rajamandri
-
రాకీ అవెన్యూస్ వివాదంపై వివరణ ఇచ్చిన యాంకర్ సుమ
రాజమండ్రిలో రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ బోర్డు తిప్పేయడంతో చాలామంది రోడ్డున పడ్డారు. మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కల నెరవేరుస్తామని చెప్పి తమ నుంచి లక్షల్లో డబ్బు తీసుకుని ఆ సంస్థ మోసం చేసిందని వారు ఆరోపించారు. ఆ సంస్థను ఒక యాడ్ ద్వారా సుమతో పాటు ఆమె భర్త, రాజీవ్ కనకాల ప్రమోట్ చేయడంతో తామందరం పెట్టుబడి పెట్టామని వారు తెలిపారు. దీంతో సుమ కూడా వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా యాంకర్ సుమ సోషల్‌మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.'రాకీ అవెన్యూస్కు సంబంధించిన ఒక యాడ్‌లో నేను గతంలో నటించాను. నా వృత్తిలో భాగంగా 2016-2018 వరకు మాత్రమే వారితో ఒప్పందం ఉంది. ఆపై ఆ ప్రకటనలు రద్దు చేయబడ్డాయి. ఈ ప్రకటనలు ఇప్పుడు అనధికారమైనవి అని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. పైన పేర్కొన్న వ్యవధి తర్వాత నేను ఏ సందర్భంలోనూ రాకీ అవెన్యూస్కు సంబంధించిన యాడ్‌లో కనిపించలేదు. అయితే, కొంత కాలం తర్వాత పాత ప్రకటనలు సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నాయని నా దృష్టికి వచ్చింది. ఇటీవలి కాలంలో నేను రాకీ అవెన్యూల ఆస్తుల కొనుగోలుదారుల నుంచి కొన్ని లీగల్ నోటీసులను అందుకున్నాను. ఆపై వారి నోటీసులకు నేను సమాధానం ఇవ్వడం కూడా జరిగింది. ఈ క్రమంలో రాకీ అవెన్యూలకు పంపిన లీగల్ నోటీసులో కొనుగోలుదారుల జాబితాను కూడా పరిశీలించమని వారిని కోరాను. నేను కూడా ఈ సమస్యను పరిష్కరించేందకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాను. తప్పుడు సమాచారాన్ని అరికట్టండి. అధికారిక ఛానెల్‌ల నుంచి వచ్చే ఏదైనా ప్రకటనలు, ప్రమోషన్లు, వీడియోలను ధృవీకరించమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ధృవీకరించబడిన సమాచారాన్ని మాత్రమే ఇతరులతో పంచుకోవాలని నేను ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.' అని సుమ తెలిపారు. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ ఆత్మహత్య
టాలీవుడ్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ (33) బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్‌లోని కావూరి హిల్స్‌లో ఈ ఘటన జరిగింది. కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా స్వప్న వర్మ పనిచేస్తుంది. టాలీవుడ్లో పలు చిన్ని సినిమాలకు ఆమె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేసినట్లు తెలుస్తోంది.ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చెందిన స్వప్న వర్మ మూడు సంవత్సరాల క్రితం సినీ ఇండస్ట్రీలో నిలబడాలని హైదరాబాద్‌కు వచ్చింది. అయితే, గతేడాది నుంచి మాదాపూర్ కావూరి హిల్స్‌లోని తీగల హౌస్ అపార్ట్మెంట్ 101 ఫ్లాట్‌లో ఆమె ఒంటరిగానే ఉంటుంది. ఆరు నెలలుగా సినిమా పరిశ్రమలో తనకు ఎలాంటి ప్రాజెక్టు లేకుండా ఖాళీగా ఉండటంతో ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం తన ఫ్లాట్‌లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఆమెకు సంబంధించిన వారు ఎవరూ లేకపోవడంతో సమాచారం వెంటనే తెలియలేదు. బాడీ డి కంపోజ్ అవ్వడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు ఎక్కడ నివసిస్తున్నారు : ఎంపీ మార్గని భరత్
-
రాజమండ్రిలో లోన్ యాప్ వేధింపులకు మరొకరు బలి
-
బైక్ నడుపుతూ సందడి చేసిన మంత్రి రోజా
-
గోదావరి ఉగ్రరూపం.. అధికారులను హెచ్చరించిన విపత్తుల శాఖ
సాక్షి, రాజమండ్రి: భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో, ధవళేశ్వరం వద్ద ప్రస్తుత నీటి మట్టం 13.70 అడుగులకు చేరింది. ఈ క్రమంలో 12.74 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి చేరుతోంది. వరద ఉధృతి పెరుగుతున్న కారణంగా అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఇక, ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి వరదతో గౌతమి, వశిష్ట, వైనతేయ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో.. కనకాయలంక, టేకిశేట్టిపాలెం, ఎదురుబిడియం, అప్పనపల్లి కాజేవేలు నీట ముగిగాయి. ఇక ఏజెన్సీ ప్రాంతంలో కొండ వాగులు, శబరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ కారణంగా కూనవరం, వీఆర్ పురం, ఎటపాక మండలాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ నేపథ్యంలో విపత్తుల శాఖ ముంపు ప్రాంతాల అధికారులను అప్రమత్తం చేసింది. నిరంతరం స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి వరద ఉధృతిపై పర్యవేక్షణ జరుగుతోంది. వరద ప్రభావిత జిల్లాల్లోని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. మరోవైపు.. గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ అధికారులు హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. శ్రీశైలం జలాశయానికి సైతం వరద కొనసాగుతోంది. దీంతో, అధికారులు 9 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇక, శ్రీశైలానికి ఇన్‌ఫ్లో 3.23 లక్షలుగా ఉండగా.. ఔట్ ఫ్లో 3.13 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో.. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో కరెంట్ ఉత్పత్తి కొనసాగుతోంది. -
అనాథలైన చిన్నారులకు చెరో 5లక్షలు సాయం అందించాలని సీఎం జగన్ ఆదేశం
-
అక్టోబర్ 1న రాజమండ్రిలో దసరా మహిళా సాధికారత ఉత్సవం
-
లోన్ యాప్ వేధింపులకు మరో ఇద్దరు బలి
-
‘ఎన్టీఆర్‌ను అమిత్ షా కలవగానే చంద్రబాబుకు వణుకు మొదలైంది’
సాక్షి, రాజమండ్రి(తూర్పుగోదావరి జిల్లా): టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిచ్చి ఆసుపత్రిలో చేరే రోజులు దగ్గరపడ్డాయని ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. కుప్పంలో చంద్రబాబు కోట కూలిపోతోందని.. అందుకే చంద్రబాబు పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాగా, మంత్రి ఆర్కే రోజా.. రాజమండ్రిలో శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు నాయుడు పిచ్చి ఆసుపత్రిలో చేరే రోజులు దగ్గరపడ్డాయి. మొన్నటి వరకు ఓ ఫేక్ వీడియోతో చంద్రబాబు నాటకాలు ఆడారు. నిన్న కుప్పంలో మరో నాటకానికి తెరలేపారు. సీఎం ఏం చేసినా రాద్దాంతం చేయాలని బాబు చూస్తున్నారు. చంద్రబాబును కుప్పం ప్రజలు కూడా నమ్మడం లేదు. కుప్పంలో తన కోట కూలిపోతోందని బాబు భయపడుతున్నాడు. అందుకే తన కార్యకర్తలను రెచ్చగొడుతూ ఓ అమ్మాయి అని కూడా చూడకుండా ఎంపీపీ మీద దాడి చేశారు. ఎప్పుడైతే కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసి మాట్లాడారో.. అప్పటి నుంచి చంద్రబాబులో వణుకు మొదలైంది. రాజకీయంగా కాదు.. అన్ని రకాలుగా చంద్రబాబును ప్రజలు అసహ్యించుకుంటున్నారని బాబు.. ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నార’ని విమర్శించారు. ఇది కూడా చదవండి: అందుకే సీఎం జగన్ జననేత అయ్యారు..! -
మృత్యువులోనూ వీడని స్నేహం
ఆత్రేయపురం/రాజమహేంద్రవరం రూరల్: బిడ్డలను కోల్పోయిన ఆ రెండు కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక వద్ద గోదావరిలో మంగళవారం సాయంత్రం నలుగురు విద్యార్థులు స్నానం చేస్తుండగా ఇద్దరు గల్లంతైన విషయం విదితమే. బుధవారం పోలీసులు, కుటుంబ సభ్యులు, ఈతగాళ్లతో గాలించడంతో పిచ్చుకలంకకు సుదూర ప్రాంతంలో హుకుంపేట గ్రామానికి చెందిన మెండి జోసఫ్ (బాబి)(15), ఈతకోట చిన్న(15) మృతదేహాలు బయటపడ్డాయి. మృతదేహాలను ఆత్రేయపురం ఎస్సై నరేష్ పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం ఇరువురి మృతదేహాలు హుకుంపేట చేరుకోవడంతో వారి ఇండ్లతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులు ఇద్దరూ ప్రాణ స్నేహితులని..ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లే వారని, చివరికి మరణంలో కూడా వీరి స్నేహబంధం వీడలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరువురు ఒకే రెడ్ కలర్ టీషర్టులు ధరించి ఉండటం చూపరులను కంటతడి పెట్టించింది. కుటుంబాల ఇంట గూడుకట్టిన విషాదం మెండు జోసఫ్(బాబి) తండ్రి రవికుమార్ నాలుగేళ్ల క్రితం మోరంపూడి సెంటర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. తల్లి కమలకుమారి కూలిపనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తోంది. మతిస్థిమితం లేని అక్కను చూసుకుంటుంది. చదువుకుని కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న తరుణంలో బాబి మరణించాడు. దీంతో కమలకుమారి తనను అన్యాయం చేసి వెళ్లిపోయావా కొడకా అంటూ గుండెలవిసేలా రోదించింది. ఈతకోట చిన్న తల్లిదండ్రులు రాణి, వెంకన్న కూలిపనులు చేసుకుని ముగ్గురు పిల్లలను పోషించుకుంటూ వస్తున్నారు. చిన్నకు అక్క,అన్నయ్య ఉన్నారు. ఇంటిలో చిన్నవాడైన చిన్నను తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుకున్నారు. సరాదాగా స్నేహితులతో వెళ్లిన కుమారుడు విగతజీవిగా తిరిగిరావడంతో తల్లితండ్రులు రాణి, వెంకన్న తేరుకోలేకపోతున్నారు. -
జెన్కో ఇంజనీర్ అనుమానాస్పద మృతి
సాక్షి, రాజమండ్రి: జెన్కో ఇంజనీర్ శ్రీనివాస్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన బుధవారం స్థానికంగా కలకలం రేపింది. సీలేరులో ఒంటరిగా హోం క్వారంటైన్లో ఉన్న శ్రీనివాస్ అకస్మాత్తుగా తన ఇంట్లో శవమై కనిపించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. కాగా గత మూడు రోజులుగా ఫోన్ చేస్తుంటే తన కాల్స్‌కు సమాధానం ఇవ్వకపోవడంతో మృతుడి భార్య పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పోస్టుమార్టం రిపోర్ట్స్ రావాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. -
కరోనా పరీక్షలు చేయించుకున్న ఎంపీ భరత్
సాక్షి, తూర్పు గోదావరి : వైఎస్సార్సీపీ ఎంపీ మార్గని భరత్‌రామ్ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. సోమవారం స్థానిక వైద్యులు ఎంపీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఎంపీ భరత్‌రామ్ మాట్లాడుతూ.. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రజాజీవితంలో ఉండటంతో ఇప్పటివరకు కుటుంబంతో కలవడం సాధ్యం కాలేదని తెలిపారు. తనపై సోషల్ మీడియా, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వేదికగా వ్యక్తిగత జీవితంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే డీజీపీకి ఫిర్యాదు చేశానని, పరువునష్టం దావా వేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాని భరత్‌రామ్ తెలిపారు. -
‘చంద్రబాబు, లోకేష్ పాస్‌పోర్టులను సీజ్ చేయాలి’
సాక్షి, రాజమండ్రి: టీడీపీ సీఆర్డీఏను చంద్రబాబునాయుడు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీగా మార్చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జక్కంపుడి రాజా మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. అర్హులందరికి సంక్షేమ పథకాలను అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు అనాలోచిత నిర్ణయాల వల్లే అర్థిక పరిస్థితి కుంటుపడిందని ఆయన విమర్శించారు. కృతిమ ఉద్యమంతో చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారని జక్కంపుడి రాజా ఆగ్రహించారు. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు మాజీ పీఎస్ వద్దే రూ. రెండు వేల కోట్ల అక్రమ సంపాదన బయటపడిందంటే.. చంద్రబాబు, లోకేష్ వద్ద ఎన్ని కోట్ల అవినీతి సోమ్ము ఉందో అని రాజా ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ పాస్‌పోర్టులను సీజ్ చేయాలని రాజా తెలిపారు. (ఇంత బతుకు బతికి ఇంటెనక... అన్నట్లు) -
