'బీజేపీ నుంచి వారిద్దరినీ బహిష్కరించండి' | BJP MP demands expulsion of Yashwant, Shatrughan from party | Sakshi
Sakshi News home page

'బీజేపీ నుంచి వారిద్దరినీ బహిష్కరించండి'

Published Sun, Jan 31 2016 3:29 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

'బీజేపీ నుంచి వారిద్దరినీ బహిష్కరించండి' - Sakshi

'బీజేపీ నుంచి వారిద్దరినీ బహిష్కరించండి'

బలియా: కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, శత్రుఘ్న సిన్హాలను బీజేపీ నుంచి బహిష్కరించాలని ఆ పార్టీ ఎంపీ రవీంద్ర కుష్వాహా డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మంత్రి పదవులు దక్కనందునే వీరిద్దరూ కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా నిరాధార వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

యశ్వంత్ సిన్హా తన కుమారుడు జయంత్ సిన్హాకు కేంద్ర సహాయ మంత్రి దక్కడం పట్ల అసంతృప్తిగా ఉన్నారని కుష్వాహా ఆరోపించారు. బిహార్ ఎన్నికలప్పటి నుంచి శత్రుఘ్న సిన్హా ఆత్మహత్య సదృశ్య వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా యశ్వంత్, శత్రుఘ్న సిన్హాలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement