
సాక్షి, రాజమండ్రి: టీడీపీ సీఆర్‌డీఏను చంద్రబాబునాయుడు రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ అథారిటీగా మార్చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జక్కంపుడి రాజా మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. అర్హులందరికి సంక్షేమ పథకాలను అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబు అనాలోచిత నిర్ణయాల వల్లే అర్థిక పరిస్థితి కుంటుపడిందని ఆయన విమర్శించారు. కృతిమ ఉద్యమంతో చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారని జక్కంపుడి రాజా ఆగ్రహించారు. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు మాజీ పీఎస్ వద్దే రూ. రెండు వేల కోట్ల అక్రమ సంపాదన బయటపడిందంటే.. చంద్రబాబు, లోకేష్ వద్ద ఎన్ని కోట్ల అవినీతి సోమ్ము ఉందో అని రాజా ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ పాస్‌పోర్టులను సీజ్ చేయాలని రాజా తెలిపారు. (ఇంత బతుకు బతికి ఇంటెనక... అన్నట్లు)
Comments
Please login to add a commentAdd a comment