ఎస్పీకి వినతిపత్రం ఇచ్చిన వైఎస్సార్‌సీపీ నేతలు చెల్లుబోయిన వేణు, జక్కంపూడి రాజా
తూర్పుగోదావరి జిల్లా బుర్రిలంకలో బాధిత కుటుంబానికి ఆర్థికసాయం
రాష్ట్రంలో నిత్యం హత్యలు, మానభంగాలు జరుగుతున్నాయని ఆవేదన
దిశ వ్యవస్థను తీసేసి నేరస్తులకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని ఆగ్రహం
కడియం: తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక పంచాయతీలోని బుర్రిలంకలో మహిళపై అత్యాచారం చేసి, హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఎస్పీ డి.నరసింహకిశోర్‌ని కోరారు. వారు శనివారం రాజమహేంద్రవరంలో ఎస్పీని కలిసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం వారు పార్టీ నాయకులతో కలిసి బుర్రిలంకలో బాధితురాలు రౌతు కస్తూరి కుటుంబాన్ని పరామర్శించారు.
పార్టీ తరఫున రూ.1.1 లక్షల ఆర్థికసాయం అందజేశారు. న్యాయం జరిగేంతవరకు తాము అండగా ఉంటామని బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం వారు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ తరఫున తాము వస్తున్నామని.. కూటమి ఎమ్మెల్యే హడావుడిగా వచ్చి బాధితుల చేతిలో రూ.పదివేలు పెట్టి వెళ్లడం చూస్తుంటే ఈ ఘటన పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో తెలుస్తోందని చెప్పారు. పత్రికలు తిరగేస్తే ఓ హత్య, ఓ మానభంగం కచ్చితంగా కన్పిస్తున్నాయన్నారు. ఇలాంటి దారుణాలను ప్రశ్నిస్తున్న వైఎస్సార్‌సీపీ వాళ్ల కాళ్లు విరగ్గొడతామని, 11 సీట్లు వచ్చినా నోరు లేస్తోందా అంటూ బెదిరిస్తున్నారని చెప్పారు.
దిశ యాప్ తీసేయడం ద్వారా నేరాలు చేసేవారికి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చినట్లయిందన్నారు. ఇంత పాశవికంగా మహిళను హత్య చేస్తే జనసేన, టీడీపీ నాయకులు బైటకు పొక్కకుండా చేయాలని ప్రయత్నించడం శోచనీయమని చెప్పారు. దోషులను కఠినంగా శిక్షించకపోతే తమపార్టీ ఉద్యమిస్తుందని వారు తెలిపారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించినవారిలో వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రుడా మాజీ చైర్ç³ర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నక్కా రాజబాబు, గిరజాల బాబు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment