
న్యూఢిల్లీ: క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా స్పేస్–టెక్ సంబంధ నవకల్పనలకు ఊతమిచ్చేలా ఇస్రో, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్–స్పేస్)తో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి కొత్త ఆవిష్కరణలు చేసే దిశగా స్పేస్ స్టార్టప్‌లు, పరిశోధన సంస్థలు, విద్యార్థులకు క్లౌడ్ టెక్నాలజీలను అందుబాటులో ఉంచడానికి ఈ ఒప్పందం ఉపయోగపడగలదని ఏడబ్ల్యూఎస్ ఇండియా, సౌత్ ఏషియా డైరెక్టర్ శాలిని కపూర్ తెలిపారు. అంతరిక్ష రంగం మరింత మెరుగైన నిర్ణయాలను, వేగవంతంగా తీసుకునేందుకు క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారిత ఆవిష్కరణలు సహాయపడగలవని ఆమె వివరించారు.