ఇంగ్లీష్ విద్యపై ప్రభుత్వ నిర్ణయం సరైందే
-
‘ప్రభుత్వ నిర్ణయాల్లో తప్పేమీ లేదు’
సాక్షి, తూర్పుగోదావరి: ఇంగ్లీష్ విద్యపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో తప్పేమీ లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. ఆయన గురువారం రాజమండ్రిలో మీడియాలో మాట్లాడుతూ.. తెలుగును ఒక సబ్జెక్టుగా ఉంచి ఇంగ్లీష్ మాధ్యమంలో బోధిస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. ప్రైవేటు పాఠశాలల్లో కూడా తెలుగును సబ్జెక్టుగా కొనసాగించాలని సూచించారు. ఇసుక సమస్యను ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులకు అవినీతి మకిలి అంటుకోలేదని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అన్యాయంగా జరిగిందని లోక్‌సభలో ఈ అంశాన్ని మరోసారి లేవనెత్తాలని సీఎం జగన్‌కు లేఖ రాసినట్టు ఆయన వెల్లడించారు. రాజమండ్రి దానవైపేట ప్రకాష్ నగర్ కోపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. దీన్ని ‘కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ సెంటర్’ గా వ్యవహరిస్తామని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. -
చంద్రబాబుకు ఎంపీ మర్గాని భరత్ సవాల్
సాక్షి, రాజమండ్రి: ఇసుక కొరత నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలను రాజమండ్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మర్గాని భరత్ తోసిపుచ్చారు. ఇసుక విషయంలో తనపై చేసిన ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయ సన్యానానికి సిద్ధమని ఆయన ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు. బుధవారం ఆయన రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అద్భుత పాలన చేస్తూంటే జీర్ణించుకోలేని చంద్రబాబు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. గోదావరి నదీ తీరంలో ఉన్న ఇసుకను తరలించానని తనపై టీడీపీ ఆరోపణలు చేయడం సిగ్గు చేటు అని ఆయన ధ్వజమెత్తారు. తాను ఇసుక నుంచి ఒక్క రూపాయి సంపాదించినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని పేర్కొన్నారు. బలహీన వర్గాలకు చెందిన ఒక యువకుడిని ఎంపీగా ఎన్నికైతే..తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. గతంలో టీడీపీకి చెందిన మురళీమోహన్, ఆయన బంధువులు ఇసుక నుంచి వందల కోట్లు దోచారని, ఇందులో చంద్రబాబుకు కూడా షేర్ ఉందన్నారు. పెందుర్తి వెంకటేశ్వర్లు కూడా ఇసుక పేరుతో దోచుకున్నారని విమర్శించారు. తనపై బురద చల్లచడం సిగ్గుచేటు అన్నారు. ప్రజలు ఎవరూ కూడా టీడీపీ నేతలను నమ్మే పరిస్థితి లేదన్నారు. 23 సీట్లు ఇచ్చారంటే రాష్ట్ర ప్రజలు ఏరకంగా తిరస్కరించారో జ్ఞానోదయం చేసుకోవాలన్నారు. సుమారు 800 ఎకరాలల్లో ఇసుక తవ్వకాలు చేసి టీడీపీ నేతలు ఎలా దోచుకున్నారో అందరికి తెలుసు అన్నారు. తనపై టీడీపీ నేతలు చేసిన ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ప్రచారం కోసం చంద్రబాబు వందల కోట్లు ఖర్చు చేసి రాష్ట్ర ఖజానా ఖాళీ చేశారన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రజాధనాన్ని ఆదా చేస్తూ సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు చేస్తున్నారని, సుపరిపాలనను చూసి ఓర్వలేక చంద్రబాబు దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు అవాకులు, చవాకులు పేలడం మానుకోవాలని మర్గాని భరత్ హితవు పలికారు. -
జైలు జీవితం నుంచి జనజీవనంలోకి..
