
సాక్షి, రాజమహేంద్రవరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియమించినవారి జాబితాలో జిల్లా నుంచి రాజా ఒక్కరినే ఎంపిక చేశారు. పార్టీ అధికారంలోకి రాకముందు వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా సమర్థంగా పనిచేశారు. తాజాగా రాష్ట్ర« అధికార ప్రతినిధిగా నియమించటంతో జక్కంపూడి అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి అప్పగించిన ఈ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment