన్: 7893022911