సాక్షి, రాజమహేంద్రవరం : తప్పు చేశారు. ఆ తప్పులకు శిక్ష కూడా అనుభవించారు. పశ్చాత్తాపంతో జైలు జీవితాన్నీ గడిపిన ఆ ఖైదీలు ఎట్టకేలకు జైలు జీవితం నుంచి విముక్తిపొందారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి 12 మంది ఖైదీలు విడుదలయ్యారు. అర్హులైన ఖైదీలకు గత టీడీపీ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించకపోవడంతో కొందరు ఖైదీలు కోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్ స్వీకరించిన హైకోర్టు అర్హులైన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ తీర్పునిచ్చింది. ఈ మేరకు ఖైదీలు విడుదలయ్యారు. ఈ ఏడాది జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా అప్పటి టీడీపీ ప్రభుత్వం జీఓ నంబర్ 6 విడుదల చేస్తూ రాష్ట్రంలో అర్హులైన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించేందుకు జీవో విడదల చేసింది. దాని ప్రకారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి 57 మంది సత్ప్రవర్తన కలిగిన ఖైదీలున్నారని, వీరు క్షమాభిక్షకు అర్హులని జైలు అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. అయితే టీడీపీ ప్రభుత్వం జీవో 46 ప్రకారం కేవలం ఎనిమిది మంది ఖైదీలను మాత్రమే విడుదల చేసింది. ప్రభుత్వ పక్షపాత వైఖరికి అర్హులైన ఖైదీలు హైకోర్టును ఆశ్రయించారు. ఖైదీల పిటిషన్ విచారణ చేసిన కోర్టు అర్హులైన ఖైదీలను విడుదల చేయాలని తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి కోర్టుకు వెళ్లిన ఖైదీలు జూలై ఒకటో తేదీన ఒకరు విడుదల కాగా, ఆగస్టు నెలలో 11 మంది, సెప్టెంబర్ ఒకటో తేదీన ఎనిమిది మంది, సెప్టెంబర్ 12న 12 మందిని విడుదలయ్యారు. మరో 17 మంది అర్హులైన ఖైదీలు ఈ వారంలో విడుదలవుతారని సెంట్రల్ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ కె.వెంకట రాజు పేర్కొన్నారు. విడుదలైన ఖైదీలు వీరే.. చేదల రామిరెడ్డి, కాపర్తి సత్యనారాయణ, నక్కా సత్యనారాయణ, మోర్త నాగేశ్వరావు, గుమ్మడి ఏసు, ఉచ్చుల రాఘవులు, గంటేటి ప్రసాద్, శెట్టి చిన్నయ్య, గంటి నూకరాజు, డేరింగుల సుమంత్, పొలినాటి ప్రేమ్ కుమార్, చెక్కా జోసఫ్. టీడీపీ ప్రభుత్వ తీరుతో నా కుమారుడిని కోల్పోయాను నేను 2010లో హత్య కేసులో శిక్షపడి జైలుకు వచ్చాను. వ్యవసాయం చేసుకుని జీవించేవాడిని, నాకు ముగ్గురు పిల్లలు. ఒక కుమారుడికి వివాహమైంది. విడుదల కావడం సంతోషంగా ఉంది. కుటుంబం ఇబ్బందుల్లో ఉంది. ఎదైనా పని చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటాను. నేను విడుదలవుతానని ఆశతో ఎదురు చూసిన నా చిన్న కుమారుడు గణేష్ విడుదల కాకపోవడంతో నిరాశ చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. – చెక్కా జోసఫ్ గుంటూరు కుటుంబాన్ని చక్కదిద్దాలి నా కుటుంబ ఆస్తితగాదాలో కుమారుడిని కోల్పోయాను. దానికి నేనే కారణమయ్యాను. 2010లో జీవిత ఖైదీ పడింది. కూలి పనులు చేసుకుని జీవించేవాడిని, జీవనోపాధి వెతుక్కొని కుటుంబాన్ని పోషించుకోవాలి. – నక్కా సత్యనారాయణ, రాజోలు -
భారీ వర్షాలు; పెరుగుతున్న గోదావరి ఉధృతి
