President Zelensky Way Road Sign: ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్ స్కీ రష్యా బలగాలపై ధైర్యంగా పోరాడుతున్న సమయంలో 'ప్రెసిడెంట్ జెలెన్స్కీ వే' అని రాసి ఉన్న రోడ్ సైన్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాషింగ్టన్‌లోని ఒక వీధిలో రష్యా కాన్సులేట్ వెలుపల ఈ రహదారి గుర్తు కనిపించిందని సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు. అయితే జెలెన్ స్కీ గౌరవార్థం ఆదివారం మధ్యాహ్నం రష్యా కాన్సులేట్ వెలుపల కార్యకర్తలు ఈ గుర్తును పోస్ట్ చేశారు. రష్యా ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం 12వ రోజుకి చేరుకుంది.
ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలను ఒక్కోక్కటిగా ఆక్రమించుకుంటూ రష్య భయంకరంగా ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది. అయినప్పటికీ ఉక్రెయిన్ కూడా ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా వీరోచితంగా ప్రతి దాడి చేస్తూనే ఉంది. ఈ తరుణంలో జెలెన్ స్కీకి దేశం విడిచి వచ్చేయండి అని అమెరికా ఆఫర్ ఇచ్చిన తిరస్కరించాడు. అంతేకాదు తన దేశంలోనే కొనసాగుతానని, తన భూమిని, ప్రజలను రక్షించుకుంటానని చెప్పి అందర్నీ విస్మయపరిచారు. అంతేగాక రష్యా ఉక్రెయిన్ పౌరులను, నివాసిత ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగడంతో ఉక్రెయిన్ నో ఫ్లై జోన్ ప్రకటించమని అభ్యర్థించారు జెలెన్ స్కీ.
కానీ ఏ దేశం అయినా నో ఫ్లై జోన్ ప్రకటించినట్లయితే మాతో యుద్ధానికి దిగినట్లుగా భావించి దాడులు చేస్తాం అని రష్యా హెచ్చరించింది. దీంతో ప్రపంచ దేశాలు వెనక్కి తగ్గాయి. అయినప్పటికీ జెలెన్ స్కీ ఎంతో ధైర్య సాహాసాలతో రష్యాతో పోరాడుతూనే ఉన్నారు. అంతేగాక పౌరులపై రష్యా చేస్తున్న దాడిని నిరశిస్తూ మీరు చేసింది మేమే మరచిపోం, క్షమించం బదులు తీర్చుకుంటాం అంటూ సాహసోపేతంగా పోరాడుతున్నారు. రష్యా బలం ముందు ఉక్రెయిన్ బలం సరిపోకపోయినప్పటికీ తమ దేశం కోసం ఒక సైనికుడిలా మారి ముందుండి నడిపిస్తున్నందుకు జెలెన్‌స్కీ గౌరవార్థం రష్యా ఎంబీసీ వెలుపల ఈ గుర్తును ఉంచారు.
(చదవండి: యుద్ధం 11 ఏళ్ల బాలుడిని ఒంటరిగా దేశం దాటేలా చేసింది)
Comments
Please login to add a commentAdd a comment