
సాక్షి, తూర్పుగోదావరి : గత టీడీపీ పాలనలో 50 లక్షల టన్నుల ఇసుక తరలిపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. సీతానగరం ర్యాంపుల నుంచి పెద్దఎత్తున ఇసుకను కొల్లగొట్టారని దుయ్యబట్టారు. మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, నారా లోకేష్ కలిసి రూ.350 కోట్లు దోచుకున్నారని, గత పాలకుల నిర్లక్ష్యం వల్లే రోడ్లు పాడైపోయాయని మండిపడ్డారు. తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పెందుర్తి ఆరు నెలలకు ఒకసారి బయటకొస్తారని ఎద్దేవా చేశారు. చదవండి: జక్కంపూడి రాజా ఆమరణ దీక్ష విజయవంతం
బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్ర సృష్టించారని ఎమ్మెల్యే అనన్నారు. మ్యానిఫెస్టోలో ప్రతి హామీని నెరవేర్చడానికి సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు. కేబినెట్‌లో 60 శాతం మంత్రులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే ఉన్నారని, రైతు భరోసా రెండో విడత పెట్టుబడి సాయం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు. వరద నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు: జక్కంపూడి రాజా
Comments
Please login to add a commentAdd a comment