సాక్షి, తూర్పుగోదావరి : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని రాజమండ్రి వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. మరో 24 గంటల్లో వరద తీవ్రత మరింత పెరిగే సూచనలు కనిపిస్తుండటంతో గోదావరి తీర లంక గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 8 లక్షల 60 వేల క్యూసెక్కులు ఉండగా గంట గంటకు ఉధృతి పెరుగుతూ నది ఉగ్రరూపం దాల్చుతోంది. భారీగా కురుస్తున్న వర్షాలకు దేవిపట్నం మండలంలోని దాదాపు 26 గ్రామాలు వరద ముంపులోనే ఉన్నాయి. ధవళేశ్వరం బ్యారేజి వద్ద నీటి మట్టం ఇప్పటికే 10.6 అడుగులకు చేరడంతో బ్యారేజ్ 175 గేట్లు పూర్తిగా ఎత్తివేశారు. ధవళేశ్వరం దిగువన గోదావరి ఉప నదులైన వశిష్ట, వైనతేయ, గౌతమి పరవళ్లు తొక్కుతున్నాయి. సాయంత్రానికి నీటిమట్టం విలువ మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేయనున్నారు. ఇప్పటికే భద్రాచలం వద్ద గోదారి వరద పోటెత్తడంతో మొదటి ప్రమాదపు హెచ్చరికలు జారీ చేశారు. -
విద్యుత్ షాక్‌తో కౌలురైతు మృతి
సాక్షి, కడియం (రాజమహేంద్రవరం రూరల్): దుళ్ల గ్రామానికి చెందిన కౌలురైతు తోట చింతాలు (59) పొలంలో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కౌలుకు తీసుకున్న చేనులో మోటారు తిరగడం లేదని అతడు గోతిలోకి దిగి చూశాడు. మోటార్‌ను తాకిన వెంటనే షాక్‌కు గురై గోతిలో కుప్పకూలిపోయాడు. తోటి రైతులు విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారు సరఫరాను నిలిపివేసి అతడిని బయటకు తీశారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు స్థానిక ప్రైవేటు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్సై ఎల్.కనకరాజు కేసు నమోదు చేశారు. సంఘటన స్థలాన్ని కడియం ఎసై ఎ.వెంకటేశ్వరరావు వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలిచారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కౌలురైతు చింతాలు (ఫైల్) -
‘చంద్రబాబు మమ్మల్నీ మోసం చేశారు’
సాక్షి, రాజమహేంద్రవరం : అబద్దపు హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు చివరికి తమకు కూడా అన్యాయం చేశారని దివ్యాంగులు వాపోతున్నారు. మంగళవారం ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్న కొంతమంది దివ్యాంగులు తమ కష్టాలను ఆయనతో పంచుకున్నారు. సైగలతో వారు పడుతున్న కష్టాలను తెలపడం అక్కడున్న వారిని కలచివేసింది. తమకు వచ్చే పెన్షన్ సరిపోవడం లేదని తెలిపారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం ద్వారా గుండె ఆపరేషన్లు చేయించుకున్న వారు వైఎస్ జగన్ కలిసి తాము ఇప్పుడు బతికి ఉండేందు కారణం వైఎస్ఆర్ దయే అని తెలిపారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సువర్ణయగం చూశామని, ఇప్పుడా పరిస్థితి లేదని.. మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే వైఎస్ తరహా పాలన సాధ్యమవుతుందని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి అగ్నికులక్షత్రియులు.. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జొన్నలంక వద్ద వైఎస్ జగన్‌ను కలుసుకున్న వంద మంది అగ్నికుల క్షత్రియులు ఆయన సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. అదే గ్రామంలో ఓ పసిబిడ్డకు రాజశేఖర్ అని నామకరణం చేశారు వైఎస్ జగన్. ఆయన చేత తమ బిడ్డకు పేరు పెట్టించాలని దాదాపు మూడు నెలల నుంచి ఎదురుచూస్తున్నట్లు ఆ బిడ్డ తల్లిదండ్రులు తెలిపారు. ఆ మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టినందుకు వారు ఆనందం వ్యక్తం చేశారు. -
బాలికపై అత్యాచారం కేసులో పదేళ్ల జైలు శిక్ష
రాజమహేంద్రవరం క్రైం : మైనర్‌పై అత్యాచారం కేసులో పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. చింతూరు ఎస్సై శ్రీనివాస కుమార్ కథనం ప్రకారం.. 2015 నవంబర్ 28న చింతూరుకు చెందిన తిలపురెడ్డి సాయి మణికంఠ, చింతూరు జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న బాలికను కాలేజీ వెనుకకు తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. బాలికను వివాహం చేసుకోమంటే కులం తక్కువ అని నిరాకరించాడు. ఈ సంఘటన పై అప్పటి చింతూరు ఎస్సై గజేంద్ర కుమార్ కేసు నమోదు చేశారు. అప్పటి డీఎస్పీ సుంకర మురళీ మోహన్ దర్యాప్తు చేసి కేసును రాజమహేంద్రవరం ఒకటో అదనపు జిల్లా సెషన్ కోర్టులో విచారణ నిమిత్తం పంపారు. కేసును విచారణ చేసిన ఒకటో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి కిషోర్ కుమార్ తీర్పు ఇస్తూ నిందితుడిపై నేరం రుజువు కావడంతో పదేళ్ల జైలుశిక్షతోపాటురూ.వెయ్యిజరిమానావిధిస్తూ తీర్పు ఇచ్చారు. -
ఇంటికి రానా? బ్రిడ్జిపై నుంచి దూకి చావనా?
రాజమహేంద్రవరం క్రైం: భార్య వేధింపులు తాళలేక గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనమైంది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళానికి చెందిన పిరియ కరుణ కుమార్(32) పదేళ్ల క్రితం రాజమహేంద్రవరానికి చెందిన రమ్య అనే యువతిని ప్రేమించాడు. ఇంట్లో చెప్పకుండా ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొంతకాలం అడ్రస్ తెలియకపోవడంతో తల్లిదండ్రులు కరుణకుమార్‌ను వెతుక్కుంటూ రాజమహేంద్రవరం వచ్చారు. కరుణకుమార్ తండ్రి ధవళేశ్వరం గ్రామంలో టైలరింగ్ పని చేసుకుని జీవిస్తుండగా, కరుణకుమార్ కార్లు అమ్మకం, కొనుగోలు వ్యాపారం చేసుకుంటున్నాడు కరుణ కుమార్, రమ్యలకు ఒక బాబు, పాప ఉన్నారు. పెళ్లయినప్పటి నుంచి భార్య రమ్యతో మనస్పర్థలు ఉన్నట్టు మృతుడి సోదరుడు మనోజ్, బంధువులు పేర్కొంటున్నారు. ప్రతీ విషయానికి గోడవలు పడడంతో మద్యానికి బానిసైన కరుణకుమార్ జీవితంపై విరక్తి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని అంటున్నారు. కార్ల అమ్మకాలు లేకపోవడం, భార్యతో గొడవగా ఉండడంతో మంగళవారం కరుణకుమార్ తనతో కలిసి కార్లు వ్యాపారం చేసే వీరేంద్రను మోటారు సైకిల్‌పై కొవ్వూరులో కారు ఉంది కొందామని తీసుకువెళ్లాడు. రోడ్డు కం రైల్వే బ్రిడ్జి మీద ఫోన్లో మాట్లాడేందుకు మోటారు సైకిల్ ఆపాడు. భార్యతో ఫోన్లో మాట్లాడినట్టు స్నేహితులు పేర్కొంటున్నాడు. భార్యతో ఫోన్లో మాట్లాడి.. భార్యతో ఫోన్లో మాట్లాడే సందర్భంలో కరుణకుమార్ ‘‘ఇంటికి రానా? లేక బ్రిడ్జి మీద నుంచి దూకి చావనా?’’ అంటూ భార్యతో అన్నట్టు స్నేహితుడు పేర్కొంటున్నారు. దీనికి భార్య ‘‘దూకి చావు నీకు, నాకు ఏవిధమైన సంబంధం లేదు’’ అంటూ సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో స్నేహితుడికి సెల్ ఫోన్ ఇచ్చి మూత్ర విసర్జన చేసి వస్తానని చెప్పి కొంత దూరం వెళ్లి బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని మృతుడి స్నేహితుడు ఫోన్లో భార్య రమ్యకు చెప్పగా ‘‘అతడికి, తనకు ఏ విధమైన సంబంధం లేదని, అతని తల్లిదండ్రులకు చెప్పండి’’ అంటూ సమాధానం ఇచ్చినట్టు తెలిపారు. వెంటనే స్నేహితుడు 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గోదావరి నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం గోదావరిలో నుంచి మృతదేహాన్ని తీసి పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గుండె పోటుతో జీవిత ఖైదీ మృతి
రాజమహేంద్రవరం క్రైం : గుండె పోటుతో జీవిత ఖైదీ మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం నెహ్రూనగర్‌కు చెందిన తుమ్మల వెంకటేశ్వరరావు(41) గుండె పోటుతో శుక్రవారం మృతి చెందాడు. ఉదయం ఆరు గంటలకు పెట్రోల్ బంక్‌లో పని చేసేందుకు వచ్చిన వెంకటేశ్వరరావు పది గంటల సమయంలో గుండె నొప్పిగా ఉందని పెట్రోల్ బంక్‌లో పడిపోయాడు. ఇతడిని సెంట్రల్ జైలులో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య చికిత్సలు అందించిన అనంతరం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.తన భార్య ఆత్మహత్య కేసులో ముద్దాయిగా ఉన్న మృతుడికి 2014 జనవరి 14న కోర్టు ఏడేళ్ల కారాగార శిక్ష విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు శిక్ష నిమిత్తం వచ్చాడు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ఓపెన్ ఎయిర్ జైల్‌కు వేస్తారు. దీనిలో భాగంగా 2017 జనవరి ఏడో తేదీన ఓపెన్ ఎయిర్ జైలుకు వెంకటేశ్వరరావును మార్చారు. జైలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్‌లో పని చేస్తుండేవాడు. సత్ ప్రవర్తన కలిగి ఉండేవాడు. మృతుడు జైలుకు రాకముందు సెల్స్ టాక్స్ శాఖలో క్లర్కుగా పని చేయడంతో అకౌంట్లు బాగా రాసేవాడు. దీంతో బంక్‌లోని రికార్డులు సక్రమంగా రాసేవాడని తోటి ఖైదీలు పేర్కొంటున్నారు. ఎంతో సౌమ్ముడిగా ఉండే వెంకటేశ్వరరావు అకాల మృతికి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. తన బావమరిదిని సకాలంలో జైలు అధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఉంటే బతికేవాడని మృతుడి బావ రాధాకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. రాజమహేంద్రవరం అర్బన్ తహసీల్దార్ రాజేశ్వరరావు, సబ్ కలెక్టర్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ గిరీష్ పంచనామా నిర్వహించారు. త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో రెండు నెలలో విడుదల ఉండగా.. సత్ ప్రవర్తనతో ఉండే వెంకటేశ్వరరావు మరో రెండునెలలో విడుదల అవుతాడనగా ఆకస్మికంగా మృతి చెందాడని బంధువులు చెబుతున్నారు. సకాలంలో వైద్య సదుపాయం అందక మృతి చెందాడని పేర్కొంటున్నారు. చికిత్స అందించడంలో జాప్యం లేదు జైలులో చికిత్స అందించడంలో జాప్యం చేయలేదు. ఉదయం బీపీ డౌన్ అయ్యిందని జైలులో ఉన్న ఆసుపత్రికి వచ్చాడు. వెంటనే జైలు వైద్యులు చికిత్స అందించారు. ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పడంలో అంబులెన్స్‌తో హుటాహుటిన రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాం. ఖైదీకి వైద్య చికిత్సలు అందించడంలో ఎక్కడా జాప్యం జరగలేదు. – రఘు, రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ డిప్యూటీ సూపరింటెండెంట్ -
కారు బోల్తా : యువకుడి మృతి
రాజమండ్రి : వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి ఎస్వీజీ మార్కెట్ వద్ద జరిగింది. మోరంపూడి వైపు నుంచి వేగంగా వస్తున్న కారు రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్సు సమీపంలోని ఎస్వీజీ మార్కెట్ వద్దకు రాగానే అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైన కారు రాజమండ్రి విజిలెన్స్ డీఎస్పీకి చెందినదిగా గుర్తించారు. క్షతగాత్రుల్లో ఆయన కుమారుడు కూడా ఉన్నట్లు సమాచారం.